ennaDu pakvamu gA - ఎన్నడు పక్వము గా

ఎన్నడు పక్వము (రాగం: ) (తాళం : )

ప|| ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే | సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు ||

చ|| తిత్తితో నూరేండ్లకును దేహము పండగబండగ | చిత్తంబెన్నడు పండక చిక్కెను కసుగాయై |
పొత్తులపుణ్యముబాపము పులుసును తీపై రసమున | సత్తు నసత్తును దోచీ సంసారఫలంబు ||

చ|| వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియు | పొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదే |
తుదనిదె సుఖమును దుఃఖము తోలును గింజయు ముదురుక | చదురము వలయము తోచీ సంసారఫలంబు ||

చ|| వినుకలిచదువుల సదలో వేమరు మాగగ బెట్టిన | ఘనకర్మపుటొగ రుడుగదు కమ్మర పులిగాయై |
మనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుడు కానుక | చనవున నియ్యగ వెలసెను సంసారఫలంబు ||

ennaDu pakvamu (Raagam: ) (Taalam: )

pa|| ennaDu pakvamu gA dide yiMdriyaBOgaMbulacE | sannamu doDDunu dOcI saMsAraPalaMbu ||

ca|| tittitO nUrEMDlakunu dEhamu paMDagabaMDaga | cittaMbennaDu paMDaka cikkenu kasugAyai |
pottulapuNyamubApamu pulusunu tIpai rasamuna | sattu nasattunu dOcI saMsAraPalaMbu ||

ca|| vedavaDi putrulupautrulE vittulu lOlO molaciyu | podi garmapupU mAradu pUpiMdeyina didE |
tudanide suKamunu duHKamu tOlunu giMjayu muduruka | caduramu valayamu tOcI saMsAraPalaMbu ||

ca|| vinukalicaduvula sadalO vEmaru mAgaga beTTina | GanakarmapuToga ruDugadu kammara puligAyai |
manumani SrIvEMkaTESuku mahinAcAryuDu kAnuka | canavuna niyyaga velasenu saMsAraPalaMbu ||