Sri Vaibhava Lakshmi Vratham – శ్రీ వైభవలక్ష్మీ వ్రతకల్పం

Sri Vaibhava Lakshmi Vratham - Puja, Katha –
శ్రీ వైభవలక్ష్మీ వ్రతకల్పం

Goddess Vaibhava Lakshmi seated in Padmasana on a deep pink lotus — four arms holding pink lotus flowers, Varada mudra with gold coins flowing, and Abhaya gesture, wearing pink and teal silk saree with jasmine garlands, jewelled golden crown, two decorated white Airavata elephants with raised trunks spraying sacred water on both sides, golden pots overflowing with coins, brass oil lamps, and pink lotus flowers on sacred water under celestial starlit sky

 (గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం ఆచరించవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధపురుషార్థ ఫలసిద్ధ్యర్థం అఖండిత సర్వవిధ సుఖసౌభాగ్య ప్రాప్త్యర్థం శ్రీవైభవలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీవైభవలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శ్రీసూక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠా –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |

అస్మిన్ కలశే శ్రీవైభవలక్ష్మీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ధ్యానం –
ల॒క్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ॒రంగధామే॑శ్వరీమ్ |
దా॒సీభూతసమస్త దేవ వ॒నితాం లో॒కైక॒ దీపా॑oకురామ్ |
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్ర॒హ్మేన్ద్రగఙ్గా॑ధరాం |
త్వాం త్రై॒లోక్య॒ కుటు॑oబినీం స॒రసిజాం వ॒న్దే ముకు॑న్దప్రియామ్ ||
పద్మాక్షీం వరపద్మశోభితకరౌ పద్మాసనస్థాం శుభామ్ |
శ్రీదేవీం ప్రణతోఽస్మి సంతతమహం ప్రారబ్ధదోషాపహమ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ధ్యాయామి |

ఆవాహనం –
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
సర్వసంపత్ప్రదాత్రీ చ మహాలక్ష్మీమహం భజే |
ఆవాహయామ్యహం లక్ష్మీం సర్వసౌఖ్యప్రదాయినీమ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆవాహయామి |

ఆసనం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే |
సింహాసనమిదం దేవి గృహాణ సురవందితే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి |

పాద్యం –
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ ||
గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయాహృదమ్ |
తోయం ఏతత్ సుఖస్పర్శం పాద్యార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం
జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
అష్టగంధసమాయుక్తం స్వర్ణపాత్రప్రపూరితమ్ |
అర్ఘ్యం గృహాణ మద్దత్తం మహాలక్ష్మి నమోఽస్తు తే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o
శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యే-
-ఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
కర్పూరేణ సుగంధేన సురభిస్వాదుశీతలమ్ |
తోయం ఆచమనీయార్థం దేవి త్వం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
మధుపర్కం మయా దేవి కాంచీనూపురశోభితే |
స్వీకృత్య దయయా దేవి కురుమహం తు మంగళమ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
పంచామృతమిదం దివ్యం పంచపాతకనాశనమ్ |
పంచభూతాత్మికే దేవి పాహి స్వీకృత్య శంకరి ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు మా॒యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
గంగా యమునయోస్తోయైః ఆనీతం నిర్మలం శుభమ్ |
శీతోత్థగమితం దేవి స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |

వస్త్రయుగ్మం –
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ||
సర్వభూషాత్మికే సౌమ్యే లోకలజ్జానివారణి |
వాససి ప్రతిగృహ్యేతాం మయా తుభ్యం సమర్పితే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ సర్వా॒o నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ||
ఉపవీతం మయా ప్రీత్యా కాంచనేన వినిర్మితమ్ |
గృహీత్వ త్వయి భక్తిం మే ప్రయచ్ఛ కరుణానిధే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి |

గంధం –
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
శ్రీకంఠ చందనం దివ్యం గంధాడ్యం సుమనోహరమ్ |
విలేపనం సురశ్రేష్ఠే ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః గంధాన్ ధారయామి |
గంధస్యోపరి హరిద్రాకుంకుమం ధారయామి |

మంగళసూత్రం –
మాంగళ్యం మణిసంయుక్తం ముక్తావిద్రుమ సంయుతమ్ |
దత్తం మంగళసూత్రం చ గృహాణ హరివల్లభే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః మంగళసూత్రం సమర్పయామి |

ఆభరణం –
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
రత్న కంకణ వైడూర్యం ముక్తా హారాదికాని చ |
సుప్రసన్నేన మనసా దత్తాని త్వం గృహాణ మే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆభరణాని సమర్పయామి |

అక్షతాన్ –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శూభాన్ |
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పం –
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||
జాతీ చంపక పున్నాగ కేతకీ వకుళాని చ |
మయాఽర్పితాని సుభగే గృహాణ జగదంబికే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజా –
ఓం చపలాయై నమః – పాదౌ పూజయామి |
ఓం చంచలాయై నమః – జానునీ పూజయామి |
ఓం కమలాయై నమః – కటిం పూజయామి |
ఓం కాత్యాయన్యై నమః – నాభిం పూజయామి |
ఓం జగన్మాత్రే నమః – జఠరం పూజయామి |
ఓం విష్ణువల్లభాయై నమః – వక్షః పూజయామి |
ఓం కమలవాసిన్యై నమః – భుజద్వయం పూజయామి |
ఓం పద్మనిలయాయై నమః – ముఖం పూజయామి |
ఓం కమలపత్రాక్ష్యై నమః – నేత్రద్వయం పూజయామి |
ఓం శ్రియై నమః – శిరః పూజయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః చూ |

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః చూ |

శ్రీవైభవలక్ష్మీ దేవతాయై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

ధూపం –
ఆప॑: సృ॒జన్తు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
వనస్పతి రసోత్పన్న సుగంధేన సమన్వితమ్ |
దేవీ ప్రీతికరో నిత్యం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టి॒o పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్|
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
కార్పాసవర్తి సంయుక్తం ఘృతయుక్తం మనోహరమ్ |
తమో నాశకరం దీపం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి |

నైవేద్యం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టి॒o సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీ॒o జాత॑వేదో మ॒ ఆవహ ||
బహుభక్ష్య సమాయుక్తం నానాఫల సమన్వితమ్ |
నైవేద్యం గృహ్యతాం దేవి నారాయణకుటుంబినీ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి | ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి ||

తాంబూలం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హి॑రణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ |
ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః తంబూలం సమర్పయామి |

నీరాజనం –
స॒మ్రాజ॑o చ వి॒రాజ॑o చాభి॒శ్రీర్యా చ॑ నో గృ॒హే |
ల॒క్ష్మీ రా॒ష్ట్రస్య॒ యా ముఖే॒ తయా॑ మా॒ సగ్ం సృ॒జామసి |
నీరాజనం నీరజాక్షి నారాయణవిలాసినీ |
గృహ్యతాం అర్పితం భక్త్యా గరుడధ్వజ భామిని ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం –
పద్మప్రియే పద్మిని పద్మ॒హస్తే ప॑ద్మాలయే పద్మదళాయతాక్షి |
వి॒శ్వ॒ప్రియే॑ విష్ణు మనో॑ఽనుకూలే॒ త్వత్పా॑దప॒ద్మం మయి॒ సన్ని॑ధత్స్వ ||
యా॒ సా॒ పద్మా॑సన॒స్థా॑ విపులకటితటీ॑ ప॒ద్మపత్రా॑యతా॒క్షీ |
గంభీరా వ॒ర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వ॒స్త్రోత్తరీ॑యా |
లక్ష్మీర్ది॒వ్యై॑ర్గజేన్ద్రైర్మ॒ణిగణ ఖచితైః స్నాపితా హే॑మకు॒మ్భైః |
ని॒త్యం సా॑ పద్మహస్తా మమ వస॑తు గృ॒హే సర్వమా॒ఙ్గల్య॑యుక్తా ||
ల॒క్ష్మీ॒o క్షీ॑రసముద్రరాజతనయాం శ్రీ॒రంగధామే॒శ్వరీ॑o
దా॒సీభూతసమస్త దేవ వ॒నితాం లో॒కైక॒ దీపా॑oకురామ్ |
శ్రీ॒మన్మ॑న్దకటాక్షలబ్ధ విభవ బ్ర॒హ్మేన్ద్రగఙ్గా॑ధరాం
త్వా॒o త్రై॒లోక్య॒ కుటు॑oబినీం స॒రసిజాం వ॒న్దే ముకు॑న్దప్రియామ్ ||
సిద్ధల॒క్ష్మీర్మో॑క్షల॒క్ష్మీ॒ర్జ॒యల॑క్ష్మీః స॒రస్వ॑తీ |
శ్రీలక్ష్మీర్వ॑రల॒క్ష్మీ॒శ్చ॒ ప్ర॒సన్నా॒ మ॑మ స॒ర్వదా ||
ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్న్యై చ॑ ధీమహి |
తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష మాం పరమేశ్వరి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి .

సర్వోపచారాః –
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ఆందోళికాన్ ఆరోహయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః గజానారోహయామి |
సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |

ప్రార్థనా –
పద్మాంగీ పద్మజా పద్మా పద్మేశీ పద్మవాసినీ |
పద్మపత్రవిశాలాక్షీ పాతు మాం శ్రీరమా సదా ||
దేవేశీ భక్తసులభే సర్వాభీష్టప్రదాయినీ |
త్రాహి మాం సతతం దేవీ ప్రసీద వరదో భవ ||
శ్రియం దేహి సుఖం దేహి సౌభాగ్యం సంతతిం ముదా |
దేహి మే నిత్యకళ్యాణి శరణాగతవత్సలే ||
ఓం శ్రీవైభవలక్ష్మ్యై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |

వాయనదాన మంత్రం –
శ్రీదేవీ లోకకళ్యాణి పద్మాక్షీ సర్వమంగళా |
సువాసినీభ్యో దాస్యామి వాయనేన ప్రసీదతు ||

- శ్రీ వైభవలక్ష్మీ వ్రతకథా ప్రారంభః

పూర్వము కైలాసమున పార్వతీ దేవి, పరమేశ్వరునితో ప్రియభాషణములు ఆడుచూ, “ప్రాణనాథా, భూలోకమున జనులందరు ధనార్జన కొరకు మిక్కిలి కష్టములను అనుభవించుచున్నారు. అయినను, కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులగుటకు కారణమేమి”, యని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వునవ్వి, “దేవీ, సర్వము వైభవలక్ష్మీ దయవలననే ఉండును. సమస్త సిరిసంపదలకు ఆ తల్లియే దేవత. కావున ఈ సత్యమును గుర్తించి ఎవరైతే ఆ ఐశ్వర్యలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధింతురో, వారిపట్ల ఆ తల్లి అపార కృపాకటాక్షములు కలిగి అఖండ వైభవమును అనుభవింపగలరు. ధనమును తృణీకరించిన సంపదలు కలుగజాలవు”, అని చెప్పెను. ఇది వినిన పార్వతీ దేవి, ఈ వైభవలక్ష్మి గురించి నాకు మరింత చెప్పవలసినది అని ప్రార్థింప ఆ పరమేశ్వరుడిట్లు పలికె.

ఒకానొకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తిని గూర్చి తపస్సు చేయుచుండ, ఆ భక్తికి మెచ్చిన ఆ పరాశక్తి ప్రత్యక్షమై ఏమి కావలెనో కోరుకోయని చెప్పగా, భృగు మహర్షి “తల్లీ, వైభవకరమగు నీ రూపముతో నా కుమార్తెగా జన్మించి నన్ననుగ్రహింపవలసినది” యని ప్రార్థింప ఆ పరాశక్తి ఆతని భక్తిశ్రద్ధలకు మెచ్చి, “తథాస్తు” అని వరమిచ్చి అంతర్ధానమాయెను. తత్ఫలముగా పరాశక్తియొక్క సంపత్కర అంశ భృగు మహర్షియొక్క కుమార్తె వలె అవతరించినది. పుత్రికా వాత్సల్యముతో ముదమొందిన భృగువు ఆమెను శ్రీమహావిష్ణువునకు ఇచ్చి వివాహము చేసెను. ఆ శ్రీహరి ఆనతిమేర దేవతలందరకు వైభవమును ప్రసాదించి, వైకుంఠలక్ష్మిగా ఆరాధింపబడుతూ ఉండెను.

ఇట్లుండ భూలోకమున ఋషులందరు మహాయాగము చేయదలచి, హవిస్సును ఎవరకు ఇవ్వవలసినదో నిర్ణయింపుమని భృగు మహర్షిని వేడుకొనగా భృగువు సమ్మతించి ముల్లోకములకు పయనమాయెను. బ్రహ్మలోకమున సరస్వతితో ప్రియభాషణములాడు బ్రహ్మదేవులవారిని చూచి, తన రాకను గౌరవింపలేదని కోపగించుకుని, కైలాసమునకు యేగెను. అచటకూడా మహేశ్వరుడు ధ్యానమగ్నుడగుటచే భృగువు రాకను గమనించలేదు. మరింత కోపముతో భృగువు అక్కడ నుండి వెడలిపోయెను. చివరకు వైకుంఠము చేరగా అచట విశ్రాంతి తీసుకొనుచున్న శ్రీమహావిష్ణువును చూచి తన రాకను గౌరవింపలేదని పట్టరానికోపమునొంది, ఆ విష్ణువు వక్షఃస్థలముపై కాలితో తన్నెను. అంతయా విష్ణువు భృగువు యొక్క కోపమును శాంతపరచి పంపివేసెను. ఇది గమనించిన శ్రీమహాలక్ష్మి, తన నివాసస్థానమగు తన భర్త వక్షఃస్థలమును కాలితో తన్నినను యేమియును అనలేదని ఆగ్రహముతో వైకుంఠమువదలి క్షీరసాగరములోనికి వెడలిపోయెను. దీనితో ఇంద్రాది దేవతలందరి వైభవము క్షీణించెను. వారందరు శ్రీమహావిష్ణువు వద్దకు పోయి వేడుకొనగా, క్షీరసాగరమథనము చేయమని ఆనతిచ్చెను. మంథరపర్వతముతో మథనము చేయు సమయమున, ఆ శ్రీమహాలక్ష్మి వారిని అనుగ్రహింప తలచి, అమృతముతో పాటుగా అష్టలక్ష్మీరూపములతో వారికి వైభవమును ప్రసాదించి, తిరిగి తన ప్రాణవల్లభుడగు శ్రీమహావిష్ణువు వద్దకు చేరెను. కావున శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన శ్రీమహావిష్ణువును తిరస్కరించిన ఆ యమ్మ నిలువజాలదని గ్రహింపుము.

అటులనే మానవులకు పూర్వజన్మ కర్మల వలన కూడా సిరిసంపదలు సంభవించును. ఇందుకు ఉదాహరణగా సుశర్మ గురించి చెప్పెద వినుము. ఒకానొక గ్రామమున సుశర్మయను సకలశాస్త్రకోవిదుడు కలడు. తన గురుకుల ఆశ్రమము ద్వారా పురప్రజలకు, రాజులకు, ధనవంతులకు శాస్త్రవిద్యను అభ్యసింపజేయుచూ ఉండెను. కాని ఆతని ఇంట పేదరికము ఉండెను. ఇది గమనించిన సుశర్మ భార్యయగు సుశాంత ఇట్లు పలికెను. “నాథా, మీరు విద్యను ప్రసాదించిన మీ శిష్యులలో కొందరు ధనవంతులు ఉన్నారు. మన ఇంటి వెచ్చములకొరకు వారివద్దకు పోయి కొంతధనము తీసుకురావలసినది” అని పలుకగా, సుశర్మ “యాచన చేయుట భావ్యము కాదు, పైగా సిరిసంపదలమీద ఆశ కలిగియుండుట మంచిదికాదు. అయినను మనకు కావలసిన సంపదలు ఆ వైభవ స్వరూపమగు శ్రీమహాలక్ష్మి ఇవ్వగలదుగాన ఆ యమ్మను గూర్చి యాగము చేసెద”నని చెప్పి యాగము చేయసాగెను. సుశర్మ చేసిన యాగమునకు సంతుష్టురాలైన శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై “నేటి రాత్రి నీ యింట బంగారు కాసుల వర్షము కురిపించెద”నని వరమిచ్చి అంతర్ధానమాయెను. సుశర్మ ఆనందముగా ఈ విషయము సుశాంతకు తెలిపి రాత్రంతా జాగారము చేయుచూ వేచిచూచెను. అలా చూస్తూ ఉండగా తెల్లవారినది. సంపదవర్షం రాలేదని గ్రహించిన సుశర్మ, భార్యను పేదరికములో ఉంచినందుకు మిక్కిలి దుఃఖమునొంది ప్రాయోపవేశము చేయదలచి ఇంటినుండి బయలుదేరెను. ఇంటి బయట మలిన వస్త్రములతో, కాంతిహీనమైన ఒక స్త్రీ కనిపించినది. సుశర్మ నీవెవరని అడుగగా ఆ స్త్రీ ఇట్లు పలికెను. “నీ యాగమునకు మెచ్చి నీ యింట కనకవర్షము కురిపించ నే వచ్చితిని. కానీ నీ యింట గల జ్యేష్ఠాదేవి నన్నువారించెను. నీ పూర్వజన్మలలో పుణ్యకార్యములు, దాన ధర్మములు చేయని కారణమున, ఈ జన్మమున నీకు సంపద కలుగకయున్నదని తెలిపినది.” ఇది వినిన సుశర్మ, తను లేకపోయిన తన భార్యా బిడ్డలకు సంపదలు కలుగగలవని గ్రహించి, సన్యాసాశ్రమము స్వీకరించెను. ప్రతిగా కరుణించమని శ్రీమహాలక్ష్మిని ప్రార్థింపగా, ఆతని భక్తియుక్తులకు సంతోషమునొంది శ్రీవైభవలక్ష్మి ఆ యింట వైభవములను కటాక్షించెను.

ఓ పార్వతీ దేవీ ! ఇదియే కాదు. ఆ శ్రీవైభవలక్ష్మి అనుగ్రహమును గుర్తింపక, తమకున్న సిరిసంపదలు తమవలన మాత్రమే వచ్చెనని అహంకరించినను ఆ తల్లి సహింపజాలదు. ఇందుకు ఉదాహరణగా నీకు మరొక కథ చెప్పెద వినుము.

ఒకానొక గ్రామమున శీల, సుశీల, గుణశీల, విశాల అను నలుగురు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. వీరు శ్రీవైభవలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించుచూ ఉండెడివారు. వారి సౌభాగ్య ప్రభావము వలన వారికి ధర్మనిష్ఠులు, సంపన్నులైన భర్తలు లభించెను. శీల భర్త శాస్త్రపాండిత్యము కలవాడు. సుశీల భర్త మంచి బాహుబలము కలవాడై మహారాజు వద్ద సైన్యాధికారము చేయుచుండెను. గుణశీల భర్తకు వర్తకము పట్ల మంచి అవగాహన ఉండెను. విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మము బోధించుచూ తగు రీతిలో ఆర్థిక సహాయము చేయుచుండెను. కాలము గడువగా వారి భర్తలకు అహంకారము, దురాశలు, దుర్వ్యసనములు మొదలాయెను. వారు తమ వైభవము అంతా తమ ప్రతిభ వలననే వచ్చినది గానీ లక్ష్మీకటాక్షము కాదని వాదించుచూ దైవవిరుద్ధముగా ప్రవర్తించెడివారు. ఇందుకు కోపగించిన శ్రీమహాలక్ష్మి వారి సంపదలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించెను. శీల భర్తకు పాండిత్య స్తబ్దత దాపురించి సభలలో అవమానములను పొంది క్రమముగా నిర్ధనుడాయెను. సుశీల భర్త బలగర్వముచే పురజనులతో కలహములు పెట్టుకొనుటచే మహారాజు అతనిని సైన్యాధికార పదవి నుండి తొలగించెను. గుణశీల భర్త వ్యాపారములో మోసము చేయుచూ దొరికిపోయి జరిమానా కింద తన సంపదను మొత్తం అప్పగించవలసి వచ్చినది. విశాల భర్త చెడు స్నేహములు, చెడు వ్యసనములకు అలవాటుపడి తన సంపదను పోగొట్టుకొనెను.

వారి భర్తల దుస్థితికి, తమ పేదరికానికి దుఃఖించుచున్న ఆ నలుగురు అక్కాచెల్లెళ్ళను చూసి శ్రీమహాలక్ష్మికి కనికరము కలిగి, అనుగ్రహింప తలచి, ఒక వృద్ధి స్త్రీ రూపములో వారి వద్దకు వచ్చెను. ఆమెను చూసిన అక్కాచెల్లెళ్ళు తమ బాధను చెప్పగా, ఆ వృద్ధి స్త్రీ “మీ వైభవము తిరిగిమీకు వచ్చుటకు మీరు శ్రీవైభవలక్ష్మీ వ్రతమును ఆచరించరింపుము. అ వ్రతవిధానమును చెప్పెద వినుము. వ్రతమును నాలుగు, తొమ్మిది, పదకొండు లేక ఇరవైవొక గురువారములు లేక శుక్రవారములు చేసి చివరి శుక్రవారమురోజున ఉద్యాపన చెప్పి కనీసము అయిదుగురు ముత్తైదువులకు వాయన తాంబూలములు ఇవ్వవలెను. వ్రతము సాయంత్రము సూర్యాస్తమయము తరువాత ఆరంభించవలెను. వ్రతము చేయురోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకుని, స్నానము చేసి, ఇంటికి ఈశాన్యమును శుభ్రముచేసి, ఆవుపేడతో అలికి, ముగ్గులు పెట్టి, పూజా స్థానమును తయారు చేసుకోవలెను. సాయంకాలము వరకు ఉపవాసము ఉండి, ఈశాన్యమున కొత్త రవికలబట్ట పరచి దానిపై బియ్యము పోసి, దాని పై కలశమును పెట్టి, అందులో నీరుపోసి, తమ ఆర్థిక స్తోమతను బట్టి నాణెములను వేసి, ఫలవృక్షముల ఆకులువేసి, పైన ఒక కొబ్బరికాయ పెట్టి కలశ స్థాపన చేయవలెను. ఆ కలశము పై శ్రీవైభవలక్ష్మిని ఆవాహనము చేసి పూజ చేసి, తీపి పదార్థములు నివేదనముగా పెట్టవలెను. ఉద్యాపన చెప్పు రోజు పూజ అయిన తరువాత, ఆ కలశములోని నీటిని వేప, తులసి మొదలగు దైవవృక్షములలో పోయవలెను. ధనాపేక్ష కలిగిన వారు ఆ కలశములోని నీరును కొంచెము తీర్థమువలె స్వీకరించవలెను. అందులోని నాణెమును ఇంటిలో భద్రప్రచుకొనవలెను. కలశము క్రింది బియ్యముని పక్షులకు వేయవలెను.” అని వ్రతవిధానమును తెలిపి వెడలిపోయెను.

ఇది వినిన ఆ అక్కాచెల్లెళ్ళు ఆనందముగా తమ భర్తలతో కలసి శ్రీవైభవలక్ష్మీ వ్రతమును ఆచరించెను. ఆ వ్రత ప్రభావము వలన, శీల భర్త యొక్క పాండిత్యము తిరిగి గుర్తింపబడి గౌరవ మర్యాదలు కలిగినవి. సుశీల భర్త యొక్క బలమెరిగిన మహారాజు తిరిగి సైన్యాధికారమును ఇచ్చెను. గుణశీల యొక్క భర్త తిరిగి వ్యాపారమున ప్రతిభ కనబరచి సంపదను పొందెను. విశాల భర్త తన చెడు వ్యసనములను గుర్తించి మంచివాడిగా మారి, మరల పురప్రజలకు సన్నిహితుడాయెను.

కావున ఓ పార్వతీ దేవీ ! వైభవము, ఐశ్వర్యములు కలుగజేయు శ్రీవైభవలక్ష్మీని ఆరాధించుటవలన సిరిసంపదలు కలుగును” అని పరమేశ్వరుడు పలుకగా పార్వతీదేవి ఆనందముగా నమస్కరించినది.

క్షమాప్రార్థనా –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ||

అనయా మయా కృతేన షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీవైభవలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ మహాలక్ష్మీ పాదోదకం పావనం శుభం ||
శ్రీ శ్రీవైభవలక్ష్మ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Margasira Lakshmi Vara Vratham – మార్గశిర లక్ష్మివార వ్రతం

Margasira Lakshmi Vara Vratham - Pooja Vidhanam, Vrata Katha – 

మార్గశిర లక్ష్మివార వ్రతం

Goddess Sri Lakshmi for Margasira Vratam seated in Lalithasana on a deep pink lotus — four arms holding pink lotus flowers, Abhaya mudra open palm gesture, and golden Kalasha pot, wearing crimson and emerald green silk saree with jasmine garlands, jewelled golden crown, two decorated white elephants pouring sacred water on both sides, colourful flower petals falling from divine halo, lush tropical garden background

 (గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ, శ్రీమహాలక్ష్మి పూజ చేసి తరువాత ఈ కథ చదువుకుని, అక్షతలు అమ్మవారి మీద వేసి, అమ్మవారి పాదముల వద్ద అక్షతలు మీ తలపై వేసుకోవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

శ్రీ మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ చూ. ||

<><>  వ్రత కథ <><>

పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలముచేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహము చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటిపనులు చేయించుచూ తను విశ్రాంతి తీసుకొనుచుండెను. కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి, బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను.

ఇంటిపనులు చేయుచూ మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి, ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీమహాలక్ష్మిని ఆరాధింపుమని చెప్పిరి. ఆ మాటవినిన సుశీల మట్టితో శ్రీమహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి, తన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను.

కొంతకాలముకు సుశీలకు యుక్త వయస్సు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతోపాటుగా నిత్యము పూజచేయు శ్రీమహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను. అంతనా పుట్టింటిన గల సిరిసంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను. అత్తింటివారు అకస్మాత్తుగా వృద్ధిచెందిన సిరిసంపదలు చూసి ఆశ్చర్యపడుచు, తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయముగా చూసుకొనుచుండిరి.

కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటివారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న తెలియవచ్చినది. వారికి సహాయము చేయదలచి తన భర్తను అడుగగా, అతను సమ్మతించెను. అంత తన సవతి తమ్ముడిని పిలిపించి, ఒక కర్రకు జోలె కట్టి, ఆ జోలెయందు బంగారునాణెములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పెను. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగుప్రయాణము చేసెను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకుని చూసుకొనిన బంగారునాణెములు గల జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి, బాధతో తన ఇంటికి వెళ్ళిపోయెను.

తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలువగా, సంభాషణ మధ్యలో తను బంగారునాణెముల జోలెను పోగొట్టుకొనిన విషయము చెప్పి దుఃఖించెను. అంతా ఆ సుశీల దిగులుచెందకుమని ఊరడించి, మరల సహాయము చేయదలచి, ఒక చెప్పుల జోడునిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగుప్రయాణమున ఒక కుక్క వరహాలు కల ఆతని చెప్పును నోట కరచుకొని పారిపోయెను. మరల దుఃఖించుచూ అతను ఇంటికిచేరెను. కొంతకాలము తరువాత సుశీలకు ఈ విషయముకూడా తెలియవచ్చి, ఈసారి బాగా ఆలోచించి, తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతితల్లికి ఇవ్వమని చెప్పెను. ఆ తమ్ముడు తిరుగుప్రయాణమున ఒక చోటకూర్చుని చద్దితినుచుండ అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనము చేసి పారిపోయెను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి, తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను.

ఇట్లుండ, తన పుట్టింటివారిని చూడవలెనను కోరికగలిగి, సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించెను. తన పుట్టింటివారి దారిద్ర్యమును పోగొట్టుటకు యేమి చేయవలెనోయని తీవ్రముగా ఆలోచించి, తను నిత్యము పూజించు శ్రీమహాలక్షిని పూజించిన సంపదలు కలుగగలవని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీమహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటివారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది.

ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మివారము వచ్చినది. నియమ నిష్ఠలతో సాయంకాలమున శ్రీమహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగాన ఆరోజు యేమియును తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పెను. కాని ఆ సవతితల్లి పిల్లలకు భోజనముపెడుతూ ఆకలికి తట్టుకొనలేక తను కూడా చద్దన్నము తినెను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని, మరుసటి లక్ష్మివారము చేసెదమని సుశీల చెప్పెను.

రెండవ లక్ష్మివారపు సాయంత్రము ఆ సవతితల్లి స్నానము చేసుకుని తలకు నూనె రాసుకొనెను. ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటివారము చేసెదమని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మివారపు సాయంత్రం ఆ సవతితల్లి పిల్లలకు జడవేయుచూ, తను కూడా తలదువ్వుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మివారము తన సవతితల్లిని నిష్ఠగా ఉంచతలచి, ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనుచూ వచ్చి అరటిపండు తిని, వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరి. ఆకలికి తట్టుకొనలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను. ఈ విషయము తెలిసి సుశీల బాధపడెను.

ఇంతలో ఆఖరి లక్ష్మివారము వచ్చెను. శ్రీమహాలక్ష్మి పూజకు శ్రేష్ఠమైన మార్గశిర మాసము వెడలిపోయిన మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి, ఈసారి ఎటులనైనా తన సవతితల్లితో పూజ చేయించవలెనను పట్టుదలతో, వ్రత భంగము కాకుండా, తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని, యే విధమైన నియమభంగము కలుగకుండా జాగ్రత్తపడినది. ఆనాటి సాయంత్రము తనతోపాటు, తన సవతితల్లితో కూడా శ్రీమహాలక్ష్మి పూజ చేయించెను.

పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీమహాలక్ష్మి, సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి, ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది యేమని అడుగగా ఆ శ్రీమహాలక్ష్మి, “ఓ సుశీలా, నీ చిన్నతనమున నువ్వు నా పూజచేయునపుడు ఈ నీ సవతితల్లి కోపగించి, చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనము స్వీకరింపలేను” అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతితల్లి చేసిన పనిని మన్నింపుమని ప్రార్థింపగా, అటులనే యని అమ్మవారు పలికి నివేదనము స్వీకరించి, వారిరువురి ఇంట సుఖసంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను. ఆ ప్రభావమ్మున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగెను.

అటుపిమ్మట, ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున అయిదు లక్ష్మివారములు నియమ నిష్ఠలతో శ్రీమహాలక్ష్మి పూజచేసి, తమ విభవము కొలది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగువాటిని నివేదనము చేయుచూ వారిరువురి కుటుంబములు సుఖసంపదలతో ఆనందముగనుండిరి.

Maha Lakshmi Visesha Shodasopachara Puja – మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ

Sri Maha Lakshmi Visesha Shodasopachara Puja – శ్రీ మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ

Goddess Mahalakshmi seated on a pink lotus in full bloom — eight arms holding lotus flowers, golden pot overflowing with coins, conch shell, and Abhaya mudra blessing gesture, wearing red and gold Kanchipuram silk saree, ornate jewelled golden crown, traditional South Indian gold jewellery, and golden oil lamps on both sides in warm temple light

 (గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ గణపతి లఘు పూజ చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం –
యా సా పద్మా॑సన॒స్థా విపులకటితటీ పద్మ॒పత్రా॑యతా॒క్షీ |
గంభీరా వ॑ర్తనా॒భిః స్తనభర నమితా శుభ్ర వస్త్రో॑త్తరీ॒యా |
లక్ష్మీర్ది॒వ్యైర్గజేన్ద్రైర్మ॒ణిగణ ఖచితైస్స్నాపితా హే॑మకు॒oభైః |
ని॒త్యం సా ప॑ద్మహ॒స్తా మమ వస॑తు గృ॒హే సర్వ॒మాఙ్గళ్య॑యుక్తా ||

ల॒క్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ॒రంగధామే॑శ్వరీమ్ |
దా॒సీభూతసమస్త దేవ వ॒నితాం లో॒కైక॒ దీపా॑oకురామ్ |
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్ర॒హ్మేన్ద్రగఙ్గా॑ధరాం |
త్వాం త్రై॒లోక్య॒ కుటు॑oబినీం స॒రసిజాం వ॒న్దే ముకు॑న్దప్రియామ్ ||

సహస్రదలపద్మస్య కర్ణికావాసినీం పరామ్ |
శరత్పార్వణకోటీందుప్రభాజుష్టకరాం వరామ్ ||
స్వతేజసా ప్రజ్వలంతీం సుఖదృశ్యాం మనోహరామ్ |
ప్రతప్తకాంచననిభాం శోభాం మూర్తిమతీం సతీమ్ |
రత్నభూషణభూషాఢ్యాం శోభితాం పీతవాససా |
ఈషద్ధాస్యప్రసన్నాస్యాం రమ్యాం సుస్థిరయౌవనామ్ ||
సర్వసంపత్ప్రదాత్రీం చ మహాలక్ష్మీం భజే శుభామ్ |
ధ్యానేనానేన తాం ధ్యాత్వా చోపచారైః సుసంయుతః ||

ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధ్యాయామి |

ఆవాహనం –
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సువ॒ర్ణ ర॑జత॒స్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
సహస్రదళపద్మస్థాం స్వస్థాం చ సుమనోహరామ్ |
శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆవాహయామి |

ఆసనం –
తాం మ॒ ఆ వ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
అమూల్యరత్నఖచితం నిర్మితం విశ్వకర్మణా |
ఆసనం చ విచిత్రం చ మహాలక్ష్మి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం –
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑ద ప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑ దే॒వీ జు॑షతామ్ ||
పుష్పచందనదూర్వాదిసంయుతం జాహ్నవీజలమ్ |
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రాకారామా॒ర్ద్రాం జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
శుద్ధం గంగోదకమిదం సర్వవందితమీప్సితమ్ |
పాపేధ్మవహ్నిరూపం చ గృహ్యతాం కమలాలయే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం యశ॑సా॒ జ్వల॑న్తీ॒o శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా |
గృహ్యతాం కృష్ణకాంతే త్వం రమ్యమాచమనీయకమ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
కాపిలం దధి కుందేందుధవళం మధుసంయుతమ్ |
స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑ జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ॑ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు మా॒ యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
పంచామృత సమాయుక్తం జాహ్నవీసలిలం శుభమ్ |
గృహాణ విశ్వజనని స్నానార్థం భక్తవత్సలే ||

ఓం శ్రీ మహాలక్ష్మై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మి॒న్ కీ॒ర్తిమృద్ధి॑o ద॒దాతు॑ మే ||
దేహసౌందర్యబీజం చ సదా శోభావివర్ధనమ్ |
కార్పాసజం చ కృమిజం వసనం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

వ్యజనచామరం –
క్షు॒త్పి॒పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॒ల॒క్ష్మీర్నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ॒ స॒ర్వా॒న్ నిర్ణు॑ద మే॒ గృహాత్ ||
శీతవాయుప్రదం చైవ దాహే చ సుఖదం పరమ్ |
కమలే గృహ్యతాం చేదం వ్యజనం శ్వేతచామరమ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః వ్యజనచామరైర్వీజయామి |

గంధాది పరిమళద్రవ్యాణి –
గ॒న్ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీగ్॑o సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
శుద్ధిదం శుద్ధిరూపం చ సర్వమంగళమంగళమ్ |
గంధవస్తూద్భవం రమ్యం గంధం దేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః శ్రీగంధం సమర్పయామి |

మలయాచలసంభూతం వృక్షసారం మనోహరమ్ |
సుగంధియుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః రక్తచందనం సమర్పయామి |

సిందూరం రక్తవర్ణం చ సిందూరతిలకప్రియే |
భక్త్యా దత్తం మయా దేవి సిందూరం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సిందూరం సమర్పయామి |

కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణమ్ |
అఖండకామసౌభాగ్యం కుంకుమం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః కుంకుమం సమర్పయామి |

సుగంధియుక్తం తైలం చ సుగంధామలకీజలమ్ ||
దేహసౌందర్యబీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సుగంధి తైలం సమర్పయామి |

ఆభరణం –
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాగ్ం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
రత్నస్వర్ణవికారం చ దేహసౌఖ్యవివర్ధనమ్ |
శోభాధానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆభరణాని సమర్పయామి |

పుష్పమాలా –
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా మ॒యి॒ సమ్భ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||
నానాకుసుమనిర్మాణం బహుశోభాప్రదం పరమ్ |
సురలోకప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పమాలామ్ సమర్పయామి |

పుష్పాణి –
మందారపారిజాతాదీన్పాటలీం కేతకీం తథా |
మరువామోగరం చైవ గృహాణాశు నమోఽస్తు తే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజా –
ఓం చపలాయై నమః – పాదౌ పూజయామి |
ఓం చంచలాయై నమః – జానునీ పూజయామి |
ఓం కమలాయై నమః – కటిం పూజయామి |
ఓం కాత్యాయన్యై నమః – నాభిం పూజయామి |
ఓం జగన్మాత్రే నమః – జఠరం పూజయామి |
ఓం విశ్వవల్లభాయై నమః – వక్షస్స్థలం పూజయామి |
ఓం కమలవాసిన్యై నమః – నేత్రత్రయం పూజయామి |
ఓం శ్రియై నమః – శిరః పూజయామి |
ఓం మహాలక్ష్మై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ పూర్వాదిక్రమేణాష్టదిక్ష్వష్టసిద్ధీః పూజయేత్ |
ఓం అణిమ్నే నమః |
ఓం మహిమ్నే నమః |
ఓం గరిమ్ణే నమః |
ఓం లఘిమ్నే నమః |
ఓం ప్రాప్త్యై నమః |
ఓం ప్రాకామ్యాయై నమః |
ఓం ఈశితాయై నమః |
ఓం వశితాయై నమః |

అథ పూర్వాదిక్రమేణాష్టలక్ష్మీ పూజనమ్ |
ఓం ఆద్యలక్ష్మై నమః |
ఓం విద్యాలక్ష్మై నమః |
ఓం సౌభాగ్యలక్ష్మై నమః |
ఓం అమృతలక్ష్మై నమః |
ఓం కామలక్ష్మై నమః |
ఓం సత్యలక్ష్మై నమః |
ఓం భోగలక్ష్మై నమః |
ఓం యోగలక్ష్మై నమః |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళీ పశ్యతు |

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళీ పశ్యతు |

ధూపం –
ఆప॑: సృ॒జన్తు॑ స్నిగ్ధా॒ని చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
వృక్షనిర్యాసరూపం చ గంధద్రవ్యాదిసంయుతమ్ |
కృష్ణకాంతే పవిత్రో వై ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ధూపం సమర్పయామి |

దీపం –
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
జగచ్చక్షుః స్వరూపం చ ధ్వాంతప్రధ్వంసకారణమ్ |
ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దీపం సమర్పయామి |

నైవేద్యం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టిం సు॒వర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
నానోపహారరూపం చ నానారససమన్వితమ్ |
నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |

ఆచమనం –
శీతలం నిర్మలం తోయం కర్పూరేణ సువాసితమ్ |
ఆచమ్యతాం మమ జలం ప్రసీద త్వం మహేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆచమనీయం సమర్పయామి |

తాంబూలం –
తాం మ॒ ఆ వ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాదిసువాసితమ్ |
జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః తాంబూలం సమర్పయామి |

ఫలం –
నానావిధాని రమ్యాణి పక్వాని చ ఫలాని తు |
స్వాదురస్యాని కమలే గృహ్యతాం ఫలదాని చ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఫలాని సమర్పయామి |

దక్షిణాం –
హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః |
అనంతపుణ్యఫలదం అతః శాంతిం ప్రయచ్ఛ మే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః దక్షిణాం సమర్పయామి |

నీరాజనం –
స॒మ్రాజ॑o చ వి॒రాజ॑o చాభి॒శ్రీర్యా చ॑ నో గృ॒హే |
ల॒క్ష్మీ రా॒ష్ట్రస్య॒ యా ముఖే॒ తయా॑ మా॒ సగ్ం సృ॒జామసి ||
చక్షుర్దం సర్వలోకానాం తిమిరస్య నివారణమ్ |
ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి |
సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు |
నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –

శ్రీసూక్తం పశ్యతు || ]

ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి |
తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||
సద్భావపుష్పాణ్యాదాయ సహజప్రేమరూపిణే |
లోకమాత్రే దదామ్యద్య ప్రీత్యా సంగృహ్యతాం సదా ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష మాం పరమేశ్వరి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః గజానారోహయామి |
సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |
యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ |
దేవభూషాఢ్యభోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతామ్ ||

ప్రార్థనా –
సురాసురేంద్రాదికిరీటమౌక్తికై-
-ర్యుక్తం సదా యత్తవపాద కంజనమ్ |
పరావరం పాతు వరం సుమంగళం
నమామి భక్త్యా తవ కామసిద్ధయే ||
భవాని త్వం మహాలక్ష్మి సర్వకామప్రదాయినీ |
సుపూజితా ప్రసన్నా స్యాన్మహాలక్ష్మై నమోఽస్తు తే ||
నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే |
యా గతిస్త్వత్ప్రపన్నానాం సా మే భూయాత్త్వదర్చనాత్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |

దీప పూజనం –
భో దీప త్వం బ్రహ్మరూప అంధకారనివారక |
ఇమాం మయా కృతాం పూజాం గృహ్ణంస్తేజః ప్రవర్ధయ ||
ఓం దీపాయ నమః ఇతి గంధక్షతపుష్పైః సంపూజ్య శ్రీమహాలక్ష్మ్యై నివేదయేత్ |

దీపమాలా పూజనం –
దీపావలీ మయా దత్తం గృహాణ త్వం సురేశ్వరి |
ఆరార్తికప్రదానేన జ్ఞానదృష్టిప్రదా భవ ||
అగ్నిజ్యోతీ రవిజ్యోతిశ్చంద్రజ్యోతిస్తథైవ చ |
ఉత్తమః సర్వతేజస్తు దీపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మై నమః ఆరార్తికం సమర్పయామి |

దీపావళి రాత్రి ప్రార్థనా –
నమస్తే సర్వదేవానాం వరదాఽసి హరిప్రియే |
యా గతిస్త్వత్ప్రపన్నానాం సా మే భూయాత్త్వదర్చనాత్ || ౧ ||
విశ్వరూపస్య భార్యాఽసి పద్మే పద్మాలయే శుభే |
మహాలక్ష్మి నమస్తుభ్యం సుఖరాత్రిం కురుష్వ మే || ౨ ||
వర్షాకాలే మహాఘోరే యన్మయా దుష్కృతం కృతమ్ |
సుఖరాత్రిః ప్రభాతేఽద్య తన్మేఽలక్ష్మీం వ్యపోహతు || ౩ ||
యా రాత్రిః సర్వభూతానాం యా చ దేవేష్వవస్థితా |
సంవత్సరప్రియా యా చ సా మమాస్తు సుమంగళమ్ || ౪ ||
మాతా త్వం సర్వభూతానాం దేవానాం సృష్టిసంభవామ్ |
ఆఖ్యాతా భూతలే దేవి సుఖరాత్రి నమోఽస్తు తే || ౫ ||
దామోదరి నమస్తేఽస్తు నమస్త్రైలోక్యమాతృకే |
నమస్తేఽస్తు మహాలక్ష్మి త్రాహి మాం పరమేశ్వరి || ౬ ||
శంఖచక్రగదాహస్తే శుభ్రవర్ణే శుభాననే |
మహ్యమిష్టవరం దేహి సర్విసిద్ధిప్రదాయిని || ౭ ||
నమస్తేఽస్తు మహాలక్ష్మి మహాసౌఖ్యప్రదాయిని |
సర్వదా దేహి మే ద్రవ్యం దానాయ భుక్తిహేతవే || ౮ ||
ధనం ధాన్యం ధరాం హర్షం కీర్తిమాయుర్యశః శ్రియః |
తురగాన్ దంతినః పుత్రాన్ మహాలక్ష్మి ప్రయచ్ఛ మే || ౯ ||
యన్మయా వాంఛితం దేవి తత్సర్వం సఫలం కురు |
న బాధంతాం కుకర్మాణి సంకటాన్మే నివారయ || ౧౦ ||
న్యూనం వాఽప్యతులం వాపి యన్మయా మోహితం కృతమ్ |
సర్వం తదస్తు సంపూర్ణం త్వత్ప్రసాదాన్మహేశ్వరి || ౧౧ ||

క్షమా ప్రార్థన –
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ మహాలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ మహాలక్ష్మీ పాదోదకం పావనం శుభం ||
శ్రీ మహాలక్ష్మై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః |

Anaghashtami Vratham – అనఘాష్టమి వ్రతకల్పం

Sri Anagha Vratam (Anaghashtami Vratham) – అనఘాష్టమి వ్రతకల్పం

Lord Dattatreya with three faces seated under a sacred Banyan tree — blue-skinned, holding Trishul and Sudarshana Chakra with Abhaya mudra, wearing saffron dhoti and Rudraksha garlands, beside Goddess Anagha Lakshmi in pink silk saree holding a pink lotus, surrounded by sacred white cows and dogs, ancient temples and golden sunset in background

 (గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం ఆచరించవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం సమస్తసన్మంగళావాప్త్యర్థం పురుషసూక్త విధానేన శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘాస్వామి షోడశోపచార పూజాం కరిష్యే ||

సిద్ధిదేవతా స్థాపనం –
(గమనిక: బియ్యపుపిండి, పసుపు, కుంకుమలతో అష్టదళ పద్మము వేసి, అందులో చెప్పబడిన స్థానములలో రెండు తమలపాకులు వేసి అందులో ఒక వక్క, ఒక ఖర్జూరం ఒక రూపాయి బిళ్ళ వేసి శ్లోకం చదివి అక్షతలు వేయండి)

స్మరణ –
అణిమా మహిమా ప్రాప్తిః ప్రాకామ్యం మహిమా తథా |
ఈశిత్వం చ వశిత్వం చ యచ్చ కామావసాయతా ||

౧. అణిమా (ఈశాన్యం)
అణోరణీయసః పుత్రః ఈశాన్యాశా వ్యవస్థితః |
అనఘస్యాణిమాభిఖ్యః పుత్రశ్చిత్రః సనోఽవతు ||
అస్మిన్ అష్టదళపద్మే ఈశాన్యదళే కలశే అణిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(ఈశాన్య పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౨. లఘిమా (ఆగ్నేయం)
అనఘానఘయోః పుత్రో లఘిమాఖ్య కృపాలఘుః |
దేవస్యాగ్నేయ కోణస్థో లఘుబుద్ధిః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే ఆగ్నేయ దళే కలశే లఘిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(ఆగ్నేయ పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౩. ప్రాప్తి (నైఋతి)
భక్తాభీష్టఫలప్రాప్తికారకోఽనఘయోః సుతః |
దేవస్య నైరృతే కోణే స్థితః ప్రాప్తిః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే నైఋతి దళే కలశే ప్రాప్తి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(నైఋతి పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౪. ప్రాకామ్య (వాయువ్యం)
అవధూత గురోః స్వేచ్ఛాసంచారస్యాఽనఘస్య యః |
వాయుకోణ స్థితః పుత్రః ప్రాకామ్యాఖ్యః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే వాయువ్య దళే కలశే ప్రాకామ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(వాయువ్య పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౫. ఈశిత్వ (దక్షిణం)
సర్వాతిశాయితాం దేవస్యాఽనఘస్య జగద్గురోః |
ఖ్యాపయన్ దక్షభాగస్థ ఈశిత్వాఖ్యః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే దక్షిణ దళే కలశే ఈశిత్వ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(దక్షిణ పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౬. వశిత్వ (ఉత్తరం)
జగద్యస్య వశే తిష్ఠత్యనఘస్య మహాత్మనః |
ఆత్మజో వామభాగస్థో వశిత్వాఖ్యః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే వామభాగస్థ దళే కలశే వశిత్వ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(ఉత్తరం పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౭. కామావసాయత (పశ్చిమం)
కామావసాయితాభిఖ్యో హ్యనఘస్యాంగా రక్షవత్ |
పశ్చాద్భాగస్థితః పుత్రః కమనీయః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే పశ్చాద్భాగస్థ దళే కలశే కామావసాయితాఖ్యా దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(పశ్చిమం పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౮. మహిమా (తూర్పు)
పురస్తాదనఘద్వంద్వ పాదసీమ్ని వ్యవస్థితః |
మహిమాఖ్యో మహాకార్యకారీ పుత్రః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే పురస్తాద్దళే కలశే మహిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(తూర్పు పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)

సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)

౯. దత్తాత్రేయః (మధ్యలో ఉన్న మొదటి ప్రధాన కలశం)
ఏవం తత్తత్సుతభ్రాజద్దళాష్టక సుశోభినః
కర్ణికాయాం పంకజస్య కలితాయాం మహాగుణైః |
సమాసీనః ప్రశాంతాత్మా కృపాబ్ధిరనఘాహ్వయః
దత్తాత్రేయో గురుర్విష్ణుబ్రహ్మేశాత్మా సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే మధ్యే కర్ణికాయాం ప్రధానకలశే శ్రీమదనఘస్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

౧౦. అనఘాలక్ష్మీః (మధ్యలో ఉన్న రెండవ ప్రధాన కలశం)
అనఘస్వామినః పార్శ్వే సమాసీనా కృపాలయా
సర్వైర్బాహ్మ్యై గుణైర్యుక్తా యోగాధీశా జగత్ప్రసూః |
పద్మాసనా పద్మకరా భక్తాధీనా పతివ్రతా
అనఘాంబ మహాలక్ష్మీర్మహాభాగాః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే మధ్యే కర్ణికాయాం శ్రీమదనఘస్వామినః పార్శ్వే కలశే శ్రీమతీం అనఘాదేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

౧౧. ప్రాణప్రతిష్ఠా –
ఈశాన్యామణిమాభిఖ్యే చాగ్నేయ్యాం లఘిమాభిదే |
ప్రాప్తి నామాని నైఋత్యాం ప్రాకామ్యాఖ్యేఽనిలస్థలే ||
ఈశిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్శ్వయోరపి |
కామావసాయితా నామ్ని పశ్చాద్భాగేంగ రక్షవత్ ||
మహిమ్నీ పాదమూలే చ దళేష్వష్టసు నిత్యశః |
భ్రాజమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయౌ ||
అనఘశ్చాఽనఘాదేవీ ప్రాణ చేష్టా విరాజితౌ |
చరతాం మమ హృత్పద్మే గురుమార్గ ప్రవర్తకౌ ||

స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ |
తావత్త్వం ప్రీతిభావేన కుంభేఽస్మిన్ సన్నిధిం కురు ||

ధ్యానం –
పద్మాసనోత్తాన మనోజ్ఞపాదం
పద్మం దధానామభయం చ పాణ్యోః |
యోగస్థిరం నిర్భర కాంతిపుంజం
దత్తం ప్రపద్యేఽనఘ నామధేయమ్ || ౧ ||
పద్మాసనస్థాం పదయుగ్మ నూపురాం
పద్మం దధానామభయం చ పాణ్యోః |
యోగేఽర్ధ సమ్మీలిత నిశ్చలాక్షీం
దత్తానురక్తామనఘాం ప్రపద్యే || ౨ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
గుణాతీతావపి స్వేషు కృపయా త్రిగుణాన్వితౌ |
అనఘామనఘం దేవం దేవీం చాఽఽవాహయామ్యహమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆవాహయామి |

ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
సౌవర్ణపీఠం కృష్ణత్వక్ చిత్రాసన కుశాసనైః |
ఆస్త్రుతం గృహ్యతాం దేవావనఘావర్పితం మయా ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆసనం సమర్పయామి |

పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
యోగిశీర్షేఽమృతాసారౌ జంభశీర్షేఽగ్నివర్షకౌ |
పాదౌ పాద్యేన హృద్యేన క్షాళయేఽనఘయోరహమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
పద్మేన మాలయా చాత్తౌ భక్తాభీతిప్రదాయకౌ |
అర్ఘ్యేణ శీతలీకుర్యామనఘాఽనఘయౌః కరౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
జ్ఞానజ్యోతిర్వినీతానాం వేదజ్యోతిశ్చ వేధసః |
యతోఽనఘముఖాద్వ్యక్తం తత్రాఽఽచమనమర్పితమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
అనఘౌ యౌ శ్రిత పరీక్షార్థం మాయా మధుస్పృశౌ |
మధుపర్కం దదే తాభ్యాం తత్పాదాబ్జ మధువ్రతః ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
యౌ కృపాప్రేరితౌ భక్తప్రపంచేఽమృత వర్షకౌ |
పంచామృతైస్తౌ స్నపయామ్యనఘావమృతాఽత్మకౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |
మాతృతీర్థాత్ పద్మతీర్థాత్ సర్వతీర్థాదనేకతః |
సమానీతైః శీతలోదైః స్నపయామ్యనఘావుభౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |

వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
వల్కలే రుచిరే సూక్ష్మే చిత్ర చిత్ర దశాంచితే |
మాయాఽఽవృతిచ్ఛేదకాభ్యాం అనఘాభ్యాం దదే ముదా ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః వస్త్రం సమర్పయామి |

ఉపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
ఉపవీతం పవిత్రం చ సహజం యత్ప్రజాపతేః |
సమర్పితం మయా శుభ్రమనఘౌ ప్రతిముంచతమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఉపవీతం సమర్పయామి |

గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
మిలత్ కర్పూర సద్గంధైరనులిప్యాఽనఘాఽనఘౌ |
ముఖయోరలికే కుర్యాం లసత్ ఫాలాక్షి సన్నిభే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః గంధాన్ ధారయామి |
గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమం అక్షతాంశ్చ సమర్పయామి |

ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
శీర్షే కంఠే బాహుయుగ్మే మణిబంధద్వయే తథా |
వివిధా అక్షమాలాస్తే భూషార్థం కల్పయేఽనఘ ||
పాదాంగుళీయ కటక కాంచీ మాంగళ్య హారకాన్ |
కంకణం నాసికా భూషాం తాటంకే తే దదేఽనఘే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆభరణాని సమర్పయామి |

హరిద్రాచూర్ణం –
హరస్యార్ధశరీరాంగే హంసరూపీ యతీశ్వరీ |
హస్తముద్రాం కుశాధారే హరిద్రాన్ మాతృకార్చయేత్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |

కుంకుమం –
దేవి త్వామనఘే భద్రే సర్వమంగళమంగళే |
లసత్ కుంకుమచూర్ణేన పూజయామి ప్రసీద మే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః కుంకుమం సమర్పయామి |

పుష్పం –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
తత్తత్ కాలోత్థ పుష్పౌఘ మాలాభిరనఘాఽనఘౌ |
ఆపాదశీర్షం సంభూష్య పునః పుష్పైః సమర్చయే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పుష్పాణి సమర్పయామి |

అథ శ్రీఅనఘస్వామినః అంగపూజా –
శ్రీ అనఘదేవాయ నమః – పాదౌ పూజయామి |
శ్రీ త్రిజగత్ సంచారాయ నమః – జంఘే పూజయామి |
శ్రీ ఆజానుబాహవే నమః – జానునీ పూజయామి |
శ్రీ పద్మాసనస్థాయ నమః – ఊరూ పూజయామి |
శ్రీ త్రిగుణేశాయ నమః – వళిత్రయం పూజయామి |
శ్రీ శాతోదరాయ నమః – ఉదరం పూజయామి |
శ్రీ కరుణాకరాయ నమః – హృదయం పూజయామి |
శ్రీ భక్తాలంబనాయ నమః – బాహూ పూజయామి |
శ్రీ సంగీతరసికాయ నమః – కంఠం పూజయామి |
శ్రీ జగన్మోహనాయ నమః – మందస్మితం పూజయామి |
శ్రీ జగత్ప్రాణాయ నమః – నాసికాం పూజయామి |
శ్రీ శ్రుతిసంవేద్యాయ నమః – శ్రోత్రే పూజయామి |
శ్రీ ధ్యానగోచరాయ నమః – నేత్రద్వయం పూజయామి |
శ్రీ తిలకాంచితఫాలాయ నమః – ఫాలం పూజయామి |
శ్రీ సహస్రశీర్షాయ నమః – శిరః పూజయామి |
శ్రీ సచ్చిదానందాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ శ్రీఅనఘాదేవ్యాః అంగపూజా –
శ్రీ అనఘాదేవ్యై నమః – పాదౌ పూజయామి |
శ్రీ త్రిజగత్ సంచారాయై నమః – జంఘే పూజయామి |
శ్రీ ఆజానుబాహవే నమః – జానునీ పూజయామి |
శ్రీ పద్మాసనస్థాయై నమః – ఊరూ పూజయామి |
శ్రీ త్రిగుణేశాయై నమః – వళిత్రయం పూజయామి |
శ్రీ శాతోదరాయై నమః – ఉదరం పూజయామి |
శ్రీ కరుణాకరాయై నమః – హృదయం పూజయామి |
శ్రీ భక్తాలంబనాయై నమః – బాహూ పూజయామి |
శ్రీ సంగీతరసికాయై నమః – కంఠం పూజయామి |
శ్రీ జగన్మోహనాయై నమః – మందస్మితం పూజయామి |
శ్రీ జగత్ప్రాణాయై నమః – నాసికాం పూజయామి |
శ్రీ శ్రుతిసంవేద్యాయై నమః – శ్రోత్రే పూజయామి |
శ్రీ ధ్యానగోచరాయై నమః – నేత్రద్వయం పూజయామి |
శ్రీ తిలకాంచితఫాలాయై నమః – ఫాలం పూజయామి |
శ్రీ సహస్రశీర్షాయై నమః – శిరః పూజయామి |
శ్రీ సచ్చిదానందాయై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామావళి చూ. |

శ్రీ అనఘాదేవీ అష్టోత్తరశతనామావళి చూ. |

ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
నానా పరిమళద్రవ్య సమ్మేళన మనోహరః |
ధూపః సమర్పితో దేవావనఘౌ ప్రతిగృహ్యతామ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
యద్భాసేదం జగద్భాతి న దృశ్యేతే తథాపి యౌ |
తావుభౌ తత్త్వసందీప్త్యై దీపైరుద్దీపయామ్యహమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |
రాజాన్నం బహుభక్ష్యాత్తం నానోపస్కార పుష్కలమ్ |
నైవేద్యం శ్రుతిసంవేద్యౌ గృహ్యతామనఘౌ ముదా ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి ||

తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
అనఘ స్వామి జనకప్రోద్ధృతాయుష్య తంత్రకే |
ప్రోక్తైః సులక్షణైర్యుక్తం తాంబూలం ప్రదదేఽనఘౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |
ప్రభో సమంతాత్ పరివర్తితైః శ్రీ
కర్పూర నీరాజన దీప మాల్యైః |
యుష్మన్ మహార్చిః పరివేష పంక్తిః
కిమ్మీరితాభాస్త్వనఘేఽనఘ ప్రభో ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః నీరాజనం సందర్శయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం –
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |
ఓం దిగంబ॒రాయ॑ వి॒ద్మహే॑ అత్రిపు॒త్రాయ॑ ధీమహి తన్నో॑ దత్తః ప్రచో॒దయా”త్ ||
ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్న్యై చ॑ ధీమహి తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||
ఓం ఐం హ్రీం శ్రీం శివ రామ అనఘ దత్తాయ నమః |
యౌ వేధసే ప్రబలమానసదోషజాల-
-మున్మూల్యసత్వరమభాసయతాం హి వేదాన్ |
తావద్య కేళిశునకీకృతవేదజాతౌ
శ్రీమంత్రపుష్పనిచయైరనఘౌ నిషేవే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ||
కార్తవీర్యాఽజ నహుజ భార్గవేంద్రాది రక్షకౌ |
అనఘౌ లోకపితరౌ తుష్యేతాం మే ప్రదక్షిణైః ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

ఉపచార పూజా –
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః
ఛత్రమాచ్ఛాదయామి | చామరైర్వీజయామి |
నృత్యం దర్శయామి | గీతం శ్రావయామి |
వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ||

ప్రార్థనా –
మనోవాక్కాయోత్థం క్షపితుమఘమాత్మీయవితతే-
-ర్ధృతం నూనం యాభ్యాం విమలమిహ దాంపత్య లసనమ్ |
తయోః పాదద్వంద్వం మహిమముఖపుత్రాష్టక లస-
-త్పరీవారం వందే సతతమనఘాఖ్యా కలితయోః ||
విష్ణోఽనఘ దత్తేశ్వరాఽనఘే లక్ష్మి మంగళే |
ఉభౌ హి సచ్చిదానందవిగ్రహౌ భక్తరక్షకౌ ||
యువాం మే తుష్యతాం అద్య పూజయా సుప్రసీద తామ్ |
జ్ఞాతాఽజ్ఞాతాపరాధాన్ మే క్షమ్యతాం కరుణాకరౌ |
ఆయురారోగ్యమైశ్వర్యం సత్కుటుంబప్రవర్ధనమ్ |
సౌమాంగళ్యం యశో విద్యాం జ్ఞానం చ దిశతాం ముదా ||

తోరబంధనం –
బ్రహ్మవిష్ణుమహేశాన రూపిన్ త్రిగుణనాయక |
త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవాఽనఘాత్మక ||

వ్రతకథా (అనఘాష్టమీ వ్రత మాహాత్మ్యము)

అనఘాష్టమి వ్రత మాహాత్మ్య వర్ణనము శ్రీవేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీభవిష్య మహాపురాణములోని ఉత్తరపర్వములో ఉన్నది.

దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధముగా అడిగెను. “ఓ గురుదేవా! పూర్వము జంభుడను దైత్యుడు దేవతలను ఓడించెనని, తరువాత శ్రీదత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించెనని విన్నాను. అయితే శ్రీదత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసెనా లేక యోగబలముచే జయించెనా? నా ఈ సందేహమును నివృత్తిచేసి నాకు జ్ఞానోదయము చేయవలసినది.” అందులకు శ్రీగురు ఈ విధముగా పలికెను. “ఇదే ప్రశ్నను పూర్వము యుధిష్ఠిరుడు వాసుదేవుని అడుగగా, ఆ శ్రీకృష్ణుడు చెప్పినదానిని నీకు చెప్పెద, శ్రద్ధగా వినుము” అనెను.

– దత్త అవతారం –
శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. “బ్రహ్మపుత్రుడైన అత్రి మహాతేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయా గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్త నామముగల మహాత్ముడు పుట్టెను. ఆయన మహాతపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమిమీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని యెరుంగుము. ఆయన భార్య పేరు అనఘా. ఆవిడ ఎల్లపుడు పతిని అనుసరిస్తూ ఉండెను. వారి ఎనిమిది మంది పుత్రులు సర్వబ్రహ్మగుణములు కలిగి ఉండెను. అనఘ విష్ణురూపమని, లక్ష్మీరూపము అనఘా అని తెలుసుకొనుము. అనఘుడు తన భార్యతో కలసి యోగావిద్యను అభ్యసించుచూ ఉండెడివారు.

– జంభాసుర యుద్ధ వృత్తాంతం –
ఇలా ఉండగా, జంభ అను దైత్యునిచే దేవతలు పీడింపబడుట సంభవించినది. బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంభుడు, అమరావతికి వెళ్ళి నూరు దివ్యవర్షములు యుద్ధము చేసెను. ఈ సంగ్రామములో పాతళలోకములోని రాక్షసులను కుడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి పది దిక్కులకు తరిమివేయబడితిరి. ముందువైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండ వెనుకగా జంభ దైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో, గదా ముసల ముద్గరాది ఆయుధములతో దైత్యులు పోరాటము చేయుచుండిరి. అడవిదున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై, మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్ళను, శరములను కురిపిస్తూ వెంబడించెను.

అలా దేవతలు వింధ్యగిరిపై అనఘ మరియు అనఘా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను – “ఓ దేవదేవా! జగన్నాథా! శంఖచక్రగదాధరా! పాహి పాహి! ఆపదలో ఉన్న మాకు శరణమును ఇవ్వుము. జంభదైత్యుని చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు, భక్తులకు ఇంకేమియును గతి లేదు. కావున ఓ బ్రహ్మన్! దేవతలమైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి.”

వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని, తన దేవియగు అనఘా వైపు లీలగా చూచెను. విగతజ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలకు అలాగేయని అనుమతినిచ్చి తుష్టిపరిచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న బ్రాహ్మణిని (అనఘాదేవిని) చూచి ఆమె అందమునకు పరవశులై, మదము నిండిన చిత్తముతో, ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చెదమని ఎత్తుకుపోసాగిరి.

ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దేవతలు దాడిచేయుచుండ, ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము చేసిరి.

అసురులు దేవ శస్త్రములచే, మరియు జంభుడు ఇంద్రునిచే సంహరింపబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరు తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి.”

– కార్తవీర్యార్జున కథ –
శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను – “ఆ దత్తులవారు తన కర్మలచేత, మనస్సుచేత, వాక్కుచేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహాతపశ్శాలి ఊర్ధ్వబాహువులతో కట్టెవలె, ఒక రాయివలె చలనము లేకుండా, నియమములు పాటించుచూ తపస్సు చేయసాగెను. కనులతో భ్రుకుటి మధ్య స్థానమును చూచుచూ మూడువేల దివ్యవర్షములు స్థిరముగ తపస్సు చేయసాగెను.

అలా ఊర్ధ్వరేతస్కుడై, యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్లు అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను, మానసికముగా చింతన చేయుచూ, సంపూర్ణ నియమములు పాటిస్తూ ఆనందముగా సపర్యలు చేసెను.

అందులకు సంతోషించిన దత్తులవారు ఆతనికి వరములు కోరుకోమని అడుగగా, కార్తవీర్యార్జునుడు నాలుగు వరములు కోరెను. మొదటి వరముగా సహస్రబాహువులును, రెండవ వరముగా అధర్మమార్గమున వెళ్ళకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథివిని మొత్తము ధర్మమార్గమున గెలిచి ధర్మముగా యేలుటయును, నాల్గవ వరముగా సంగ్రామమున మహాయోద్ధుని చేతిలో మాత్రమే వీరమరణము పొందుటయను వరములు కోరెను. అందులకు దత్తులవారు ఆనందముగా వరములనిచ్చి, విస్తారమైన రాజ్యమును, అద్వితీయమగు యోగవిద్యను ప్రసాదించెను.

అటుపిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది, ఏడు ద్వీపములు, పర్వతములు కలిగిన పృథివి మొత్తమును తన సహస్రబాహువుల ప్రభావముతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములలో పదివేల యజ్ఞములు చేయుచూ ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞ వేదికలను స్వర్ణ స్థంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్య గాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను.

ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపముల చేత విక్రముడివలె ప్రశంసింపబడెను. తన ఖడ్గముతో, శరములతో తన యోగశక్తిచే ఏడు ద్వీపములు తిరుగుచూ చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున ద్రవ్యనష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షింపబడుచుండిరి. ఎనభైఅయిదు వేల సంవత్సరములు పాలించుచూ ఆ నరాధిపుడు (రాజు) చక్రవర్తివలె పశువులను, క్షేత్రములను, పాలించెను. ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను (వానలు కురిసెను). తన సహస్ర బాహువులతో సముద్రములను శోషింపజేయు వేయి సూర్యులవలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును జయించెను.

క్రీడావిలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచూ నదిని ఆడ్డగింప, ఆతని ధాటికి జలము పీడనమునకు గురి అయి అందమైన స్త్రీ వలె దూరముగా జరిగెను (వెనుకకు ప్రవహించినది). తన సహస్రబాహువుల తాడనము వలన సాగరము అల్లకల్లోలమై, మహాతిమింగిలములు మృతిచెంది, పాతాళమున గల అసురులు నిశ్చేష్టులాయిరి.

రావణుడను వశపరుచుకుని మాహిష్మతిలో బంధించెను. తరువాత పులస్త్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుని విడిచెను. కానీ విడుదల అయిన రావణుడు (అవమానభారముతో) పులస్త్యుని నిందించెను.

ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి (అగ్నిదేవునికి) సప్తద్వీపములలోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. ఇటువంటి గుణములు కార్తవీర్యార్జునునకు కేవలము యోగాచార్యుడైన అనఘదేవుని కృప వలన మాత్రమే కలిగెను. అలాంటి యోగి వరము లభించిన కార్తవీర్యుని వలన మర్త్యలోకమున అనఘాష్టమీ వ్రతము ప్రసిద్ధి చెందెను.

– అనఘ నామ వివరణ –
అఘము అనగా పాపము. లోకములో అఘము మూడు విధములుగా కలుగును (చిత్తము, వాక్కు, కర్మలు) అలాంటి అఘమును నాశనము చేయువాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధివిధానమున అర్చించిన అష్టగుణములు, అష్టైశ్వర్యములు కలుగును. అణిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమా, ఈశిత్వ, వశిత్వ, కామావసాయితా అను ఎనిమిది యోగసిద్ధులను అర్చించుట వలన మోక్షలక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు (దత్తులవారు) నా అంశయే యని తెలుసుకొనుము.”

అనఘాష్టమీ వ్రత విధానం
ఇది వినిన యుధిష్ఠిరుడు ఇటుల పలికెను – “ఓ పుండరీకాక్ష! ఈ సర్వరాజు అయిన (కార్తవీర్య) అర్జునుడు చేసిన వ్రతము యేమిటో, వాటి మంత్రములు, సమయములు, యే కాలమునందు, యే తిథులలో చేయవలెనో నాకు చెప్పుము కేశవ.” అనెను.

అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను – “మార్గశీర్ష మాసములో కృష్ణ పక్షములో వచ్చు అష్టమి తిథియందు, బహుపుత్రులతో కలిసియున్న అనఘ మరియు అనఘా దంపతులను, ముందుగా శాంతపరిచిన (శుద్ధిచేసిన) భూమిభాగమునందు, అష్టపత్రముల (చిత్రము) యందు కలశములలో గానీ, పద్మములయందు గానీ, లేక దర్భలయందు గానీ స్థాపించి పూజింపవలెను. ముందుగా స్నానమాచరించి, పుష్పములు మరియు సుగంధములతో, విష్ణువును ధ్యానించి, ఋగ్వేదములోని ఋక్కులతో అర్చింపవలెను.

వాసుదేవుని అంశ అయిన అనఘుని, లక్ష్మి అంశ అయిన అనఘాని, హరివంశములో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని భావించి అర్చింపవలెను.

ముందుగా శూద్రులకు, విప్రులకు నమస్కరించి, ఆ కాలములో లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు (సింగడులు), రేగులు మొదలగు వివిధ నైవేద్యములను, గంధ, ధూప, దీపాదులతో సమర్పింపవలెను. అటు తరువాత ద్విజులతో, సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలెను.

వ్రతము చివరిలో కనీసము యే ఒక్కరినైనా ఈ వ్రతము చేయుటకు ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయదగునది అను సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసం ఒక సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి (భగవత్సంబంధమైన) నటనము, నాట్యము, గానము మొదలగువాటితో జాగరణ చేసి, నవమి నాటి ప్రభాత సమయములో (దేవతా ప్రతిమలను) నీటిలో విసర్జనము చేయవలెను.

ఇట్లు యెవరైతే భక్తి యుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరము చేయునో, వారు సర్వపాపములనుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. విష్ణువు వారిపట్ల ప్రసీదుడగును. ఏడు జన్మలవరకు ఆరోగ్యము కలిగి, తదుపది పరమ గతిని పొందును.

ఓ కౌంతేయా (ధర్మరాజా) ! అఘమును శమింపు ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు, కృతవీర్యుని (కార్తవీర్యార్జునుడు) వలె యశోవంతులగుదురు.”

శ్రీగురువు పలికెను – “దత్త కథనము నీకు చెప్పితిని. జంభుని పరాజితునిజేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను, ఆ యోగి యొక్క యోగచర్యలను, అనఘ నామ వివరణము, అనఘుడు సంతోషించి భక్తులకు వరములనిచ్చు వ్రతమును చెప్పియున్నాను.” అని చెప్పి ముగించెను.

సమర్పణం –
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

అనయా మయా కృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు |

తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి పాదోదకం పావనం శుభమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

ఉద్వాసనం –
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః
తాని ధర్మాణి ప్రథమా న్యాసన్ |
తేహనాకం మహిమానస్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః యథాస్థానం ఉద్వాసయామి ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||