nIvunna chOTanE vaikuMThamu

నీవున్న చోటనే వైకుంఠము నెరసులు మరి చొరరాదు
పావన మది చెప్పేది వేదము పాటింపగవలెను

దేవుడా నా దేహమె నీకు తిరుమలగిరి పట్టణము
భావింప హృదయకమలమె బంగారపు మేడ
వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే

పరమాత్మ నా మనసే బహురత్నంబుల మంచము
గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పఱపు
తిరముగ నుజ్ఞానదీప మున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీవున్నయెడల నిక మాయల గప్పకువే

ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర
అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకు పతివి
ఘనుడవు నన్నేలితి విక కర్మము లెంచకువే


nIvunna chOTanE vaikuMThamu nerasulu mari chorarAdu
pAvana madi cheppEdi vEdamu pATiMpagavalenu

dEvuDA nA dEhame nIku tirumalagiri paTTaNamu
bhAviMpa hRdayakamalame baMgArapu mEDa
vEvElu nA vij~nAnAdulu vEDukaparichArakulu
SrIvallabhA yiMdulO nitarachiMtalu veTTakuvE

paramAtma nA manasE bahuratnaMbula maMchamu
garimala nA yAtmE nIku kaDu mettani pa~rapu
tiramuga nuj~nAnadIpa munnadi divyabhOgame AnaMdamu
marigiti nIvunnayeDala nika mAyala gappakuvE

nanichina nA vUrupulE nIku nAradAdula pATalu
vinayapu nA bhaktiye nIkunu vinOdamagu pAtra
aniSamu SrIvEMkaTESwara alamElmaMgaku pativi
ghanuDavu nannEliti vika karmamu leMchakuvE


nIvanaga nokachOTa nilichivuMDuTalEdu

నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు
నీవనుచు కనుగొన్న నిజమెల్లనీవే

తనయాత్మవలెనె భూతముల యాతుమలెల్ల -
ననయంబు కనుగొన్న యతడే నీవు
తనుగన్నతల్లిగా తగని తర కాంతలను
అనఘుడై మదిజూచు నతడే నీవు

సతత సత్య వ్రతాచార సంపన్నుడై
అతిశయంబుగ మెలగునతడే నీవు
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు
హత కాముకుడైన యతడే నీవు

మోదమున సుఃదుఃఖముల నొక్కరీతిగా
నాదరింపుచునున్న యతడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచలనాథ
ఆదియును నంత్యంబు నంతయును నీవే


nIvanaga nokachOTa nilichivuMDuTalEdu
nIvanuchu kanugonna nijamellanIvE

tanayAtmavalene bhUtamula yAtumalella -
nanayaMbu kanugonna yataDE nIvu
tanugannatalligA tagani tara kAMtalanu
anaghuDai madijUchu nataDE nIvu

satata satya vratAchAra saMpannuDai
atiSayaMbuga melagunataDE nIvu
dhRtidUli dravyaMbu tRNamugA bhAviMchu
hata kAmukuDaina yataDE nIvu

mOdamuna su@hdu@hkhamula nokkarItigA
nAdariMpuchununna yataDE nIvu
vEdOktamatiyaina vEMkaTAchalanAtha
Adiyunu naMtyaMbu naMtayunu nIvE

naMdakadhara naMdagOpanaMdana


నందకధర నందగోపనందన
కందర్పజనక కరుణాత్మన్

ముకుంద కేశవ మురహర
సకలాధిప పరమేశ్వర దేవేశ
శుకవరద సవితృ సుధాంసులోచన
ప్రకటవిభవ నమో పరమాత్మన్

ధ్రువపాంచాలీ స్తుతివత్సల మా
ధవ మధుసూదన ధరణిధరా
భువనత్రయపరితోషనతత్పర
నవనీతప్రియ నాదాత్మన్

శ్రీమన్ వేంకట శిఖర నివాస మ
హామహిమన్ నిఖిలాండపతే
కామిత ఫల భోగప్రదతే నమో
స్వామిన్ భూమన్ సర్వాత్మన్

naMdakadhara naMdagOpanaMdana
kaMdarpajanaka karuNAtman

mukuMda kESava murahara
sakalAdhipa paramESwara dEvESa
Sukavarada savitR sudhAMsulOchana
prakaTavibhava namO paramAtman

dhruvapAMchAlI stutivatsala mA
dhava madhusUdana dharaNidharA
bhuvanatrayaparitOShanatatpara
navanItapriya nAdAtman

SrIman vEMkaTa Sikhara nivAsa ma
hAmahiman nikhilAMDapatE
kAmita phala bhOgapradatE namO
swAmin bhUman sarwAtman

nannu ninnu neMchukOvO nArAyaNA


నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా
అన్నియు నీ చేతినే అదివో నారాయణా

నా మన సెరుగవా నారాయణా నేడు
నాములాయె వయసులు నారాయణా
నామధారికపు మొక్కు నారాయణా
ఆముకొని నీ ప్రియము లందునే నారాయణా

నగుతా నే నంటినింతే నారాయణా యిదె
నగ రెఱిగిన పని నారాయణా
నగవులు మాకు చాలు నారాయణా
అగడు సేయకు మికను అప్పటి నారాయణా

ననలు నీ వినయాలు నారాయణా , మంచి
ననుపంటి మిదివో నారాయణా
ఘనుడ శ్రీవేంకటాద్రిఁ గలసితి విట్లైనను
అనుమాన మెల్లా బాసెను అందు నారాయణా


nannu ninnu neMchukOvO nArAyaNA
anniyu nI chEtinE adivO nArAyaNA

nA mana serugavA nArAyaNA nEDu
nAmulAye vayasulu nArAyaNA
nAmadhArikapu mokku nArAyaNA
Amukoni nI priyamu laMdunE nArAyaNA

nagutA nE naMTiniMtE nArAyaNA yide
naga re~rigina pani nArAyaNA
nagavulu mAku chAlu nArAyaNA
agaDu sEyaku mikanu appaTi nArAyaNA

nanalu nI vinayAlu nArAyaNA , maMchi
nanupaMTi midivO nArAyaNA
ghanuDa SrIvEMkaTAdri@M galasiti viTlainanu
anumAna mellA bAsenu aMdu nArAyaNA

namAmyahaM mAnavasiMhaM


ప|| నమామ్యహం మానవసింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||

చ|| దానవదైత్య విదారణ సింహం | నానాయుధకర నరసింహం |
భూనభోంతరాళ పూరిత సింహం | ఆనన వహ్నిలయాంతక సింహం ||

చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం |
కులిశ నఖరముఖ ఘోషిత సింహం | తిలకిత బహు రవిదీపిత సింహం ||

చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయసింహం |
కాంతం శ్రీవేంకటగిరి సింహం | చింతిత ఘన సంసిద్ధ నృసింహం ||


pa|| namAmyahaM mAnavasiMhaM | pramadAMka mahObala narasiMhaM ||

ca|| dAnavadaitya vidAraNa siMhaM | nAnAyudhakara narasiMhaM |
BUnaBOMtarALa pUrita siMhaM | Anana vahnilayAMtaka siMhaM ||

ca|| praLaya nRusiMhaM bahumuKa siMhaM | salalita garuDAcala siMhaM |
kuliSa naKaramuKa GOShita siMhaM | tilakita bahu ravidIpita siMhaM ||

ca|| SAMta nRusiMhaM Saurya nRusiMhaM | saMtata karuNA jayasiMhaM |
kAMtaM SrIvEMkaTagiri siMhaM | ciMtita Gana saMsiddha nRusiMhaM ||


Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

nIdusEtalaku nEvE dishTamu


నీదుసేతలకు నీవే దిష్టము
మేదిని నేమెల్లా మెచ్చితిమయ్యా

యీడగు కాంతలు యింటనే వుండగ
వాడల సతులకు వలచితివి
వోడక క్షీరాబ్ధినుండి రేపల్లెను
తోడనే వెన్నలు దొంగిలినట్టు

వుంగిటి వాసన లొడలనే వుండగ
అంగడిగందము లడిగితివి
బంగారుపీతాంబరము నీకుండగ
చెంగటి కోకలు చేకొన్నట్టు

ఆస కౌస్తుభము అక్కున నుండగ
శ్రీసతి నురమున జేర్చితివి
సేస శ్రీవేంకటశిఖరము(?) యుండగ
రాసికుచగిరుల రమించినట్లు


nIdusEtalaku nEvE dishTamu
mEdini nEmellA mechchitimayyA

yIDagu kAMtalu yiMTanE vuMDaga
vADala satulaku valachitivi
vODaka kshIrAbdhinuMDi rEpallenu
tODanE vennalu doMgilinaTTu

vuMgiTi vAsana loDalanE vuMDaga
aMgaDigaMdamu laDigitivi
baMgArupItAMbaramu nIkuMDaga
cheMgaTi kOkalu chEkonnaTTu

Asa kaustubhamu akkuna nuMDaga
SrIsati nuramuna jErchitivi
sEsa SrIvEMkaTaSikharamu(?) yuMDaga
rAsikuchagirula ramiMchinaTlu



Sung by:TP Chakrapani

Get this widget | Track details | eSnips Social DNA

nAnArUpadharuDu nArAyaNuDu vIDE


నానారూపధరుడు నారాయణుడు వీడే
పూనినవుపములెల్లా బొసగెనితనికి

గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని
సొరిది సముద్రము చొచ్చినయట్లు
పురుషసూక్తమున విప్రులు సేసేమజ్జనము
అరుదుగ పన్నీరెల్లా నమరే నీ హరికి

అట్టే వెల్లమొయిళ్ళు ఆకసాన నిండినట్టు
గట్టిగా మేన నిండెను కప్పురకాపు
వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు
తట్టుపుణుగమరెను దైవాలరాయనికి

నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు
తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు
అలమేలుమంగ వురమున నెలకొనెనిదె
చెలరేగి శృంగారాల శ్రీవేంకుటేశునికి

nAnArUpadharuDu nArAyaNuDu vIDE
pUninavupamulellA bosagenitaniki

garima nErulu vAnakAlamuna@M benagoni
soridi samudramu chochchinayaTlu
purushasUktamuna viprulu sEsEmajjanamu
aruduga pannIrellA namarE nI hariki

aTTE vellamoyiLLu AkasAna niMDinaTTu
gaTTigA mEna niMDenu kappurakApu
voTTi tana vishNumAya voDalipai vAlinaTTu
taTTupuNugamarenu daivAlarAyaniki

niluvuna saMpadalu nilichi rUpainaTTu
telivi sommulapeTTe derachinaTTu
alamElumaMga vuramuna nelakonenide
chelarEgi SRMgArAla SrIvEMkuTESuniki



Sung by:Vedavati Prabhakar