nIkathAmRtamu niratasEvana nAku

ప|| నీకథామృతము నిరతసేవన నాకు |
చేకొనుట సకల సంసేవనంబటుగాన |

చ|| ఇదియే మంత్రరాజము నాకు నే ప్రొద్దు |
ఇదియే వేద సంహిత పాఠము |
ఇదియె బహుశాస్త్ర మెల్ల చదువుటనాకు |
ఇదియె సంధ్య నాకిదియె జపమటుగాన ||

చ|| ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు |
ఇదియె దుఃఖవిరహిత మార్గము |
ఇదియె భవ రోగరహిత భేషజమునాకు |
ఇదియె ఉపనిషద్వ్యాక్య పద్ధతి ||

చ|| ఇదియె దాన ఫలమీ జాలినది నాకు |
ఇదియె తలప పరహిత మార్గము |
ఇదియె తిరువేంకటేశ నీసంస్మరణ- |
మిదియె ఇదియె యిన్నియును నటుగాన ||


pa|| nIkathAmRtamu niratasEvana nAku | cEkonuTa sakala saMsEvanaMbaTugAna |
ca|| idiyE maMtrarAjamu nAku nE proddu | idiyE vEda saMhita pAThamu |
idiye bahuSAstra mella caduvuTanAku | idiye saMdhya nAkidiye japamaTugAna ||
ca|| idiye brahmavidyOpadESamu nAku | idiye du@hKavirahita mArgamu |
idiye Bava rOgarahita BEShajamunAku | idiye upaniShadvyAkya paddhati ||
ca|| idiye dAna PalamI jAlinadi nAku | idiye talapa parahita mArgamu |
idiye tiruvEMkaTESa nIsaMsmaraNa- | midiye idiye yinniyunu naTugAna ||




Sung by:Balakrishna Prasad

nammitijummI vO manasA

నమ్మితిజుమ్మీ వో మనసా నాకే హితవయి మెలంగుమీ
ముమ్మాటికి నే( జెప్పితి(జుమ్మీ మురహరునామమే జపించుమీ

తలచకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మరువకుమీ
కలగకుమీ యేపనికైనను కడుశాంతంబుననుండుమీ
వలవకుమీ వనితలకెప్పుడు వైరాగ్యంబున నుండుమీ
కొలువకుమీ యితరదేవతల గోవిందునే భజించుమీ

కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ
మీరకుమీ గురువులయానతి మెఱయ పురాణములే వినుమీ
చేరకుమీ దుర్జనసంగతి జితేంద్రియుడవై నిలువుమీ
దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ

వెఱవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుడవగుమీ
మఱవకుమీ యలమేల్మంగకుమగడగు శ్రీవేంకటపతిని
కెఱలకుమీ మాయారతులను కేవలసాత్వికుడవుగమ్మీ
తొఱలకుమీ నేరములను సింధు రక్షకునినే సేవించుమీ


nammitijummI vO manasA nAkE hitavayi melaMgumI
mummATiki nE( jeppiti(jummI muraharunAmamE japiMchumI

talachakumI yitaradharmamulu tatwaj~nAnamu maruvakumI
kalagakumI yEpanikainanu kaDuSAMtaMbunanuMDumI
valavakumI vanitalakeppuDu vairAgyaMbuna nuMDumI
koluvakumI yitaradEvatala gOviMdunE bhajiMchumI

kOrakumI dEhabhOgamulu gonakoni tapamE chEkonumI
mIrakumI guruvulayAnati me~raya purANamulE vinumI
chErakumI durjanasaMgati jitEMdriyuDavai niluvumI
dUrakumI karmaphalaMbunu dhruvavaraduninE nutiMchumI

ve~ravakumI puTTugulaku mari vivEkiMchi dhIruDavagumI
ma~ravakumI yalamElmaMgakumagaDagu SrIvEMkaTapatini
ke~ralakumI mAyAratulanu kEvalasAtwikuDavugammI
to~ralakumI nEramulanu siMdhu rakshakuninE sEviMchumI


Sung by:Dwaram Lakshmi

nityasukhAnaMda mide nI dAsyamu



నిత్యసుఖానంద మిదె నీ దాస్యము
సత్యములేని సుఖాలు చాలు చాలు నయ్యా

కన్ను చూపుల సుఖము కడు నీ చక్కని రూపె
యెన్నగ వీనులసుఖమిదె నీపేరు
పన్ని నాలుకసుఖము పాదపు నీతులసి
వున్న సుఖముల తెరు వొడబడమయ్యా

తనువుతోడి సుఖము తగు నీకైంకర్యము
మనసులో సుఖము నీ మంచి ధ్యానము
పనివి యూర్పుసుఖము పాదపద్మమువాసన
యెనయనిపెర సుఖమేమి సేసేనయ్యా

పుట్టుగు కెల్ల సుఖము పొల్లులేని నీభక్తి
తొట్టి కాళ్ళ సుఖము పాతురలాడుట
జట్టి శ్రీవేంకటేశ మాచనవోలిచెన్నుడవై
వొట్టుకొని మమ్మేలితివోహో మేలయ్యా


nityasukhAnaMda mide nI dAsyamu
satyamulEni sukhAlu chAlu chAlu nayyA

kannu chUpula sukhamu kaDu nI chakkani rUpe
yennaga vInulasukhamide nIpEru
panni nAlukasukhamu pAdapu nItulasi
vunna sukhamula teru voDabaDamayyA

tanuvutODi sukhamu tagu nIkaiMkaryamu
manasulO sukhamu nI maMchi dhyAnamu
panivi yUrpusukhamu pAdapadmamuvAsana
yenayanipera sukhamEmi sEsEnayyA

puTTugu kella sukhamu pollulEni nIbhakti
toTTi kALLa sukhamu pAturalADuTa
jaTTi SrIvEMkaTESa mAchanavOlichennuDavai
voTTukoni mammElitivOhO mElayyA



Sung by:Dwaram Lakshmi

nAkunAkE siggayyIni nannu

నాకునాకే సిగ్గయ్యీని నన్ను జూచుకుంటేను
చేకొని నీవే మన్నించ చెయ్యొగ్గేగాని

సేయరాని పాపములు సేసివచ్చి యేనోర
నాయెడ నిన్ను వరములడిగేను
కాయముతో యింద్రియకింకరుడనై యేమని
చేయూర నీబంటనని చెప్పుకొనేను

వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి
యేగతి కొసరి నీపై నేట వేసేము
ఆగడపు బంగారుకాతుమనేన (య) మ్ముకొని
భోగపు మోక్షము నెట్టు వొందించు మనేము

కలుపుట్టుగుబతుకు కాంతలకు వెచ్చపెట్టి
వలసి నేడెట్టు నీవార మయ్యేము
నెలవై శ్రీవేంకటేశ నీవే కరుణించితివి
బలిమి సేసి నీకెట్టు భారము వేసేము


nAkunAkE siggayyIni nannu jUchukuMTEnu
chEkoni nIvE manniMcha cheyyoggEgAni

sEyarAni pApamulu sEsivachchi yEnOra
nAyeDa ninnu varamulaDigEnu
kAyamutO yiMdriyakiMkaruDanai yEmani
chEyUra nIbaMTanani cheppukonEnu

vEgilEchi saMsAravidhulakE voDigaTTi
yEgati kosari nIpai nETa vEsEmu
AgaDapu baMgArukAtumanEna (ya) mmukoni
bhOgapu mOkshamu neTTu voMdiMchu manEmu

kalupuTTugubatuku kAMtalaku vechchapeTTi
valasi nEDeTTu nIvAra mayyEmu
nelavai SrIvEMkaTESa nIvE karuNiMchitivi
balimi sEsi nIkeTTu bhAramu vEsEmu


Sung by:Dwaram Lakshmi

nIvunna chOTanE vaikuMThamu

నీవున్న చోటనే వైకుంఠము నెరసులు మరి చొరరాదు
పావన మది చెప్పేది వేదము పాటింపగవలెను

దేవుడా నా దేహమె నీకు తిరుమలగిరి పట్టణము
భావింప హృదయకమలమె బంగారపు మేడ
వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే

పరమాత్మ నా మనసే బహురత్నంబుల మంచము
గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పఱపు
తిరముగ నుజ్ఞానదీప మున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీవున్నయెడల నిక మాయల గప్పకువే

ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర
అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకు పతివి
ఘనుడవు నన్నేలితి విక కర్మము లెంచకువే


nIvunna chOTanE vaikuMThamu nerasulu mari chorarAdu
pAvana madi cheppEdi vEdamu pATiMpagavalenu

dEvuDA nA dEhame nIku tirumalagiri paTTaNamu
bhAviMpa hRdayakamalame baMgArapu mEDa
vEvElu nA vij~nAnAdulu vEDukaparichArakulu
SrIvallabhA yiMdulO nitarachiMtalu veTTakuvE

paramAtma nA manasE bahuratnaMbula maMchamu
garimala nA yAtmE nIku kaDu mettani pa~rapu
tiramuga nuj~nAnadIpa munnadi divyabhOgame AnaMdamu
marigiti nIvunnayeDala nika mAyala gappakuvE

nanichina nA vUrupulE nIku nAradAdula pATalu
vinayapu nA bhaktiye nIkunu vinOdamagu pAtra
aniSamu SrIvEMkaTESwara alamElmaMgaku pativi
ghanuDavu nannEliti vika karmamu leMchakuvE


nIvanaga nokachOTa nilichivuMDuTalEdu

నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు
నీవనుచు కనుగొన్న నిజమెల్లనీవే

తనయాత్మవలెనె భూతముల యాతుమలెల్ల -
ననయంబు కనుగొన్న యతడే నీవు
తనుగన్నతల్లిగా తగని తర కాంతలను
అనఘుడై మదిజూచు నతడే నీవు

సతత సత్య వ్రతాచార సంపన్నుడై
అతిశయంబుగ మెలగునతడే నీవు
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు
హత కాముకుడైన యతడే నీవు

మోదమున సుఃదుఃఖముల నొక్కరీతిగా
నాదరింపుచునున్న యతడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచలనాథ
ఆదియును నంత్యంబు నంతయును నీవే


nIvanaga nokachOTa nilichivuMDuTalEdu
nIvanuchu kanugonna nijamellanIvE

tanayAtmavalene bhUtamula yAtumalella -
nanayaMbu kanugonna yataDE nIvu
tanugannatalligA tagani tara kAMtalanu
anaghuDai madijUchu nataDE nIvu

satata satya vratAchAra saMpannuDai
atiSayaMbuga melagunataDE nIvu
dhRtidUli dravyaMbu tRNamugA bhAviMchu
hata kAmukuDaina yataDE nIvu

mOdamuna su@hdu@hkhamula nokkarItigA
nAdariMpuchununna yataDE nIvu
vEdOktamatiyaina vEMkaTAchalanAtha
Adiyunu naMtyaMbu naMtayunu nIvE

naMdakadhara naMdagOpanaMdana


నందకధర నందగోపనందన
కందర్పజనక కరుణాత్మన్

ముకుంద కేశవ మురహర
సకలాధిప పరమేశ్వర దేవేశ
శుకవరద సవితృ సుధాంసులోచన
ప్రకటవిభవ నమో పరమాత్మన్

ధ్రువపాంచాలీ స్తుతివత్సల మా
ధవ మధుసూదన ధరణిధరా
భువనత్రయపరితోషనతత్పర
నవనీతప్రియ నాదాత్మన్

శ్రీమన్ వేంకట శిఖర నివాస మ
హామహిమన్ నిఖిలాండపతే
కామిత ఫల భోగప్రదతే నమో
స్వామిన్ భూమన్ సర్వాత్మన్

naMdakadhara naMdagOpanaMdana
kaMdarpajanaka karuNAtman

mukuMda kESava murahara
sakalAdhipa paramESwara dEvESa
Sukavarada savitR sudhAMsulOchana
prakaTavibhava namO paramAtman

dhruvapAMchAlI stutivatsala mA
dhava madhusUdana dharaNidharA
bhuvanatrayaparitOShanatatpara
navanItapriya nAdAtman

SrIman vEMkaTa Sikhara nivAsa ma
hAmahiman nikhilAMDapatE
kAmita phala bhOgapradatE namO
swAmin bhUman sarwAtman