Kolichina varala kongu - కొలిచిన వారల కొంగు


ప|| కొలిచిన వారల కొంగుపైడితడు | బలిమి తారక బ్రహ్మమీతడు ||
చ|| ఇనవంశాంబుధి నెగసిన తేజము | ఘనయజ్ఞంబుల గల ఫలము |
మనుజరూపమున మనియెడి బ్రహ్మము | నినుపుల రఘుకుల నిధానమీతడు ||
చ|| పరమాన్నములోపలి సారపుజవి | పరగినదివిజుల భయహరము |
మరిగినసీతా మంగళసూత్రము | ధరలో రామావతారంబితడు ||
చ|| చకితదానవుల సంహారచక్రము | సకల వనచరుల జయకరము |
వికసితమగు శ్రీవేంకట నిలయము | ప్రకటిత దశరథ భాగ్యంబితడు ||

in english:

pa|| kolicina vArala koMgupaiDitaDu | balimi tAraka brahmamItaDu ||
ca|| inavaMSAMbudhi negasina tEjamu | Ganayaj~naMbula gala Palamu |
manujarUpamuna maniyeDi brahmamu | ninupula raGukula nidhAnamItaDu ||
ca|| paramAnnamulOpali sArapujavi | paraginadivijula Bayaharamu |
mariginasItA maMgaLasUtramu | dharalO rAmAvatAraMbitaDu ||
ca|| cakitadAnavula saMhAracakramu | sakala vanacarula jayakaramu |
vikasitamagu SrIvEMkaTa nilayamu | prakaTita daSaratha BAgyaMbitaDu ||



namO namO lakShmInarasiMha


ప|| నమో నమో లక్ష్మీనరసింహ | నమో నమో సుగ్రీవ నరసింహ ||
చ|| వరద సులభ భక్తవత్సల నరసింహ | నరమృగవేష శ్రీనరసింహ |
పరమపురుష సర్వ పరిపూర్ణ నరసింహ | గిరి గుహావన సుగ్రీవనరసింహ ||
చ|| భయహర ప్రహ్లాదపాలన నరసింహ | నయన త్రయారవింద నరసింహ |
జయజయ సురముని సంస్తుత నరసింహ | క్రియాకలాప సుగ్రీవనరసింహ ||
చ|| అతి కృపానిలయ మోహనరూప నరసింహ | నత పితామహముఖ్య నరసింహ |
సతత శ్రీవేంకటేశ్వర దివ్య నరసింహ | కితవారి భంజన సుగ్రీవ నరసింహ ||


in english:

pa|| namO namO lakShmInarasiMha | namO namO sugrIva narasiMha ||
ca|| varada sulaBa Baktavatsala narasiMha | naramRgavESha SrInarasiMha |
paramapuruSha sarva paripUrNa narasiMha | giri guhAvana sugrIvanarasiMha ||
ca|| Bayahara prahlAdapAlana narasiMha | nayana trayAraviMda narasiMha |
jayajaya suramuni saMstuta narasiMha | kriyAkalApa sugrIvanarasiMha ||
ca|| ati kRpAnilaya mOhanarUpa narasiMha | nata pitAmahamuKya narasiMha |
satata SrIvEMkaTESvara divya narasiMha | kitavAri BaMjana sugrIva narasiMha ||


Get this widget | Track details | eSnips Social DNA

nimushameDategaka hari ninnu talachi

-పెద తిరుమలాచార్యుల కీర్తన-

నిముషమెడతెగక హరి నిన్ను తలచి
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక

నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు
ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే
మది మదినె యుండి ఏమరక బతుకుట గాక

కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత
వెడయాసలకు కొంత వెట్టిసేసి
అడరి కావలెననిన అందు సుఖమున్నదా
చెడక నీ సేవలే సేసి బతుకుటగాక

ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే
కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక

in english:

-peda tirumalAchAryula kIrtana-

nimushameDategaka hari ninnu talachi
mamata nI mIdanE marapi bratukuTagAka

nidurachE konnALLu nEramula konnALLu
mudimichE konnALLu mOsapOyi
kadisi kOrinanu gatakAlaMbu vachchunE
madi madine yuMDi Emaraka batukuTa gAka

kaDu tanayulaku koMta kAMtalaku noka koMta
veDayAsalaku koMta veTTisEsi
aDari kAvalenanina aMdu sukhamunnadA
cheDaka nI sEvalE sEsi batukuTagAka

dhanamu veMTa tagili dhAnyaMbunaku tagili
tanavAri tagili kAtaruDainanu
kanu kaligi SrI vEMkaTanAtha kAtuvE
konasAgi ninnunE kolichi batukuTagAka


Get this widget | Track details | eSnips Social DNA

pa nagadhara naMdagOpa narasiMha vO


ప నగధర నందగోప నరసింహ వో- నగజవరద శ్రీ నారసింహ
చ నరసింహ పరంజ్యోతి నరసింహా వీర- నరసింహ లక్ష్మీనారసింహా
నరసుఖ బహుముఖ నారసింహా వో- నరకాంతక జేజే నారసింహా
చ నమో నమో పుణ్డరీక నారసింహ వో- నమిత సురాసుర నారసింహా
నమకచమకహిత నారసింహా వో- నముచిసూదన వంద్య నారసింహా
చ నవరసాలంకార నారసింహా వో- నవనీతచోర శ్రీ నారసింహా
నవగుణ వేంకట నారసింహా వో- నవమూర్తి మండెము నారసింహా



pa nagadhara naMdagOpa narasiMha vO- nagajavarada SrI nArasiMha
ca narasiMha paraMjyOti narasiMhA vIra- narasiMha lakShmInArasiMhA
narasuKa bahumuKa nArasiMhA vO- narakAMtaka jEjE nArasiMhA
ca namO namO puNDarIka nArasiMha vO- namita surAsura nArasiMhA
namakacamakahita nArasiMhA vO- namucisUdana vaMdya nArasiMhA
ca navarasAlaMkAra nArasiMhA vO- navanItacOra SrI nArasiMhA
navaguNa vEMkaTa nArasiMhA vO- navamUrti maMDemu nArasiMhA


Get this widget | Track details | eSnips Social DNA

nArAyANAcyuta gOviMda hari

ప|| నారాయాణాచ్యుతానంత గోవింద హరి |
సారముగ నీకునే శరణంటిని ||
చ|| చలువయును వేడియును నటల సంసారంబు |
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ |
ఫలములివె యీరెండు పాపములు పుణ్యములు |
పులు
పు దీపును గలిపి భుజియించినట్లు ||
చ|| పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు |
తగుమేను పొడచూపు తనుదానె తొలగు |
నగియించు నొకవేళ నలగించు నొకవేళ |
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ||
చ|| ఇహము పరమును వలెనే యెదిటికల్లయు నిజము |
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని |
సహజ శ్రీవేంకటేశ్వర నన్ను కరుణింప |
బహువిధంబుల నన్ను పాలించవే ||

in english:
pa|| nArAyANAcyuta gOviMda hari | sAramuga nIkunE SaraNaMTini ||
ca|| caluvayunu vEDiyunu naTala saMsAraMbu | tolaku suKamokavELa duHKamokavELa |
Palamulive yIreMDu pApamulu puNyamulu | pulusu dIpunu galipi BujiyiMcinaTlu ||
ca|| pagalu rAtrularIti bahujanma maraNAlu | tagumEnu poDacUpu tanudAne tolagu |
nagiyiMcu nokavELa nalagiMcu nokavELa | vogaru kArapu viDemu ubbiMcinaTlu ||
ca|| ihamu paramunu valenE yediTikallayu nijamu | vihariMcu BrAMtiyunu viBrAMtiyunu matini |
sahaja SrIvEMkaTESvara nannu karuNiMpa | bahuvidhaMbula nannu pAliMcavE ||



Get this widget | Track details | eSnips Social DNA

nArAyaNuDItaDu narulAla

నారాయణుడీతడు నరులాల
మీరు శరణనరో మిమ్ము గాచీని

తలచిన చోటను తానే ఉన్నాడు
వలెనను వారికి కైవసమెపుడు
కొలచెను మూడడుగుల జగమెల్లాను
కొలిచినవారిని చేకొనకుండునా

యెక్కడ పిలిచినా ఏమని పలికీ
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణచి రక్షించు జగములు
దిక్కని నమ్మిన తిరముగా నేలడా

చూచిన యందెల్ల చూపును రూపము
వోచిక పొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుడే యితడట
చేచేత పూజింప సేవలుగొనడా


nArAyaNuDItaDu narulAla
mIru SaraNanarO mimmu gAchIni

talachina chOTanu tAnE unnADu
valenanu vAriki kaivasamepuDu
kolachenu mUDaDugula jagamellAnu
kolichinavArini chEkonakuMDunA

yekkaDa pilichinA Emani palikI
mokkina manniMchu munumuganu
rakkasula naNachi rakshiMchu jagamulu
dikkani nammina tiramugA nElaDA

chUchina yaMdella chUpunu rUpamu
vOchika pogaDina vuMDu nOTanu
yEchina SrIVEMkaTESuDE yitaDaTa
chEchEta pUjiMpa sEvalugonaDA




Get this widget | Track details | eSnips Social DNA

namO namO jagadEkanAtha tava sarvESa


ప|| నమో నమో జగదేకనాథ తవ సర్వేశ | విమల విశ్రుత లసద్విఖ్యాత కీర్తే ||
చ|| రామ రఘువర సిత రాజీవలోచన | భూమిజా రమణ త్రిభువన విజయ |
కోమలాంగ శ్యామ కోవిద రణరంగ | భీమ విక్రమ సత్యబిరుద ప్రవీణ ||
చ|| చారులక్షమణ భరతశతృఘ్న పూర్వజ | తారకబ్రహ్మ నిత్యస్వరూప |
ధీరశ్రీవేంకటాధిప భక్తవత్సల | భూరిగుణ సాకేతపుర నివాస ||
చ|| దళిత దైతేయ కోదండ దీక్షాదక్ష | జలజాప్తకుల విభీషణరక్షక |
కలిత దశరథ తనయ కౌసల్యానంద | సులభ వానర ముఖ్య సుగ్రీవ వరద ||



pa|| namO namO jagadEkanAtha tava sarvESa | vimala viSruta lasadviKyAta kIrtE ||
ca|| rAma raGuvara sita rAjIvalOcana | BUmijA ramaNa triBuvana vijaya |
kOmalAMga SyAma kOvida raNaraMga | BIma vikrama satyabiruda pravINa ||
ca|| cArulakShamaNa BarataSatRuGna pUrvaja | tArakabrahma nityasvarUpa |
dhIraSrIvEMkaTAdhipa Baktavatsala | BUriguNa sAkEtapura nivAsa ||
ca|| daLita daitEya kOdaMDa dIkShAdakSha | jalajAptakula viBIShaNarakShaka |
kalita daSaratha tanaya kausalyAnaMda | sulaBa vAnara muKya sugrIva varada
||


Get this widget | Track details | eSnips Social DNA