aMdulOne vunnAvADu Adi - అందులోనె వున్నావాడు ఆది

ప|| అందులోనె వున్నావాడు ఆది మూరితి | అందరాని పదవియైన నందిచ్చు నతడు ||

చ|| ఘనులిండ్ల వాకిళ్ళు కావ బొయ్యే జీవుడా | కని ణీ యాత్మ వాకిలి కావరాదా |

యెనసి పరుల రాజ్య మేలబొయ్యే జీవుడా |అనిశము నీ మనో రాజ్యము నేలరాదా ||

చ|| చెలుల రూపము లెల్ల చింతించే జీవుడా | చెలగి నీ రూప మేదో చింతించ రాదా |

కెలన సుఖములు భోగించేటి జీవుడా | పొలసి సుజ్ఞానము భోగించరాదా ||

చ|| చేవ సంసారాన బలిసిన యట్టి జీవుడా | భావపు టానందాన బలియ రాదా |

కోవరపు సంపదల కోరేటి జీవుడా | శ్రీ వేంకటేశుని సేవగోర రాదా ||

pa|| aMdulOne vunnAvADu Adi mUriti | aMdarAni padaviyaina naMdiccu nataDu ||

ca|| GanuliMDla vAkiLLu kAva boyyE jIvuDA | kani NI yAtma vAkili kAvarAdA |

yenasi parula rAjya mElaboyyE jIvuDA | aniSamu nI manO rAjyamu nElarAdA ||

ca|| celula rUpamu lella ciMtiMcE jIvuDA | celagi nI rUpa mEdO ciMtiMca rAdA |

kelana suKamulu BOgiMcETi jIvuDA | polasi suj~jAnamu BOgiMcarAdA ||

ca|| cEva saMsArAna balisina yaTTi jIvuDA | BAvapu TAnaMdAna baliya rAdA |

kOvarapu saMpadala kOrETi jIvuDA | SrI vEMkaTESuni sEvagOra rAdA ||

Andaakaa nammaleka - అందాకా నమ్మలేక

అందాకా నమ్మలేక అనుమానపడు దేహి అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు

నీదాసుడననేటినిజబుద్ది గలిగితే అదెస నప్పుడే పుణ్యుడాయ నతడు వేదతొ వొక్కొక్క వేళ వెలుతులు గలిగితే నిదయవెట్టి వెనక నీవే తీరుతువు

తొలుత నీశరణము దొరకుటొకటేకాని చెలగి యాజీవునికి జేటు లేదు కలగి నడుమంత్రాన గతిదప్పనడచిన నెలకొని వంకలొత్తనీవే నేరుతువు

నీ వల్ల గొరత లేదు నీపేరు నొడిగితే శ్రీవేంకటేశ యిట్టె చేరి కాతువు భావించలేకుండగాను భారము నీదంటే జాలు నీవారి రక్షించ నీవె దిక్కౌదువు

Andaakaa nammaleka anumaanapadu dehi Andi neesommuganaka adiyu deerutuvu

Needaasudananetinijabuddi galigite Adesa nappude punyudaaya natadu Vedato vokkokka vela velutulu galigite Nidayavetti venaka neeve teerutuvu

Toluta neesaranamu dorakutokatekaani Chelagi yaajeevuniki jetu ledu Kalagi nadumantraana gatidappanadachina Nelakoni vamkalottaneeve nerutuvu

Nee valla gorata ledu neeperu nodigite Sreevenkatesa yitte cheri kaatuvu Bhaavinchalekundagaanu bhaaramu needamte jaalu Neevaari rakshimcha neeve dikkauduvu

aMdAkadAdAnE aMtukekkuDu - అందాకదాదానే అంతుకెక్కుడు

ప|| అందాకదాదానే అంతుకెక్కుడు గాదు | ముందువెనుకంచేనా ముఖ్యుడే యతడు ||

చ|| చిత్తమంతర్ముఖము సేసుకొన నేర్చెనా | అత్తలనతడు యోగియనబడును |

సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా | వుత్తమ వివేకియని వూహింపబడును ||

చ|| భావము నబావమును పరికించి తెలిసెనా | కైవల్యనిలయుడని కానబడును |

దైవముదన్నుమతిదలపోయెనేర్చెనా | జీవన్ముక్తుడని చెప్పబడునతడు ||

చ|| అడరి వైరాగ్యధనమార్జించనోపెనా | దిడువై జితేంద్రియ స్థిరుడాతడు |

జడియు శ్రీవేంకటేశ్వరుదాసుడాయనా | బడిబడిదుదబర బ్రహ్మమేయతడు ||

pa|| aMdAkadAdAnE aMtukekkuDu gAdu | muMduvenukaMcEnA muKyuDE yataDu ||

ca|| cittamaMtarmuKamu sEsukona nErcenA | attalanataDu yOgiyanabaDunu |

sattasattaneDi suvicAraMbu galigenA | vuttama vivEkiyani vUhiMpabaDunu ||

ca|| BAvamu nabAvamunu parikiMci telisenA | kaivalyanilayuDani kAnabaDunu | daivamudannumatidalapOyenErcenA | jIvanmuktuDani ceppabaDunataDu ||

ca|| aDari vairAgyadhanamArjiMcanOpenA | diDuvai jitEMdriya sthiruDAtaDu |

jaDiyu SrIvEMkaTESvarudAsuDAyanA | baDibaDidudabara brahmamEyataDu ||

aMdarumAlinayaTTi adhamulAla - అందరుమాలినయట్టి

ప|| అందరుమాలినయట్టిఅధములాల | పొంత సంతకూటమి పొరిచూపు గాదా ||

చ|| కనక మిత్తడితోడ కలయ సరిచూచితే | అనువవునా అది దోష మవుగాక |

ఘనుడైనహరితో గడుహీనదేవతల | ననిచి సరివెట్టితే నయ మవునా భువిని ||

చ|| పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై | వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱిలేకారా |

గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల | బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా ||

చ|| కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా | పొంచి నక్కలకెల్ల బొక్కలెకాక |

అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను | కొంచపుదైవాల పలువంచలనేకాక ||

pa|| aMdarumAlinayaTTiadhamulAla | poMta saMtakUTami poricUpu gAdA ||

ca|| kanaka mittaDitODa kalaya saricUcitE | anuvavunA adi dOSha mavugAka |

GanuDainaharitO gaDuhInadEvatala | nanici sariveTTitE naya mavunA Buvini ||

ca|| paTTaBadruDu gUrcuMDEbalusiMhAsanamupai | veTTibaMTu beTTEvAru verxrxilEkArA |

gaTTigA SrIharitODa kalagaMpadEvatala | beTTi kolucuTa viMduveTTi pagagAdA ||

ca|| koMcaka siMhamuMDETiguha nuMDavaccunA | poMci nakkalakella bokkalekAka |

aMcela SrIvEMkaTESu DAtmalOnE vuMDagAnu | koMcapudaivAla paluvaMcalanEkAka ||

aMdarivalenE vunnADAtaDA - అందరివలెనే వున్నాడాతడా

ప|| అందరివలెనే వున్నాడాతడా వీడు | యిందుముఖుల గూడినా డీతడా నాడు ||

చ|| యిందరూ నేటేట జేసేయింద్రయాగపు ముద్దలు | అందుకొని యారగించినాతడా వీడు |

చెంది మునులసతులసత దెప్పించుక మంచి | విందులారగించినాడు వీడానాడు ||

చ|| తొలుత బ్రహ్మదాచిన దూడలకు బాలులకు | అలరి మారుగడించినాతడా వీడు |

నిలుచుండేడుదినాలు నెమ్మది వేలగొండెత్తి | యిల నావుల గాచినా డీతడా నాడు ||

చ|| బాలుడై పూతనాదుల బలురక్కసుల జంపి | అలరియాటలాడిన యాతడా వీడు |

యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాడు తొలుతే | యేలెను బ్రహ్మాదుల నీతడానాడు ||

pa|| aMdarivalenE vunnADAtaDA vIDu | yiMdumuKula gUDinA DItaDA nADu ||

ca|| yiMdarU nETETa jEsEyiMdrayAgapu muddalu | aMdukoni yAragiMcinAtaDA vIDu |

ceMdi munulasatulasata deppiMcuka maMci | viMdulAragiMcinADu vIDAnADu ||

ca|| toluta brahmadAcina dUDalaku bAlulaku | alari mArugaDiMcinAtaDA vIDu | nilucuMDEDudinAlu nemmadi vElagoMDetti | yila nAvula gAcinA DItaDA nADu ||

ca|| bAluDai pUtanAdula balurakkasula jaMpi | alariyATalADina yAtaDA vIDu | yIlIla SrIvEMkaTAdri yekkinADu tolutE | yElenu brahmAdula nItaDAnADu ||

aMdarikAdhAramaina - అందరికాధారమైన ఆది

ప|| అందరికాధారమైన ఆది పురుషుడీతడు | విందై మున్నారగించె విదురునికడ నీతుడు ||

చ|| సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు | వనజ భవాదులకును దైవంబై నతడీతడు | ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు | మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ||

చ|| సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు | ధరనావుల మందలలో తగ జరించె నీతడు | సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు | ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ||

చ|| పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు | సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు | తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు | వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||

pa|| aMdarikAdhAramaina Adi puruShuDItaDu | viMdai munnAragiMce vidurunikaDa nItuDu ||

ca|| sanakAdulu koniyADeDi sarvAtmakuDItaDu | vanaja BavAdulakunu daivaMbai nataDItaDu |

inamaMDalamuna jelagETihitavai BavuDitaDu | munupuTTina dEvatalaku mUlaBUti yItaDu ||

ca|| sirulosagi yaSOdayiMTa SiSuvainata DItaDu | dharanAvula maMdalalO taga jariMce nItaDu |

sarasatalanu golletalaku janavulosage nItaDu | Arasi kucEluni yaDukulu AragiMcenItaDu ||

ca|| paMkajaBavunakunu brahma pada mosagenu yItuDu | saMkIrtana lAdyulacE jaTTi goniyenItaDu |

teMkiga nEkAlamu paradEvuDaina yItaDu | vEMkaTagiri mIda praBala velasina GanuDItaDu ||



Sung By:Priya Sisters

Get this widget | Track details | eSnips Social DNA

aMdari bradukulu nAtanivE - అందరి బ్రదుకులు నాతనివే

ప|| అందరి బ్రదుకులు నాతనివే | కందువెల్ల శ్రీకాంతునిదే ||

చ|| వేమరు జదివెడి విప్రుల వేదము | సోమకవైరి యశో విభవం |

శ్రీమించు నమరుల జీవనమెల్ల సు- | ధామ ధనుని సంతత కరుణే ||

చ|| హితవగు నిలలో నీసుఖమెల్లను | దితి సుత దమనుడు దెచ్చినదే |

తతి తల్లి దండ్రి తానై కాచిన | రతి ప్రహ్లాద వరదుని కృపే ||

చ|| అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు | బలి బంధను కృప బరగినవే ||

బలసి మునుల యాపదలు వాపుటకు | బలునృప భంజను పరిణతలే ||

చ|| పూని యనాథుల పొందుగ గాచిన | జానకీ విభుని సరసతలే |

నానా భూభరణంబులు నందుని | సూనుడు చేసిన సుకృతములే ||

చ|| తలకొని ధర్మము తానై నిలుపుట | కలుష విదూరుని గర్వములే |

నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు | కలియుగమున వేంకటపతివే ||

pa|| aMdari bradukulu nAtanivE | kaMduvella SrIkAMtunidE ||

ca|| vEmaru jadiveDi viprula vEdamu | sOmakavairi yaSO viBavaM |

SrImiMcu namarula jIvanamella su- | dhAma dhanuni saMtata karuNE ||

ca|| hitavagu nilalO nIsuKamellanu | diti suta damanuDu deccinadE |

tati talli daMDri tAnai kAcina | rati prahlAda varaduni kRupE ||

ca|| alarina yamarEMdrAdula bradukulu | bali baMdhanu kRupa baraginavE || balasi munula yApadalu vApuTaku | balunRupa BaMjanu pariNatalE ||

ca|| pUni yanAthula poMduga gAcina | jAnakI viBuni sarasatalE |

nAnA BUBaraNaMbulu naMduni | sUnuDu cEsina sukRutamulE ||

ca|| talakoni dharmamu tAnai nilupuTa | kaluSha vidUruni garvamulE |

nilici lOkamulu nilipina GanuDagu | kaliyugamuna vEMkaTapativE ||