Annitaa naapaalitiki - అన్నిటా నాపాలిటికి

రాగమ్:లలిత

అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు యెన్నికగా దుధిపద మెక్కితిమి మేలు

కొందరు జీవులు నన్ను గోపగించినా మేలు చెంది కొందరట్టె సంతసించినా మేలు నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు పొందుగ కొందరు నన్ను బొగడినా మేలు

కోరి నన్ను బెద్దసేసి కొందరు మొక్కినా మేలు వేరే హీనుడని భావించినా మేలు కూరిమి గోదరు నన్ను గూడుకుండినా మేలు మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు

యిప్పటికిగలపాటి యెంతపేదయినా మేలు వుప్పతిల్లుసంపద నాకుండినా మేలు యెప్పుడు శ్రీవేంకటేశు కేనిచ్చినజన్మ మిది తప్పు లే దాతనితోడితగులమే మేలు

Raagam:Lalita

Annitaa naapaalitiki hari yaatade kaladu Yennikagaa dudhipada mekkitini melu

Kondaru jeevulu nannu gopaginchinaa melu Chendi kondaratte santasinchinaa melu Nindinchi kondaru nannu nede rosinaa melu Ponduga kondaru nannu bogadinaa melu

Kori nannu beddasesi kondaru mokkinaa melu Vere heenudani bhaavinchinaa melu Koorimi godaru nannu goodukundinaa melu Merato vidichi nannu mechchakunnaa melu

Yippatikigalapaati yentapedayinaa melu Vuppatillusampada naakundinaa melu Yeppudu sreevenkatesu kenichchinajanma midi Tappu le daatanitoditagulame melu

Annita janavouduvu - -అన్నిటా జాణ వౌదువు

అన్నిటా జాణ (రాగమ్: ) (తాలమ్: )

అన్నిటా జాణ వౌదువు ఓభళేశ్వర
యెన్ని చూచుకొంటేను ఇట్టుండు మోహము // పల్లవి //

మరు గొండలపైన నుండి మగువ బాయగ లేక
కోరివచ్చితి విందిర గుడిలోనికి
ఆరితేరిన దేవుడ వగ్గళ్ళురుకుదురా
యేరీతి వారికైనా నిట్టుండు మోహము // అన్నిటా //

నడుమను భవనాశినిది వారుచుండగాను
కడు దాటి వచ్చితివి కాంతయింటికి
వడి బారగానేరీది వత్తురా సాహసమున
యెడయ కెవ్వరికైనా నిట్టుండు మోహము // అన్నిటా //


anniTA jANa (Raagam: ) (Taalam: )

anniTA jANa vauduvu OBaLESvara
yenni cUcukoMTEnu iTTuMDu mOhamu

maru goMDalapaina nuMDi maguva bAyaga lEka
kOrivacciti viMdira guDilOniki
AritErina dEvuDa vaggaLLurukudurA
yErIti vArikainA niTTuMDu mOhamu

naDumanu BavanASinidi vArucuMDagAnu
kaDu dATi vaccitivi kAMtayiMTiki
vaDi bAragAnErIdi vatturA sAhasamuna
yeDaya kevvarikainA niTTuMDu mOhamu


annita nEruparigA - అన్నిట నేరుపరిగా

ప|| అన్నిట నేరుపరిగా అలమేలు మంగ నీకు | చిన్నచిన్న ముద్దులనే విడిపించెను ||

చ|| చనవు మెరసి నిన్ను సారెసారె చేరుకుని | మనసు దనియ నాపె మాటలాడెను |

కనుసన్న చూపులనె కప్పుర విడెములిచ్చె | దనువు దనియ నీపై తలబాలు వోసెను ||

చ|| పన్నుగడ తొడనే పానుపు చేరువనే | కన్నులు దనియగ దగ్గర నిలచెను|

మన్ననలు దైవార మచ్చికలు పెడరేచి | విన్నవీనుల దనియ విన్నపాలు సేసెను ||

చ|| మాగిన మోవి యిచ్చి మనసు గరచి యిట్టే | కౌగిలి దనియ నీకు కప్పె పయ్యెద ||

వీగక శ్రీ వేంకటేశు వెలది గూడితివిట్టె | రాగి వయసి దనియ రతి కేళి సేసెను ||

pa||annita nEruparigA alamElu maMga nIku | cinnacinna muddulanE viDipiMcenu ||

ca|| canavu merasi ninnu sAresAre cErukuni | manasu daniya nApe mATalADenu |

kanusanna cUpulane kappura viDemulicce | danuvu daniya nIpai talabAlu vOsenu ||

ca|| pannugaDa toDanE pAnupu cEruvanE | kannulu daniyaga daggara nilacenu|

mannanalu daivAra maccikalu peDarEci | vinnavInula daniya vinnapAlu sEsenu ||

ca|| mAgina mOvi yicci manasu garaci yiTTE | kaugili daniya nIku kappe payyeda ||

vIgaka SrI vEMkaTESu veladi gUDitiviTTe | rAgi vayasi daniya rati kELi sEsenu ||

anniTa nI vaMtaryAmivi - అన్నిట నీ వంతర్యామివి

ప|| అన్నిట నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను | యెన్నగ నీవొక్కడవేగతియని యెంచికొలుచుటే ప్రపన్న సంగతి ||

చ|| ఏకాంతంబున నుండినపతివి యెనసిరమించుటే సతిధర్మంబు | లోకమురచ్చలోనుండినపతి లోగొని పైకొనరానట్లు |

యీకొలదులనే సర్వదేవతలయిన్నిరూపులై నీవున్నప్పుడు | కైకొని నిను బహుముఖముల గొలుచుట గాదు పతివ్రత ధర్మంబు ||

చ|| పూనినబ్రాహ్మాణులలోపలనే నిను బూజించుట వేదోక్తధర్మము | శ్వానకుక్కుటాదులలోపల నిను సరి బూజించగరానట్లు |

యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగతజనులను | కానక, వొక్కట సరిగాజూచుట కాద వివేకధర్మంబు ||

చ|| శ్రీవేంకటపతి గురువనుమతినే సేవే నాకును శిష్యధర్మము | ఆవలనీవల నితరమార్గముల యాత్మలోన రుచిగానట్లు |

భావింపగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము | కైవశమై యిన్నిటా వెనుతగులు కాద వివేకధర్మంబు ||

pa|| anniTa nI vaMtaryAmivi avuTa dharmamE ayinAnu | yennaga nIvokkaDavEgatiyani yeMcikolucuTE prapanna saMgati ||

ca|| EkAMtaMbuna nuMDinapativi yenasiramiMcuTE satidharmaMbu | lOkamuraccalOnuMDinapati lOgoni paikonarAnaTlu |

yIkoladulanE sarvadEvatalayinnirUpulai nIvunnappuDu | kaikoni ninu bahumuKamula golucuTa gAdu pativrata dharmaMbu ||

ca|| pUninabrAhmANulalOpalanE ninu bUjiMcuTa vEdOktadharmamu | SvAnakukkuTAdulalOpala ninu sari bUjiMcagarAnaTlu |

yIniyamamulane prAkRutajanulanu yISvara nISaraNAgatajanulanu | kAnaka, vokkaTa sarigAjUcuTa kAda vivEkadharmaMbu ||

ca|| SrIvEMkaTapati guruvanumatinE sEvE nAkunu SiShyadharmamu | AvalanIvala nitaramArgamula yAtmalOna rucigAnaTlu |

BAviMpaga sakalaprapaMcamunu brahmaM satyaj~jAnamanaMtamu | kaivaSamai yinniTA venutagulu kAda vivEkadharmaMbu ||

annijAtulu - అన్నిజాతులు

అన్నిజాతులు దానెయైవున్నది
కన్నుల కలికి మాయగరచెనోయనగ ||

కన్నె శంకిణిజాతిగాబోలు వీపునను
సన్నపుమదనాంకములు జడిగొన్నవి
వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ
పన్నినటువంటి సోపానములో యనగా ||

తెఅవ దలపోయ చిత్తిణిజాతి గాబోలు
నెఋలు విచ్చుచు వీధి నిలుచున్నది
నెఅతనము మరుడు తనునిండనేసిన యంప
గరులిన్ని యనుచు రెక్కలు వెట్టుగతిని ||


కాంత హస్తిణిజాతి గాబోలు కరమూలము
లంతకంతకు నలుపులై యున్నవి
పమ్తంపు మరుడు తన భండార మిండ్లకును
దొంతిగా నిదిన కస్తూరి ముద్రలనగా ||

ఘనత పద్మిణిజాతి గాబోలు నీ లలన
తనువెల్ల పద్మ గంధంబైనది
మినుకుగా మరుడు తామెర లమ్ములనె మేను
కనలించి వడి బువ్వగట్టెనో యనగా ||

ఇదియు జగదేక మొహిణి దానె కాబోలు
కదలు కనుగవకెంపు గతిగున్నది
చెదరి చెలికనుగొనల జిందెనోయనగా ||
annijAtulu dAneyaivunnadi
kannula kaliki mAyagarachenOyanaga ||

kanne SaMkiNijAtigAbOlu vIpunanu
sannapumadanAMkamulu jaDigonnavi
vanneluga valarAju valapu talakekkiMcha
panninaTuvaMTi sOpAnamulO yanagA ||

teRava dalapOya chittiNijAti gAbOlu
neRulu vichchuchu vIdhi niluchunnadi
neRatanamu maruDu tanuniMDanEsina yaMpa
garulinni yanuchu rekkalu veTTugatini ||


kAMta hastiNijAti gAbOlu karamUlamu
laMtakaMtaku nalupulai yunnavi
pamtaMpu maruDu tana bhaMDAra miMDlakunu
doMtigA nidina kastUri mudralanagA ||

ghanata padmiNijAti gAbOlu nI lalana
tanuvella padma gaMdhaMbainadi
minukugA maruDu tAmera lammulane mEnu
kanaliMchi vaDi buvvagaTTenO yanagA ||

idiyu jagadEka mohiNi dAne kAbOlu
kadalu kanugavakeMpu gatigunnadi
chedari chelikanugonala jiMdenOyanagA ||

annicOTla baramAtmavu - అన్నిచోట్ల బరమాత్మవు

ప|| అన్నిచోట్ల బరమాత్మవు నీవు | యిన్నిరూపుల భ్రమయింతువుగా ||

చ|| పాలజలధి నుండి బదరీవనాన నుండి | ఆలయమై గయలో బ్రయాగ నుండి |

భూలోకనిధివై పురుషోత్తమాన నుండి | వేలసంఖ్యలరూపై విచ్చేతుగా ||

చ|| వుత్తరమధురలో నయోధ్యలోపల నుండి | సత్తైననందవ్రజాన నుండి |

చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి | వత్తుగా లోకములు పావనము సేయగను ||

చ|| కైవల్యమున నుండి కమలజలోకాన | మోవగ శ్రీరంగమున నుండి |

యీవల నావల నుండి యీవేంకటాద్రిపై నీవే నీవే వచ్చి నెలకొంటిగా ||

pa|| annicOTla baramAtmavu nIvu | yinnirUpula BramayiMtuvugA ||

ca|| pAlajaladhi nuMDi badarIvanAna nuMDi | Alayamai gayalO brayAga nuMDi | BUlOkanidhivai puruShOttamAna nuMDi | vElasaMKyalarUpai viccEtugA ||

ca|| vuttaramadhuralO nayOdhyalOpala nuMDi | sattainanaMdavrajAna nuMDi | cittagiMci paMcavaTi siMhAdrilOna nuMDi | vattugA lOkamulu pAvanamu sEyaganu ||

ca|| kaivalyamuna nuMDi kamalajalOkAna | mOvaga SrIraMgamuna nuMDi | yIvala nAvala nuMDi yIvEMkaTAdripai nIvE nIvE vacci nelakoMTigA ||

annalaMTA tammulaMTA - అన్నలంటా తమ్ములంటా

ప|| అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా | వన్నెల నప్పులు గొన్న వారువో వీరు ||

చ|| తెగనీక అప్పులెల్లా దీసి తీసి వారు | తగిలిన బెట్టలేక దాగిదాగి |

వెగటున బారిపోగా వెంట వెంట పెక్కు | వగల నప్పులు గొన్న వారువో వీరు ||

చ|| సేయరాని పనులెల్ల చేసి చేసి తమ | రాయడికి లోలోనె రాసి రాసి |

కాయములో చొచ్చి చొచ్చి కాచి కాచి మున్ను | వ్రాయని పత్రాలకాగే వారువో వీరు ||

చ|| దొరయై యప్పుల వారి దోసి తోసి యీ | పరిభవములనెల్ల బాసి పాసి |

సిరుల వేంకటపతి జేరి చేరి యిట్టి | వరుసనే గెలిచిన వారువో వీరు ||

pa|| annalaMTA tammulaMTA AMDlaMTA biDDalaMTA | vannela nappulu gonna vAruvO vIru ||

ca|| teganIka appulellA dIsi tIsi vAru | tagilina beTTalEka dAgidAgi |

vegaTuna bAripOgA veMTa veMTa pekku | vagala nappulu gonna vAruvO vIru ||

ca|| sEyarAni panulella cEsi cEsi tama | rAyaDiki lOlOne rAsi rAsi |

kAyamulO cocci cocci kAci kAci munnu | vrAyani patrAlakAgE vAruvO vIru ||

ca|| dorayai yappula vAri dOsi tOsi yI | pariBavamulanella bAsi pAsi |

sirula vEMkaTapati jEri cEri yiTTi | varusanE gelicina vAruvO vIru ||