Adi deva paramatma - ఆది దేవ పరమాత్మా

ప|| ఆదిదేవ పరమాత్మా వేద | వేదాంత వేద్య నమో నమో ||

అనుప|| పరాత్పరా భక్త భవ భంజన | చరాచర లోక జనక నమో నమో ||

చ|| గదాధరా వేంకటగిరి నిలయా | సదానంద ప్రసన్న నమో నమో ||


pa|| AdidEva paramAtmA vEda | vEdAMta vEdya namO namO ||

anupa|| parAtparA Bakta Bava BaMjana | carAcara lOka janaka namO namO ||

ca|| gadAdharA vEMkaTagiri nilayA | sadAnaMda prasanna namO namO ||


Adi munula - ఆది మునుల

ప|| ఆది మునుల సిద్ధాంజనము | యేదెస చూచిన నిదివో వీడే ||

చ|| నగినసెలవి బడు నాలుగు | జగములు మొగమున జూపే మోహనము

చ|| కనుదెరచిన నలుగడ నమృతములటు | అనువున గురిసీ నపారము వనితలు నంద వ్రజమున జెలగగ |

మనికిక నిరవై మలసీ వీడే ||

చ|| పరమునకును దా బరమై వెలసిన | పరిపూర్ణ పరాత్పరుడు సరస రుక్మిణికి సత్య భమకును |

వరుడగు వేంకట వరదుడే వీడు ||

pa|| Adi munula siddhAMjanamu | yEdesa cUcina nidivO vIDE ||

ca|| naginaselavi baDu nAlugu | jagamulu mogamuna jUpE mOhanamu

ca|| kanuderacina nalugaDa namRutamulaTu | anuvuna gurisI napAramu vanitalu naMda vrajamuna jelagaga | manikika niravai malasI vIDE ||

ca|| paramunakunu dA baramai velasina | paripUrNa parAtparuDu sarasa rukmiNiki satya Bamakunu | varuDagu vEMkaTa varaduDE vIDu ||

Atuma saMtasa - ఆతుమ సంతస

ప|| ఆతుమ సంతసపెట్టుటది యెఱుక తా- | నేతెరువు నొల్లకుండు టదియే యెఱుక ||

చ|| ముంచినబంధములలో ముణుగుడువడక తా- | నంచల విడదన్నుటిది యెఱుక |

చంచలపువిషయాల సగ్గుడుమగ్గుడుగాక | యెంచి హరిదలపోయు టిదియే యెఱుక ||

చ|| పాయనియర్థములకు బంటుబంటై తిరుగక | ఆయతమై మోసపోని దది యెఱుక |

పాయపుగామినలతో బలుమారు జేయుపొందు | హేయమనితలపోయు టిదియే యెఱుక ||

చ|| ధరమీదగలప్రాణితతుల నొప్పించక | అరయగ సముడగు టది యెఱుక |

గరిమల శ్రీవేంకటపతిదాసుడై | యిరవొంద సుఖియంటదియే యెఱుక ||

pa|| Atuma saMtasapeTTuTadi yerxuka tA- | nEteruvu nollakuMDu TadiyE yerxuka ||

ca|| muMcinabaMdhamulalO muNuguDuvaDaka tA- | naMcala viDadannuTidi yerxuka | caMcalapuviShayAla sagguDumagguDugAka | yeMci haridalapOyu TidiyE yerxuka ||

ca|| pAyaniyarthamulaku baMTubaMTai tirugaka | Ayatamai mOsapOni dadi yerxuka | pAyapugAminalatO balumAru jEyupoMdu | hEyamanitalapOyu TidiyE yerxuka ||

ca|| dharamIdagalaprANitatula noppiMcaka | arayaga samuDagu Tadi yerxuka | garimala SrIvEMkaTapatidAsuDai | yiravoMda suKiyaMTadiyE yerxuka ||

AtaninE nE kolici nE - ఆతనినే నే కొలిచి నే

ప|| ఆతనినే నే కొలిచి నే నందితి బో నిజసుఖము | శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టియింతయును హరి మూలము ||

చ|| కోరుదుమా దుఃఖములు కోర కేతెంచు తముదామే | ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల |

సారెకు దైవాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి | కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుడే యింతకు మూలము ||

చ|| కమ్మంటిమా ప్రపంచము ప్రపంచము గలిగీ స్వభావము అందుకది | యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుడిచ్చిన యిది గలుగు |

కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదనవుననరా దెవ్వరికి | సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము ||

చ|| సరి నెఱగుదుమా పోయినజన్మము సారెకు నేమేమి చేసితిమో | యిరవుగ నట్లా మీదటిజన్మముయెఱుకలు మఱపులు యికనేలా |

నిరతమై శ్రీవేంకటేశుడు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము | గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి ||

pa|| AtaninE nE kolici nE naMditi bO nijasuKamu | SrItaruNIpati mAyAdhavuDu sRuShTiyiMtayunu hari mUlamu ||

ca|| kOrudumA duHKamulu kOra kEteMcu tamudAmE | ArItulanE suKamulu yEteMcu naMdunu vicAra maMtEla | sAreku daivAdhInamu livi reMDu svayatnamulugA vevvariki | kOrETi dokaTE hariSaraNAgati gOviMduDE yiMtaku mUlamu ||

ca|| kammaMTimA prapaMcamu prapaMcamu galigI svaBAvamu aMdukadi | yimmula mOkShamu yIrItulanE yISvaruDiccina yidi galugu | kammi aMtaryAmikalpitaMbu livi kAdanavunanarA devvariki | sammatiMci AsapaDiyeDi dokaTE sarvalOkapati nijadAsyamu ||

ca|| sari nerxagudumA pOyinajanmamu sAreku nEmEmi cEsitimO | yiravuga naTlA mIdaTijanmamuyerxukalu marxapulu yikanElA | niratamai SrIvEMkaTESuDu tanayicca nirmiMcina didi yIdEhamu | garimela nAtanikaiMkaryamepO kalakAlamu mAku kANAci ||

AtaDE sakala - ఆతడే సకల

ప|| ఆతడే సకలవ్యాపకు డతడే యాతురబంధువు- | డతడు దలపులముంగిట నబ్బుట యెన్నడొకో ||

చ|| సారెకు సంసారంబనుజలనిధు లీదుచు నలసిన- | వారికి నొకదరిదాపగువా డిక నెవ్వడొకో |

పేరినయజ్ఞానంబను పెనుజీకటి తనుగప్పిన | చేరువవెలుగై తోపెడిచెలి యిక నెవ్వడొకో ||

చ|| దురితపుకాననములో త్రోవదప్పినవారికి | తెరువిదె కొమ్మని చూపెడిదేవు డిదెవ్వడొకో |

పెరిగినయాశాపాశము పెడగేలుగ దనుగట్టిన | వెరవకుమని విడిపించేటివిభు డిక నెవ్వడొకో ||

చ|| తగిలినయాపదలనియెడిదావానలములు చుట్టిన | బెగడకుమని వడివార్చెడిబిరు దిక నెవ్వడొకో |

తెగువయు దెంపునుగలిగినతిరువేంకటవిభు డొక్కడే | సొగిసి తలంచినవారికి సురతరువగువాడు ||

pa|| AtaDE sakalavyApaku DataDE yAturabaMdhuvu- | DataDu dalapulamuMgiTa nabbuTa yennaDokO ||

ca|| sAreku saMsAraMbanujalanidhu lIducu nalasina- | vAriki nokadaridApaguvA Dika nevvaDokO |

pErinayaj~jAnaMbanu penujIkaTi tanugappina | cEruvavelugai tOpeDiceli yika nevvaDokO ||

ca|| duritapukAnanamulO trOvadappinavAriki | teruvide kommani cUpeDidEvu DidevvaDokO |

periginayASApASamu peDagEluga danugaTTina | veravakumani viDipiMcETiviBu Dika nevvaDokO ||

ca|| tagilinayApadalaniyeDidAvAnalamulu cuTTina | begaDakumani vaDivArceDibiru dika nevvaDokO |

teguvayu deMpunugaliginatiruvEMkaTaviBu DokkaDE | sogisi talaMcinavAriki surataruvaguvADu ||

AtaDade mIrade - ఆతడదె మీరదె

ఆతడదె మీరదె అప్పగించితిమి మేము
మీతల పుదాన నేను మీకేలే చింత ||

నన్ను నేల అడిగేరే నాటి నేటి సుద్దులు
అన్నియును నడుగరే ఆతనిని
పన్నిన వారిద్దరికి పైపై మీరే కారా
వెన్నచేత బట్టుకొని నేడ నేలే నెయ్యి ||

యేలకొడ బర చేరే యింతలోనే నన్నును
చాలు నొడ బరచరే చాలు నాతని
పోలిమితో నింతేసి బుద్ది మీరెరగనిదా
తాలము చేత బట్టుకొని దాటణేలే వాకిలి ||

అనలేల పెట్టేరే ఆతనితో గూడుమని
పేనియాన లతనికే పెట్టరాదా
ఆనుక శ్రీవేంకటేశు డాతడే నన్ను గూడె
తేనెలు వంటి చెలులు తీపులు మీకేలే ||
AtaDade mIrade appagiMchitimi mEmu
mItala pudAna nEnu mIkElE chiMta ||

nannu nEla aDigErE nATi nETi suddulu
anniyunu naDugarE Atanini
pannina vAriddariki paipai mIrE kArA
vennachEta baTTukoni nEDa nElE neyyi ||

yElakoDa bara chErE yiMtalOnE nannunu
chAlu noDa baracharE chAlu nAtani
pOlimitO niMtEsi buddi mIreraganidA
tAlamu chEta baTTukoni dATaNElE vAkili ||

analEla peTTErE AtanitO gUDumani
pEniyAna latanikE peTTarAdA
Anuka SrIvEMkaTESu DAtaDE nannu gUDe
tEnelu vaMTi chelulu tIpulu mIkElE ||

ADuvAru kaDu - ఆడువారు కడు

ప|| ఆడువారు కడుగోపులవుట నీ వెరగవా | నేడు గొత్తలుగా భూమి నేర్పుక వచ్చేరా ||

చ|| వలచిన యాడువారు వాదులాటకు వచ్చిన | చలము సాధించువాడు జాణడా వాడు |

కలయని కాకతోడ కమ్మటి నలిగిపోగా | పిలిచి మాటాడకున్న ప్రియుడా వాడు ||

చ|| చనవుగలుగువారు సణగులదిట్టగాను | కనలియెగ్గువట్టితే ఘనుడా వాడు |

గునిసి సవతులపై కోపాన పతి నంటేను | విని నవ్వకుండేవాడు విభుడా వాడు ||

చ|| పాయరానియటివారు బలుములు చూపితేను | నాయాలబెట్టెడివాడు నాథుడా వాడు |

యీయెడ శ్రీవేమ్కటేశ యింతినిట్టె గూడితివి | చాయకు రాకుండువాడు సరసుడా వాడు ||

pa|| ADuvAru kaDugOpulavuTa nI veragavA | nEDu gottalugA BUmi nErpuka vaccErA ||

ca|| valacina yADuvAru vAdulATaku vaccina | calamu sAdhiMcuvADu jANaDA vADu |

kalayani kAkatODa kammaTi naligipOgA | pilici mATADakunna priyuDA vADu ||

ca|| canavugaluguvAru saNaguladiTTagAnu | kanaliyegguvaTTitE GanuDA vADu |

gunisi savatulapai kOpAna pati naMTEnu | vini navvakuMDEvADu viBuDA vADu ||

ca|| pAyarAniyaTivAru balumulu cUpitEnu | nAyAlabeTTeDivADu nAthuDA vADu |

yIyeDa SrIvEmkaTESa yiMtiniTTe gUDitivi | cAyaku rAkuMDuvADu sarasuDA vADu ||