Adima puruShuDu - ఆదిమ పురుషుడు

ప|| ఆదిమ పురుషుడు అహోబలమను | వేదాద్రి గుహలో వెలసీవాడే ||

చ|| ఉదయించే నదిగో ఉక్కు కంబమున | చెదరక శ్రీ నరసింహుడు |

కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు నెదుట గద్దెపై నిరవై నిలిచే ||

చ|| పొడ చూపెనదిగో భువి దేవతలకు | చిడుముడి శ్రీ నరసింహుడు |

అదర నందరికి నభయంబొసగుచు | నిడుకొనె తొడపైన తిరము ||

చ|| సేవలు గొన్నాడె చెలగి సురలచే | శ్రీవేంకట నరసింహుడు |

దైవమై మమ్మేలి దాసుల రక్షించే | తావు కనగ నిటు దయతో జూచి ||

pa|| Adima puruShuDu ahObalamanu | vEdAdri guhalO velasIvADE ||

ca|| udayiMcE nadigO ukku kaMbamuna | cedaraka SrI narasiMhuDu |

kadisi hiraNyuni KaMDiMci prahlAdu neduTa gaddepai niravai nilicE ||

ca|| poDa cUpenadigO Buvi dEvatalaku | ciDumuDi SrI narasiMhuDu |

adara naMdariki naBayaMbosagucu | niDukone toDapaina tiramu ||

ca|| sEvalu gonnADe celagi suralacE | SrIvEMkaTa narasiMhuDu |

daivamai mammEli dAsula rakShiMcE | tAvu kanaga niTu dayatO jUci ||


AdidaivuDai - ఆదిదైవుడై

ప|| ఆదిదైవుడై అందరిపాలిటి- | కీ దేవుడై వచ్చె నితడు ||

చ|| కోరినపరమయోగులచిత్తములలోన | యేరీతినుండెనో యీతడు |

చేరవచ్చినయాశ్రితులనెల్ల బ్రోవ | యిరీతి నున్నవాడీతడు ||

చ|| కుటిలదానవుల కోటానుగోట్ల | యెటువలె ద్రుంచెనో యీతడు |

ఘటియించి యిటువంటికారుణ్యరూపుడై | యిటువలె నున్నవా డితడు ||

చ|| తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా- | నెక్కడ నుండెనో యీతడు |

దిక్కుల వెలసినతిరువేంకటేశుడై | యిక్కడ నున్నవాడీతడు ||

pa|| AdidaivuDai aMdaripAliTi- | kI dEvuDai vacce nitaDu ||

ca|| kOrinaparamayOgulacittamulalOna | yErItinuMDenO yItaDu | cEravaccinayASritulanella brOva | yirIti nunnavADItaDu ||

ca|| kuTiladAnavula kOTAnugOTla | yeTuvale druMcenO yItaDu |

GaTiyiMci yiTuvaMTikAruNyarUpuDai | yiTuvale nunnavA DitaDu ||

ca|| takkaka brahmAMDatatulella mOci tA- | nekkaDa nuMDenO yItaDu |

dikkula velasinatiruvEMkaTESuDai | yikkaDa nunnavADItaDu ||

AdidEvuM DanaMga - ఆదిదేవుం డనంగ

ప|| ఆదిదేవుం డనంగ మొదల నవతరించి జలధి సొచ్చి | వేదములును శాస్త్రములను వెదకి తెచ్చె నితండు ||

చ|| వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల | మూలమూలం ద్రోసి ముసుగుపాలుసేసె నితండు | వేలసంఖ్యనైన సతుల వేడుక లలరంజేసి వొంటి | నాలిమగని రీతిగూడి యనుభవించె నితండు ||

చ|| కడుపులోని జగములనెల్ల గదలకుండం బాపరేని | పడకనొక్క మనసుతోడం బవ్వళించె నితండు |

అడుగు క్రింద లోకమెల్ల నడంచదలంచి గురుతుమీర | పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చి నితండు ||

చ|| కొండెవయసువాడు మంచి గోపసతుల మనములెల్ల | ఆడికెలకు నోపి కొల్లలాడి బ్రదికె నితండు |

వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుం- | జాడుం డనుచు మోక్షపదము చూరవిడిచి నితండు ||

pa|| AdidEvuM DanaMga modala navatariMci jaladhi socci | vEdamulunu SAstramulanu vedaki tecche nitaMDu ||

ca|| vAli tirugunaTTi daityavarula mOhavatulanella | mUlamUlaM drOsi musugupAlusEse nitaMDu |

vElasaMKyanaina satula vEDuka lalaraMjEsi voMTi | nAlimagani rItigUDi yanuBaviMce nitaMDu ||

ca|| kaDupulOni jagamulanella gadalakuMDaM bAparEni | paDakanokka manasutODaM bavvaLiMce nitaMDu |

aDugu kriMda lOkamella naDaMcadalaMci gurutumIra | poDavu verigi minnujalamu poDici tecci nitaMDu ||

ca|| koMDevayasuvADu maMci gOpasatula manamulella | ADikelaku nOpi kollalADi bradike nitaMDu |

vEDukalara vEMkaTAdri velasi BUtakOTi dannuM- | jADuM Danucu mOkShapadamu cUraviDici nitaMDu ||

Adi deva paramatma - ఆది దేవ పరమాత్మా

ప|| ఆదిదేవ పరమాత్మా వేద | వేదాంత వేద్య నమో నమో ||

అనుప|| పరాత్పరా భక్త భవ భంజన | చరాచర లోక జనక నమో నమో ||

చ|| గదాధరా వేంకటగిరి నిలయా | సదానంద ప్రసన్న నమో నమో ||


pa|| AdidEva paramAtmA vEda | vEdAMta vEdya namO namO ||

anupa|| parAtparA Bakta Bava BaMjana | carAcara lOka janaka namO namO ||

ca|| gadAdharA vEMkaTagiri nilayA | sadAnaMda prasanna namO namO ||


Adi munula - ఆది మునుల

ప|| ఆది మునుల సిద్ధాంజనము | యేదెస చూచిన నిదివో వీడే ||

చ|| నగినసెలవి బడు నాలుగు | జగములు మొగమున జూపే మోహనము

చ|| కనుదెరచిన నలుగడ నమృతములటు | అనువున గురిసీ నపారము వనితలు నంద వ్రజమున జెలగగ |

మనికిక నిరవై మలసీ వీడే ||

చ|| పరమునకును దా బరమై వెలసిన | పరిపూర్ణ పరాత్పరుడు సరస రుక్మిణికి సత్య భమకును |

వరుడగు వేంకట వరదుడే వీడు ||

pa|| Adi munula siddhAMjanamu | yEdesa cUcina nidivO vIDE ||

ca|| naginaselavi baDu nAlugu | jagamulu mogamuna jUpE mOhanamu

ca|| kanuderacina nalugaDa namRutamulaTu | anuvuna gurisI napAramu vanitalu naMda vrajamuna jelagaga | manikika niravai malasI vIDE ||

ca|| paramunakunu dA baramai velasina | paripUrNa parAtparuDu sarasa rukmiNiki satya Bamakunu | varuDagu vEMkaTa varaduDE vIDu ||

Atuma saMtasa - ఆతుమ సంతస

ప|| ఆతుమ సంతసపెట్టుటది యెఱుక తా- | నేతెరువు నొల్లకుండు టదియే యెఱుక ||

చ|| ముంచినబంధములలో ముణుగుడువడక తా- | నంచల విడదన్నుటిది యెఱుక |

చంచలపువిషయాల సగ్గుడుమగ్గుడుగాక | యెంచి హరిదలపోయు టిదియే యెఱుక ||

చ|| పాయనియర్థములకు బంటుబంటై తిరుగక | ఆయతమై మోసపోని దది యెఱుక |

పాయపుగామినలతో బలుమారు జేయుపొందు | హేయమనితలపోయు టిదియే యెఱుక ||

చ|| ధరమీదగలప్రాణితతుల నొప్పించక | అరయగ సముడగు టది యెఱుక |

గరిమల శ్రీవేంకటపతిదాసుడై | యిరవొంద సుఖియంటదియే యెఱుక ||

pa|| Atuma saMtasapeTTuTadi yerxuka tA- | nEteruvu nollakuMDu TadiyE yerxuka ||

ca|| muMcinabaMdhamulalO muNuguDuvaDaka tA- | naMcala viDadannuTidi yerxuka | caMcalapuviShayAla sagguDumagguDugAka | yeMci haridalapOyu TidiyE yerxuka ||

ca|| pAyaniyarthamulaku baMTubaMTai tirugaka | Ayatamai mOsapOni dadi yerxuka | pAyapugAminalatO balumAru jEyupoMdu | hEyamanitalapOyu TidiyE yerxuka ||

ca|| dharamIdagalaprANitatula noppiMcaka | arayaga samuDagu Tadi yerxuka | garimala SrIvEMkaTapatidAsuDai | yiravoMda suKiyaMTadiyE yerxuka ||

AtaninE nE kolici nE - ఆతనినే నే కొలిచి నే

ప|| ఆతనినే నే కొలిచి నే నందితి బో నిజసుఖము | శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టియింతయును హరి మూలము ||

చ|| కోరుదుమా దుఃఖములు కోర కేతెంచు తముదామే | ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల |

సారెకు దైవాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి | కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుడే యింతకు మూలము ||

చ|| కమ్మంటిమా ప్రపంచము ప్రపంచము గలిగీ స్వభావము అందుకది | యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుడిచ్చిన యిది గలుగు |

కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదనవుననరా దెవ్వరికి | సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము ||

చ|| సరి నెఱగుదుమా పోయినజన్మము సారెకు నేమేమి చేసితిమో | యిరవుగ నట్లా మీదటిజన్మముయెఱుకలు మఱపులు యికనేలా |

నిరతమై శ్రీవేంకటేశుడు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము | గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి ||

pa|| AtaninE nE kolici nE naMditi bO nijasuKamu | SrItaruNIpati mAyAdhavuDu sRuShTiyiMtayunu hari mUlamu ||

ca|| kOrudumA duHKamulu kOra kEteMcu tamudAmE | ArItulanE suKamulu yEteMcu naMdunu vicAra maMtEla | sAreku daivAdhInamu livi reMDu svayatnamulugA vevvariki | kOrETi dokaTE hariSaraNAgati gOviMduDE yiMtaku mUlamu ||

ca|| kammaMTimA prapaMcamu prapaMcamu galigI svaBAvamu aMdukadi | yimmula mOkShamu yIrItulanE yISvaruDiccina yidi galugu | kammi aMtaryAmikalpitaMbu livi kAdanavunanarA devvariki | sammatiMci AsapaDiyeDi dokaTE sarvalOkapati nijadAsyamu ||

ca|| sari nerxagudumA pOyinajanmamu sAreku nEmEmi cEsitimO | yiravuga naTlA mIdaTijanmamuyerxukalu marxapulu yikanElA | niratamai SrIvEMkaTESuDu tanayicca nirmiMcina didi yIdEhamu | garimela nAtanikaiMkaryamepO kalakAlamu mAku kANAci ||