Aamusvatamtrulu gaaru - ఆముస్వతంత్రులు గారు

రాగం: సాళంగనాట

ఆముస్వతంత్రులు గారు 'దాసోహము' నన లేరు పామరపుదేహులకు పట్టరాదు గర్వము

పరగుబ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు హరికే మొరవెట్టేరు ఆపదైతేను ధరలో మనుజులింతే తామే దయివమనేరు పొరి దాము చచ్చిపుట్టే పొద్దెరగరు

పండినవ్యాసాదులు ప్రపంచము కల్లనరు కొండలుగా బురాణాల గొనియాడేరు అండనే తిరిపెములై అందరినడిగి తా_ ముందుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు

సనకాదియోగులు శౌరిభక్తి సేసేరు దు_ ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా నినుపయి శ్రీవేంకటేశ నిను జేరి మొక్కుతానె అనిశము నిరాకారమనేరు యీద్రోహులు

Raagam:Saalamganaata

Aamusvatamtrulu gaaru 'daasohamu' nana leru Paamarapudehulaku pattaraadu garvamu

Paragubrahmaadulu brahmame taa manaleru Harike moravetteru aapadaitenu Dharalo manujulimte taame dayivamaneru Pori daamu chachchiputte podderagaru

Pamdinavyaasaadulu prapamchamu kallanaru Komdalugaa buraanaala goniyaaderu Amdane tiripemulai amdarinadigi taa_ Mumdumdi ledanukone roppadannaa maanaru

Sanakaadiyogulu Sauribhakti seseru du_ rjanulu bhakti vollaru gyanulamamtaa Ninupayi sreevenkatesa ninu jeri mokkutaane Anisamu niraakaaramaneru yeedrohulu

AmIdinijasuKa - ఆమీదినిజసుఖ

ప|| ఆమీదినిజసుఖ మరయలేము | పామరపుచాయలకే భ్రమసితిమయ్యా ||

చ|| మనసున బాలు దాగి మదియించివున్నయట్టు | ననిచి గిలిగింతకు నవ్వినయట్టు |

యెనసి సంసారసుఖ మిది నిజముసేసుక | తవివొంది యిందులోనే తడబడేమయ్యా ||

చ|| బొమ్మలాట నిజమంటా బూచి చూచి మెచ్చినట్టు | తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు |

కిమ్ముల యీజన్మమందు కిందుమీదు నేఱక | పమ్మి భోగములనేతెప్పల దేలేమయ్యా ||

చ|| బాలులు యిసుకగుళ్ళు పస గట్టు కాడినట్టు | వీలి వెఱ్ఱివాడు గంతువేసినయట్టు |

మేలిమి శ్రీవేంకటేశ మిమ్ము గొలువక నేము | కాల మూరకే యిన్నాళ్ళు గడిపితిమయ్యా ||

pa|| AmIdinijasuKa marayalEmu | pAmarapucAyalakE BramasitimayyA ||

ca|| manasuna bAlu dAgi madiyiMcivunnayaTTu | nanici giligiMtaku navvinayaTTu |

yenasi saMsArasuKa midi nijamusEsuka | tavivoMdi yiMdulOnE taDabaDEmayyA ||

ca|| bommalATa nijamaMTA bUci cUci meccinaTTu | temmagA SivamADi tA dEvarainaTTu |

kimmula yIjanmamaMdu kiMdumIdu nErxaka | pammi BOgamulanEteppala dElEmayyA ||

ca|| bAlulu yisukaguLLu pasa gaTTu kADinaTTu | vIli verxrxivADu gaMtuvEsinayaTTu |

mElimi SrIvEMkaTESa mimmu goluvaka nEmu | kAla mUrakE yinnALLu gaDipitimayyA ||

Apannula pAli - ఆపన్నుల పాలి

ప|| ఆపన్నుల పాలి దైవమాతడే గతి తక్క | ఏ ప్రొద్దును భజియించక నితరుడు మరి కలడా ||

చ|| నిరుపాధిక నిజ బంధుడు నిరతిశయానందుడు | కరి వరదుడితడే కాక ఘనుడధికుడు కలడా ||

చ|| సంతత గుణ సంపన్నుడు సాధులకు బ్రసన్నుడు | అంతర్యామితడే కాక అధికుడు మరి కలడా||

చ|| పరమాత్ముడు పరమ పురుషుడు పరికింపగ గృపాలుడు | తిరువేంకట విభుడే కాక దేవుడు మరి కలడా ||

pa|| Apannula pAli daivamAtaDE gati takka | E proddunu bhajiyiMcaka nitaruDu mari kalaDA ||

ca|| nirupAdhika nija baMdhuDu niratiSayAnaMduDu | kari varaduDitaDE kAka GanuDadhikuDu kalaDA ||

ca|| saMtata guNa saMpannuDu sAdhulaku brasannuDu | aMtaryAmitaDE kAka adhikuDu mari kalaDA||

ca|| paramAtmuDu parama puruShuDu parikiMpaga gRupAluDu | tiruvEMkaTa vibhuDE kAka dEvuDu mari kalaDA ||

ApadbaMdhuDu hari - ఆపద్బంధుడు హరి

ప|| ఆపద్బంధుడు హరి మాకు గలడు | దూపిలి తలచినా దోషహరము ||

చ|| గరుడనినెక్కినఘనరేవంతుడు | గరుడకేతనముగలరథుడు |

గరుడడే తనకును గరియగుబాణము | గరిమె నీతడేపో ఘనగారుడము ||

చ|| పాముపరపై బండినసిద్ధుడు | పాముపాశములపరిహరము |

పామున నమృతముపడదచ్చినతడు | వేమరు నీతడే విషహరము ||

చ|| కమలాక్షు డీతడు కమలనాథుడును | కమలాదేవికి గైవశము |

అమరిన శ్రీవేంకటాధిపు డితడే | మమతల మా కిదే మంత్రౌషధము ||

pa|| ApadbaMdhuDu hari mAku galaDu | dUpili talacinA dOShaharamu ||

ca|| garuDaninekkinaGanarEvaMtuDu | garuDakEtanamugalarathuDu |

garuDaDE tanakunu gariyagubANamu | garime nItaDEpO GanagAruDamu ||

ca|| pAmuparapai baMDinasiddhuDu | pAmupASamulapariharamu |

pAmuna namRutamupaDadaccinataDu | vEmaru nItaDE viShaharamu ||

ca|| kamalAkShu DItaDu kamalanAthuDunu | kamalAdEviki gaivaSamu |

amarina SrIvEMkaTAdhipu DitaDE | mamatala mA kidE maMtrauShadhamu ||

Apadala saMpadala - ఆపదల సంపదల

ప|| ఆపదల సంపదల నలయుటేమిట మాను | రూపింప నిన్నిటను రోసినను గాక ||

చ|| కడలేని దేహ రోగంబులేమిట మాను | జడను విడిపించు నౌషధ సేవగాక |

విడవ కడియాస తను వేచుటేమిట మాను | వొడలి కలగుణమెల్ల నుడిగినను గాక ||

చ|| దురిత సంగ్రహమైన దుఃఖమేమిట మాను | సరిలేని సౌఖ్యంబు చవికొన్న గాక |

కరుకైన మోహాంధకార మేమిటి మాను | అరిది తేజోమార్గ మలవడిన గాక ||

చ|| చావులో బెనగొన్న జన్మ మేమిటి మాను | యీవలావలి కర్మమెడసిన గాక |

భావింప నరుదైన బంధమేమిటి మాను | శ్రీ వేంకటేశ్వరుని సేవచే గాక ||

pa|| Apadala saMpadala nalayuTEmiTa mAnu | rUpiMpa ninniTanu rOsinanu gAka ||

ca|| kaDalEni dEha rOgaMbulEmiTa mAnu | jaDanu viDipiMcu nauShadha sEvagAka |

viDava kaDiyAsa tanu vEcuTEmiTa mAnu | voDali kalaguNamella nuDiginanu gAka ||

ca|| durita saMgrahamaina duHKamEmiTa mAnu | sarilEni sauKyaMbu cavikonna gAka |

karukaina mOhAMdhakAra mEmiTi mAnu | aridi tEjOmArga malavaDina gAka ||

ca|| cAvulO benagonna janma mEmiTi mAnu | yIvalAvali karmameDasina gAka |

BAviMpa narudaina baMdhamEmiTi mAnu | SrI vEMkaTESvaruni sEvacE gAka ||

AnaMda nilaya prahlAda - ఆనంద నిలయ ప్రహ్లాద

ప|| ఆనంద నిలయ ప్రహ్లాద వరదా | భాను శశి నేత్ర జయ ప్రహ్లాద వరదా ||

చ|| పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా | హరి అచ్యుతానంద ప్రహ్లాద వరదా |

పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా | భరిత కల్యాణగుణ ప్రహ్లాద వరదా ||

చ|| భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా | అవిరళ కేశవ ప్రహ్లాద వరదా |

పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా | భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా ||

చ|| బల యుక్త నరసింహ ప్రహ్లాద వరదా | లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా |

ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా | బలి వంశ కారణ ప్రహ్లాద వరదా ||

pa|| AnaMda nilaya prahlAda varadA | BAnu SaSi nEtra jaya prahlAda varadA ||

ca|| parama puruSha nitya prahlAda varadA | hari acyutAnaMda prahlAda varadA | paripUrNa gOviMda prahlAda varadA | Barita kalyANaguNa prahlAda varadA ||

ca|| BavarOga saMharaNa prahlAda varadA | aviraLa kESava prahlAda varadA | pavamAna nuta kIrti prahlAda varadA | Bava pitAmaha vaMdya prahlAda varadA ||

ca|| bala yukta narasiMha prahlAda varadA | lalita SrI vEMkaTAdri prahlAda varadA | Palita karuNArasa prahlAda varadA | bali vaMSa kAraNa prahlAda varadA ||

Adima puruShuDu - ఆదిమ పురుషుడు

ప|| ఆదిమ పురుషుడు అహోబలమను | వేదాద్రి గుహలో వెలసీవాడే ||

చ|| ఉదయించే నదిగో ఉక్కు కంబమున | చెదరక శ్రీ నరసింహుడు |

కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు నెదుట గద్దెపై నిరవై నిలిచే ||

చ|| పొడ చూపెనదిగో భువి దేవతలకు | చిడుముడి శ్రీ నరసింహుడు |

అదర నందరికి నభయంబొసగుచు | నిడుకొనె తొడపైన తిరము ||

చ|| సేవలు గొన్నాడె చెలగి సురలచే | శ్రీవేంకట నరసింహుడు |

దైవమై మమ్మేలి దాసుల రక్షించే | తావు కనగ నిటు దయతో జూచి ||

pa|| Adima puruShuDu ahObalamanu | vEdAdri guhalO velasIvADE ||

ca|| udayiMcE nadigO ukku kaMbamuna | cedaraka SrI narasiMhuDu |

kadisi hiraNyuni KaMDiMci prahlAdu neduTa gaddepai niravai nilicE ||

ca|| poDa cUpenadigO Buvi dEvatalaku | ciDumuDi SrI narasiMhuDu |

adara naMdariki naBayaMbosagucu | niDukone toDapaina tiramu ||

ca|| sEvalu gonnADe celagi suralacE | SrIvEMkaTa narasiMhuDu |

daivamai mammEli dAsula rakShiMcE | tAvu kanaga niTu dayatO jUci ||