Inni rasula yuniki - ఇన్నిరాసుల యునికి

Inni rasula yuniki - ఇన్నిరాసుల యునికి | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P SUSHEELA:

ఇన్నిరాసుల యునికి (రాగం: ) (తాళం : )

ప|| ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి | కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి ||

చ|| కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి | మెలయు మీనాక్షికిని మీనరాశి |
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి | చెలగు హరిమధ్యకును సింహరాశి ||

చ|| చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి | కన్నెపాయపు సతికి కన్నెరాశి |
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి | తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి ||

చ|| ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి | గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి |
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి | ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి ||

innirAsula yuniki (Raagam: ) (Taalam: )

pa|| innirAsula yuniki yiMti celuvapu rASi | kanne nI rASi kUTami galigina rASi ||

ca|| kaliki boma viMDlugala kAMtakunu dhanurASi | melayu mInAkShikini mInarASi |
kuluku kucakuMBamula kommakunu kuMBarASi | celagu harimadhyakunu siMharASi ||

ca|| cinnimakarAMkapu bayyeda cEDiyaku makararASi | kannepAyapu satiki kannerASi |
vannemai paiDi tuladUgu vanitaku dulArASi | tinnani vADi gOLLa satiki vRuScikarASi ||

ca|| Amukonu norapula merayu nativaku vRuShaBarASi | gAmiDi guTTumATala satiki karkATakarASi |
kOmalapu cigurumOvi kOmaliki mESharASi | prEma vEMkaTapati galise priya mithunarASi ||

inniyu mugisenu - ఇన్నియు ముగిసెను

ఇన్నియు ముగిసెను (రాగం: ) (తాళం : )

ప|| ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే | పన్ని పరుల చెప్పగ చోటేది ||

చ|| కుందని నీ రోమకూపంబులలో | గొందుల బ్రహ్మాండ కోట్లట |
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో | యిందు పరులమని యెంచగ నేది ||

చ|| నీ కొన చూపున నెరి కోటి సూర్యు | లేకమగుచు నుదయించురట |
నీ కాయమెంతో నీ వుని కేదో | నీకంటె పరులని నిక్కగ నేది ||

చ|| జీవకోటి నీ చిన్ని మాయలో | ప్రోవులగుచు నటు పొడమె నట |
శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో | ఆవల పరులకు ఆధిక్య మేది ||

inniyu mugisenu (Raagam: ) (Taalam: )


pa|| inniyu mugisenu iTu nIlOnanE | panni parula ceppaga cOTEdi ||

ca|| kuMdani nI rOmakUpaMbulalO | goMdula brahmAMDa kOTlaTa |
yeMdaru brahmalO yeMta prapaMcamO | yiMdu parulamani yeMcaga nEdi ||

ca|| nI kona cUpuna neri kOTi sUryu | lEkamagucu nudayiMcuraTa |
nI kAyameMtO nI vuni kEdO | nIkaMTe parulani nikkaga nEdi ||

ca|| jIvakOTi nI cinni mAyalO | prOvulagucu naTu poDame naTa |
SrIvEMkaTESvara ceppaga nIveMtO | Avala parulaku Adhikya mEdi ||

inniyu galuguTEjanmamuna - ఇన్నియు గలుగుటేజన్మమున

ఇన్నియు గలుగుటేజన్మమున (రాగం: ) (తాళం : )

ప|| ఇన్నియు గలుగుటేజన్మమున నైన | జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు ||

చ|| అరయ వేదాధ్యనమది బ్రహ్మశుద్ధికొర- | కిరవైన శాస్త్రంబులెరుక కొరక |
తరి యజ్ఞములు ఋణోత్తారమయ్యెడి కొరకు | సరిలేని దానములు జన్మములకొరకు ||

చ|| మమకారదూరంబు మనసు గెలుచుటకొరకౌ | సమవివేకంబు శాంతములకొరకు |
అమర శ్రీతిరువేంకటాద్రీశు మనసు నీ- | జముగెలుచు బ్రహ్మ విజ్ఞానంబుకొరకు ||

inniyu galuguTEjanmamuna (Raagam: ) (Taalam: )


pa|| inniyu galuguTEjanmamuna naina | jennalara harisEva siddhiMcukoraku ||

ca|| araya vEdAdhyanamadi brahmaSuddhikora- | kiravaina SAstraMbuleruka koraka |

tari yaj~jamulu RuNOttAramayyeDi koraku | sarilEni dAnamulu janmamulakoraku ||

ca|| mamakAradUraMbu manasu gelucuTakorakau | samavivEkaMbu SAMtamulakoraku |

amara SrItiruvEMkaTAdrISu manasu nI- | jamugelucu brahma vij~jAnaMbukoraku ||


inninEtalaku - ఇన్నినేతలకు

ఇన్నినేతలకు (రాగం: ) (తాళం : )

ప|| ఇన్నినేతలకు నిది యొకటే | కన్నా మన సిది కానదుగాని||

చ|| పాతకకోట్లు భవములు భస్మీ- | భూతముసేయగ బొడవొకటే |
శ్రీతరుణీపతిచింత, నిజముగా | యేతరి చిత్తం బెఱగదుగాని ||

చ|| మరణభయంబులు మదములు మలినీ- | కరణము సేయగగల దొకటే |
హరినామామృత మందుమీది రతి | నిరతము నాకిది నిలువదుగాని ||

చ|| కుతిలములును దుర్గుణములును దృణీ- | కృతములు సేయగ గురుతొకటే |
పతియగు వేంకటపతి సేవారతి, | గతియని మతిగని కానదుగాని ||

inninEtalaku (Raagam: ) (Taalam: )


pa|| inninEtalaku nidi yokaTE | kannA mana sidi kAnadugAni||

ca|| pAtakakOTlu Bavamulu BasmI- | BUtamusEyaga boDavokaTE |
SrItaruNIpaticiMta, nijamugA | yEtari cittaM berxagadugAni ||

ca|| maraNaBayaMbulu madamulu malinI- | karaNamu sEyagagala dokaTE |
harinAmAmRuta maMdumIdi rati | niratamu nAkidi niluvadugAni ||

ca|| kutilamulunu durguNamulunu dRuNI- | kRutamulu sEyaga gurutokaTE |
patiyagu vEMkaTapati sEvArati, | gatiyani matigani kAnadugAni ||


inniTiki mUlamu - ఇన్నిటికి మూలము

ఇన్నిటికి మూలము (రాగం: ) (తాళం : )

ప|| ఇన్నిటికి మూలము యీతనిరూపు | యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె ||

చ|| కమలనాభునికి కప్పురకాపు మేన | సముచితముగ బైపై చాతినపుడు |
అమృతముదచ్చేవేళ నట్టే మేన దుంపుర్లు | తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె ||

చ|| దైవశిఖామణికి తట్టుపుణుగు మేనను | చేవమీర నించి సేవసేసేయప్పుడు |
వేవేలుగా యమునతో వేమారు నీదులాడగా | కావిరి కాళిమ నిండాగప్పినయట్లుండె ||

చ|| అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి- | కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు |
కులికి గొల్లెతలను కూడగా గుబ్బలమీద | గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె ||

inniTiki mUlamu (Raagam: ) (Taalam: )


pa|| inniTiki mUlamu yItanirUpu | yennaga nupamalaku niravainaTluMDe ||

ca|| kamalanABuniki kappurakApu mEna | samucitamuga baipai cAtinapuDu |
amRutamudaccEvELa naTTE mEna duMpurlu | tamitODa niMDukoni daTTamainaTluMDe ||

ca|| daivaSiKAmaNiki taTTupuNugu mEnanu | cEvamIra niMci sEvasEsEyappuDu |
vEvElugA yamunatO vEmAru nIdulADagA | kAviri kALima niMDAgappinayaTluMDe ||

ca|| alamElumaMgatODa naTTE SrIvEMkaTapati- | kelamitO sommuveTTi yeMcinapuDu |
kuliki golletalanu kUDagA gubbalamIda | galapasapellA vacci kammukonnaTluMDe ||


inniTiki brErakuDu - ఇన్నిటికి బ్రేరకుడు

ఇన్నిటికి బ్రేరకుడు (రాగం: ) (తాళం : )

ప|| ఇన్నిటికి బ్రేరకుడు యీశ్వరుడింతే | పన్ని యీతని దెలిసి బ్రదుకుటే జ్ఞానము ||

చ|| మనసున బుట్టిన మంకుగామక్రోధాలు | పనిలేవు తనకంటే బాపమంటదు |
పనివి తొడిమ నూడి పండు తీగె నంటదు | జనులకెల్లా బ్రకృతి సహజమింతే ||

చ|| చేతులార జేసికొన్న కర్మానకు | ఘాతల గర్త గానంటే కట్టువడడు |
ఆతల నబక ముంచినట్టివేడి చెయ్యంటదు | జాతి దేహము మోచిన సహజమింతే ||

చ|| వాకుననాడినయట్టి వట్టిపల్లదాలనెల్లా | దాకొని పొరయనంటే తప్పులే లేవు |
పైకొని శ్రీవేంకటేశు బంటుకు వళకులేదు | సైకమైన హరిభక్తి సహజమింతే ||

inniTiki brErakuDu (Raagam: ) (Taalam: )


pa|| inniTiki brErakuDu yISvaruDiMtE | panni yItani delisi bradukuTE j~jAnamu ||

ca|| manasuna buTTina maMkugAmakrOdhAlu | panilEvu tanakaMTE bApamaMTadu |
panivi toDima nUDi paMDu tIge naMTadu | janulakellA brakRuti sahajamiMtE ||

ca|| cEtulAra jEsikonna karmAnaku | GAtala garta gAnaMTE kaTTuvaDaDu |
Atala nabaka muMcinaTTivEDi ceyyaMTadu | jAti dEhamu mOcina sahajamiMtE ||

ca|| vAkunanADinayaTTi vaTTipalladAlanellA | dAkoni porayanaMTE tappulE lEvu |
paikoni SrIvEMkaTESu baMTuku vaLakulEdu | saikamaina hariBakti sahajamiMtE ||


inniTi mUlambISwaruDaatani - ఇన్నిటి మూలంబీశ్వరుడాతని

ఇన్నిటి మూలంబీశ్వరుడాతని (రాగం:మలహరి ) (తాళం : ఆది )

ఇన్నిటి మూలంబీశ్వరుడాతని మన్నన కొలదినె మలయుట గాక


మాయ మయమై మనియెడి జగమిది చాయల నిందు నిజము కలదా కాయము సుఖ దూఃఖములకు పొత్తిది రేయి పగలు ఒకరీతే కలదా

దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వసమౌనా ధావతి మనసిది తన కర్మ మూలము వేవేలైనా విడువగ వశమా

పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చంచలంబు నిశ్చల మౌనా ఎంచగ శ్రీ వేంకటేశ్వరు కృప తో సంచయ మైతే సతమౌ గాక

inniTi mUlambISwaruDaatani (Raagam: malahari) (Taalam:aadi )

inniTi mUlambISwaruDaatani mannana koladine malayuTa gaaka


maaya mayamai maniyeDi jagamidi chaayala nindu nijamu kaladaa kaayamu sukha dua@hkhamulaku pottidi rEyi pagalu okareetE kaladaa

daivaadheenamu tagu samsaaramu vaaviri jeevula vasamounaa dhaavati manasidi tana karma mUlamu VEvElainaa viDuvaga vaSamaa

panchEmdriyamula paragETi bratukidi chamchalambu niSchala mounaa emchaga SrI vEnkaTESwaru kRpa tO samchaya maitE satamou gaaka

Get this widget | Track details | eSnips Social DNA