ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు (రాగం: ) (తాళం : )
ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు|యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు||
ఖరదూషణాదులను ఖండతుండముల సేసె|అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె|ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము||
కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల|తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె|యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన||
పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-|కొడుకుల( గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె|అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె||
ItaDE raghurAmuDItaDEkAMgavIruDu (Raagam: ) (Taalam: )
ItaDE raghurAmuDItaDEkAMgavIruDu|yItaDu chEsina chEta lenniyainA kalavu
kharadUshaNAdulanu khaMDatuMDamula sEse|arudugA vAli nokkayammuna nEse
saravi koMDalachEta samudramu baMdhiMche|iravai vibhIshaNunikichche laMkArAjyamu||
kUDapeTTe vAnarula, kuMbhakarNAdidaityula|tODanE rAvaNujaMpe duramu gelche
vEDukatO sItAdEvi kUDenu pushpakamekke|yIDu jODai siMhAsana mEle nayOdhyalOna
puDamiyaMtayu( gAche poMdugA tanaMtalEsi-|koDukula( gAMchenu kuSalavula
yeDayaka SrIvEMkaTESuDai varamulichche|aDari tArakabrahmamai ide velase
Sung By:Balakrishna Prasad
|
ఈతడే ముక్తి దోవ (రాగం: ) (తాళం : ) ప|| ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు- | డితడు గలుగబట్టి యిందరు బదికిరి || చ|| అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు | యిది వీడె శ్రీవేంకటేశు నెదుట | వెద వెట్టి లోకములో వేదము లన్నియు మంచి | పదములు సేసి పాడీ పావనము సెసెను || చ|| అలరుచు దాళ్ళపాక అన్నమాచార్యులు | నిలచి శ్రీవేంకట నిధియే తానై | కలిదోషములు వాప ఘన పురాణము లెల్ల | పలుకుల నించి పాడినాడు హరిని || చ|| అంగవించె దాళ్ళపాక అన్నమాచార్యులు | బంగారు శ్రీ వేంకటేశు పాదములందు | రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు | మంగను యిద్దరిబాడి మమ్ము గరుణించెను || ItaDE mukti dOva (Raagam: ) (Taalam: ) pa|| ItaDE mukti dOva yItaDE mAyAcAryu- | DitaDu galugabaTTi yiMdaru badikiri || ca|| adivO tALLapAka annamAcAryulu | yidi vIDe SrIvEMkaTESu neduTa |
veda veTTi lOkamulO vEdamu lanniyu maMci | padamulu sEsi pADI pAvanamu sesenu || ca|| alarucu dALLapAka annamAcAryulu | nilaci SrIvEMkaTa nidhiyE tAnai |
kalidOShamulu vApa Gana purANamu lella | palukula niMci pADinADu harini || ca|| aMgaviMce dALLapAka annamAcAryulu | baMgAru SrI vEMkaTESu pAdamulaMdu |
raMgumIra SrIvEMkaTa ramaNuni yalamElu | maMganu yiddaribADi mammu garuNiMcenu ||
Itadakhilambunaku - ఈతడఖిలంబునకు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English Listen Audio by VANI JAIRAM:
ఈతడఖిలంబునకు (రాగం: ) (తాళం : ) ప|| ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల- | భూతములలోన దా బొదలువాడితడు || చ|| గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద | చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు |
తాపసోత్తముల చింతాసౌధములలోన | దీపించు సుజ్ఞానదీప మితడు || చ|| జలధికన్యాపాంగ లలితేక్షణములతో | కలసి వెలుగుచున్న కజ్జలంబితడు |
జలజాసనుని వదనజలధి మధ్యమునందు | అలర వెలువడిన పరమామృతంబితడు || చ|| పరివోని సురతసంపదల నింపులచేత | వరవధూతతికి పరవశమైన యితడు |
తిరువేంకటాచలాధిపుడు దానె యుండి | పరిపాలనముసేయు భారకుండితడు || ItaDaKilaMbunaku (Raagam: ) (Taalam: ) pa|| ItaDaKilaMbunaku nISvaruDai sakala- | BUtamulalOna dA bodaluvADitaDu || ca|| gOpAMganalamerugu gubbacannulamIda | cUpaTTukamma gasturipUta yitaDu |
tApasOttamula ciMtAsaudhamulalOna | dIpiMcu suj~jAnadIpa mitaDu || ca|| jaladhikanyApAMga lalitEkShaNamulatO | kalasi velugucunna kajjalaMbitaDu |
jalajAsanuni vadanajaladhi madhyamunaMdu | alara veluvaDina paramAmRutaMbitaDu || ca|| parivOni suratasaMpadala niMpulacEta | varavadhUtatiki paravaSamaina yitaDu |
tiruvEMkaTAcalAdhipuDu dAne yuMDi | paripAlanamusEyu BArakuMDitaDu ||
ఈతగవే నాకు (రాగం: సామంతం) (తాళం : ) ఈతగవే నాకు నీకు నెంచి చూచితే కాతరపుజీవులకు గలదా వివేకము భారము నీదిగనక పలుమారు బాపములే చేరి మొక్కలాన నే జేసితిని పేరడి దల్లిదండ్రులు బిడ్డ లేమిసేసినాను వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున కాన నీవుగలవని కడదాకా నేరములే వేవేలు సేసితిని వెఱవక భావించుక యింటిదొర పసురము దెంచుకొని యేవిధి బైరుమేసినా నెగ్గుసేయ డతడు పుట్టించేవాడవు నీవు పొదలేవారము నేము యెట్టుండినా నీకు బోదు యెన్నటికిని వొట్టుక శ్రీవేంకటేశ వోడగట్టినదూలము అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు Eetagavae naaku(Raagam: Saamamtam) (Taalam: ) Eetagavae naaku neeku nemchi choochitae Kaatarapujeevulaku galadaa vivaekamu Bhaaramu neediganaka palumaaru baapamulae Chaeri mokkalaana nae jaesitini Paeradi dallidamdrulu bidda laemisaesinaanu Voruchuka muddusaesukumduru lokamuna Kaana neevugalavani kadadaakaa naeramulae Vaevaelu saesitini ve~ravaka Bhaavimchuka yimtidora pasuramu demchukoni Yaevidhi bairumaesinaa neggusaeya datadu Puttimchaevaadavu neevu podalaevaaramu naemu Yettumdinaa neeku bodu yennatikini Vottuka sreevaemkataesa vodagattinadoolamu Atunittu boralinaa namdavaaya depudu
|