IdEha vikAramunaku - ఈదేహ వికారమునకు

ఈదేహ వికారమునకు(రాగం: ) (తాళం : )

ప|| ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము | మోదమెరంగని మోహము ముందర గననీదు ||

చ|| నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు | సత్యాలాపవిచారము జరగదు లోభికిని |

హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును | ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు ||

చ|| సతతానందవికాసము సంధించదు తామసునకు | గతకల్మష భావము దొరకదు వ్యసనికిని |

జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి | అతులితగంభీర గుణంబలవడ దధమునకు ||

చ|| శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము- | ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు |

దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము | సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు ||

IdEha vikAramunaku(Raagam: ) (Taalam: )

pa|| IdEha vikAramunaku nEdiyu gaDapala Ganamu | mOdameraMgani mOhamu muMdara gananIdu ||

ca|| nityAnityavivEkamu nIrasunaku nonagUDadu | satyAlApavicAramu jaragadu lOBikini |

hatyAvirahita karmamu aMTadu krUrAtmunakunu | pratyakShaMbagu pApamu pAyadu kaShTunaku ||

ca|| satatAnaMdavikAsamu saMdhiMcadu tAmasunaku | gatakalmaSha BAvamu dorakadu vyasanikini |

jitakAmuDu dAnavuTaku siddhiMpadu duShkarmiki | atulitagaMBIra guNaMbalavaDa dadhamunaku ||

ca|| SrIvEMkaTagiri vallaBusEvA tatparaBAvamu- | drOva mahAlaMpaTulaku tOpadu talapunaku |

dEvOttamuDagu nItani divyAmRutamagu nAmamu | sEviMpaga nitarulakunu cittaMboDabaDadu ||


IdigAka soubhAgyamidigAka - ఈదిగాక సౌభాగ్యమిదిగాక

ఈదిగాక సౌభాగ్యమిదిగాక (రాగం:ముఖ్హారి ) (తాళం : )

ఈదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి
ఇదిగాక వైభవం బిక నొకతిగలదా? ||

అతివ జన్మము సఫలమై పరమయొగి వలె
నితర మొహోపేక్ష లిన్ని యును విదిచె
సతి కోరికలు మహాశాంతమై ఇదెచూడ
సతత విగ్నాన వాసనవోలె నుండె ||

తరుణి హ్రుదయము క్రుతార్ఢత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయమంది ఇంతలో
సరిలేక మనసు నిశ్చల భావమాయ ||

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్వ
భావంబు నిజముగా బట్టె చెలియాత్మ
దేవోత్తముని క్రుపాధీనురాలై ఇపుడు
లావణ్యవతికి నుల్లంబు తిరమాయ ||

IdigAka soubhAgyamidigAka (Raagam:muKhAri ) (Taalam: )

IdigAka soubhAgyamidigAka tapamu maRi
idigAka vaibhavaM bika nokatigaladA? ||

ativa janmamu saphalamai paramayogi vale
nitara mohOpEkSha linni yunu vidiche
sati kOrikalu mahASAMtamai idechUDa
satata vignAna vAsanavOle nuMDe ||

taruNi hrudayamu krutArDhata boMdi vibhumIdi
paravaSAnaMda saMpadaku niravAya
sarasijAnana manO jayamaMdi iMtalO
sarilEka manasu niSchala bhAvamAya ||

SrI vEMkaTESvaruni jiMtiMchi paratatva
bhAvaMbu nijamugA baTTe cheliyAtma
dEvOttamuni krupAdhInurAlai ipuDu
lAvaNyavatiki nullaMbu tiramAya ||


Itani mahimalu eMtani - ఈతని మహిమలు ఎంతని

ఈతని మహిమలు(రాగం: ) (తాళం : )

ప|| ఈతని మహిమలు ఎంతని చెప్పెద | చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||

చ|| శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి | నానా విధకర నఖరుడు |

దానవ దైత్య విదారుడు విష్ణుడు | తానకమగు మా దైవంబితడు ||

చ|| అహోబలేశుడు ఆదిమపురుషుడు | బహు దేవతాసార్వ భౌముడు |

సహజానందుడు సర్వరక్షకుడు | ఇహపరము లొసగు యేలిక యితడు ||

చ|| కేవలుడగు సుగ్రీవనృసింహుడు | భావించ సుజన పాలకుడితడు |

శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు | వేవేలకు వేల్పు ఇతడు ||

Itani mahimalu (Raagam: ) (Taalam: )

pa|| Itani mahimalu eMtani ceppeda | cEtula mrokkeda celagucu nEnu ||

ca|| SrI narasiMhuDu cinmaya mUriti | nAnA vidhakara naKaruDu |

dAnava daitya vidAruDu viShNuDu | tAnakamagu mA daivaMbitaDu ||

ca|| ahObalESuDu AdimapuruShuDu | bahu dEvatAsArva BaumuDu |

sahajAnaMduDu sarvarakShakuDu | ihaparamu losagu yElika yitaDu ||

ca|| kEvaluDagu sugrIvanRusiMhuDu | BAviMca sujana pAlakuDitaDu |

SrIvEMkaTESuDu cittaja janakuDu | vEvElaku vElpu itaDu ||


Eetani golichitaenae yinni - ఈతని గొలిచితేనే యిన్ని

ఈతని గొలిచితేనే (రాగం:గౌళ ) (తాళం : )

ఈతని గొలిచితేనే యిన్ని గొలలును దీరు చేతనబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు

పట్టి కాళింగుని దోలి పాముకొల దీర్చినాడు బట్టబాయిటనే రేపల్లెవారికి అట్టె పూతన జంపి ఆడుగొల దీర్చినాడు గట్టిగా గృష్ణుడు లోకమువారికెల్లను

బలురావణు జంపి బాపనకొల దీర్చినాడు యిలమీద గలిగినఋషులకెల్లా కొలదిమీరినయట్టికోతికొల దీర్చినాడు సొలసి రాఘవుడదె సుగ్రీవునికిని

వొలిసి పురాలు చొచ్చి పూర గొల దీర్చినాడు అల తనదాసులైన అమరులకు సిలుగుగొలలు దీర్చి సేన వరా లిచ్చినాడు చెలగి పరుషలకు శ్రీవేంకటేశుడు


Eetani golichitaenae (Raagam: Gaula) (Taalam: )

Eetani golichitaenae yinni golalunu deeru Chaetanabettupunyaalu chaeruvanae kalugu

Patti kaalimguni doli paamukola deerchinaadu Battabaayitanae raepallevaariki Atte pootana jampi aadugola deerchinaadu Gattigaa grshnudu lokamuvaarikellanu

Baluraavanu jampi baapanakola deerchinaadu Yilameeda galiginarshulakellaa Koladimeerinayattikotikola deerchinaadu Solasi raaghavudade sugreevunikini

Volisi puraalu chochchi poora gola deerchinaadu Ala tanadaasulaina amarulaku Silugugolalu deerchi saena varaa lichchinaadu Chelagi parushalaku sreevaemkataesudu


ItaDE raghurAmuDItaDEkAMgavIruDu - ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు (రాగం: ) (తాళం : )

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు|యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు||

ఖరదూషణాదులను ఖండతుండముల సేసె|అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె|ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము||

కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల|తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె|యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన||


పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-|కొడుకుల( గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె|అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె||

ItaDE raghurAmuDItaDEkAMgavIruDu (Raagam: ) (Taalam: )

ItaDE raghurAmuDItaDEkAMgavIruDu|yItaDu chEsina chEta lenniyainA kalavu

kharadUshaNAdulanu khaMDatuMDamula sEse|arudugA vAli nokkayammuna nEse
saravi koMDalachEta samudramu baMdhiMche|iravai vibhIshaNunikichche laMkArAjyamu||

kUDapeTTe vAnarula, kuMbhakarNAdidaityula|tODanE rAvaNujaMpe duramu gelche
vEDukatO sItAdEvi kUDenu pushpakamekke|yIDu jODai siMhAsana mEle nayOdhyalOna

puDamiyaMtayu( gAche poMdugA tanaMtalEsi-|koDukula( gAMchenu kuSalavula
yeDayaka SrIvEMkaTESuDai varamulichche|aDari tArakabrahmamai ide velase

Sung By:Balakrishna Prasad

ItaDE mukti dOva - ఈతడే ముక్తి దోవ

ఈతడే ముక్తి దోవ (రాగం: ) (తాళం : )

ప|| ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు- | డితడు గలుగబట్టి యిందరు బదికిరి ||

చ|| అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు | యిది వీడె శ్రీవేంకటేశు నెదుట | వెద వెట్టి లోకములో వేదము లన్నియు మంచి | పదములు సేసి పాడీ పావనము సెసెను ||

చ|| అలరుచు దాళ్ళపాక అన్నమాచార్యులు | నిలచి శ్రీవేంకట నిధియే తానై | కలిదోషములు వాప ఘన పురాణము లెల్ల | పలుకుల నించి పాడినాడు హరిని ||

చ|| అంగవించె దాళ్ళపాక అన్నమాచార్యులు | బంగారు శ్రీ వేంకటేశు పాదములందు | రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు | మంగను యిద్దరిబాడి మమ్ము గరుణించెను ||

ItaDE mukti dOva (Raagam: ) (Taalam: )

pa|| ItaDE mukti dOva yItaDE mAyAcAryu- | DitaDu galugabaTTi yiMdaru badikiri ||

ca|| adivO tALLapAka annamAcAryulu | yidi vIDe SrIvEMkaTESu neduTa |

veda veTTi lOkamulO vEdamu lanniyu maMci | padamulu sEsi pADI pAvanamu sesenu ||

ca|| alarucu dALLapAka annamAcAryulu | nilaci SrIvEMkaTa nidhiyE tAnai |

kalidOShamulu vApa Gana purANamu lella | palukula niMci pADinADu harini ||

ca|| aMgaviMce dALLapAka annamAcAryulu | baMgAru SrI vEMkaTESu pAdamulaMdu |

raMgumIra SrIvEMkaTa ramaNuni yalamElu | maMganu yiddaribADi mammu garuNiMcenu ||


Itadakhilambunaku - ఈతడఖిలంబునకు

Itadakhilambunaku - ఈతడఖిలంబునకు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by VANI JAIRAM:

ఈతడఖిలంబునకు (రాగం: ) (తాళం : )

ప|| ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల- | భూతములలోన దా బొదలువాడితడు ||

చ|| గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద | చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు |

తాపసోత్తముల చింతాసౌధములలోన | దీపించు సుజ్ఞానదీప మితడు ||

చ|| జలధికన్యాపాంగ లలితేక్షణములతో | కలసి వెలుగుచున్న కజ్జలంబితడు |

జలజాసనుని వదనజలధి మధ్యమునందు | అలర వెలువడిన పరమామృతంబితడు ||

చ|| పరివోని సురతసంపదల నింపులచేత | వరవధూతతికి పరవశమైన యితడు |

తిరువేంకటాచలాధిపుడు దానె యుండి | పరిపాలనముసేయు భారకుండితడు ||

ItaDaKilaMbunaku (Raagam: ) (Taalam: )

pa|| ItaDaKilaMbunaku nISvaruDai sakala- | BUtamulalOna dA bodaluvADitaDu ||

ca|| gOpAMganalamerugu gubbacannulamIda | cUpaTTukamma gasturipUta yitaDu |

tApasOttamula ciMtAsaudhamulalOna | dIpiMcu suj~jAnadIpa mitaDu ||

ca|| jaladhikanyApAMga lalitEkShaNamulatO | kalasi velugucunna kajjalaMbitaDu |

jalajAsanuni vadanajaladhi madhyamunaMdu | alara veluvaDina paramAmRutaMbitaDu ||

ca|| parivOni suratasaMpadala niMpulacEta | varavadhUtatiki paravaSamaina yitaDu |

tiruvEMkaTAcalAdhipuDu dAne yuMDi | paripAlanamusEyu BArakuMDitaDu ||