eMdu nIku briyamO - ఎందు నీకు బ్రియమో

ఎందు నీకు (రాగం: ) (తాళం : )

ప|| ఎందు నీకు బ్రియమో యీతెప్పతిరునాళ్ళు | బిందువడె సిరులతో తెప్పతిరునాళ్ళు ||

చ|| పాలజలధిలో బవ్వళించి పాముతెప్ప | దేలుచున్న దది దెప్పతిరునాళ్ళు |
వోలి నేకోదకమై వొక్కమఱ్ఱియాకుమీద | తేలుచున్న దది తెప్పతిరునాళ్ళు ||

చ|| అమృతము దచ్చువాడు అంబుధిలో మందరము | తెమల దేలించుతెప్పతిరునాళ్ళు |
యమునలో కాళింగుసంగపుపడిగెమీద | తిమిరి తొక్కిన తెప్ప తిరునాళ్ళు ||

చ|| అప్పుడు పదారువేలు అంగనలచెమటల | తెప్పల దేలిన తెప్పతిరునాళ్ళు |
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతి గోనేటిలోన | తెప్పిరిల్లె నేటనేట తెప్పతిరునాళ్ళు ||

eMdu nIku (Raagam: ) (Taalam: )

pa|| eMdu nIku briyamO yIteppatirunALLu | biMduvaDe sirulatO teppatirunALLu ||

ca|| pAlajaladhilO bavvaLiMci pAmuteppa | dElucunna dadi deppatirunALLu |
vOli nEkOdakamai vokkamarxrxiyAkumIda | tElucunna dadi teppatirunALLu ||

ca|| amRutamu daccuvADu aMbudhilO maMdaramu | temala dEliMcuteppatirunALLu |
yamunalO kALiMgusaMgapupaDigemIda | timiri tokkina teppa tirunALLu ||

ca|| appuDu padAruvElu aMganalacemaTala | teppala dElina teppatirunALLu |
voppuga SrIvEMkaTAdri nunnati gOnETilOna | teppirille nETanETa teppatirunALLu ||


eMdu jUcina danaku - ఎందు జూచిన దనకు

ఎందు జూచిన (రాగం: ) (తాళం : )

ప|| ఎందు జూచిన దనకు నిన్నియును నిట్లనే | కందులేనిసుఖము కలనైన లేదు ||

చ|| సిరులుగలిగినఫలము చింత బొరలనె కాని | సొరిది సంతోష మించుకైన లేదు |
తరుణిగలఫలము వేదనల బొరలుటె కాని | నెరసులేనిసుఖము నిమిషంబు లేదు ||

చ|| తనువుగలఫలము పాతకముసేయనె కాని | అనువైనపుణ్యంబు అది యింత లేదు |
మనసుగలఫలము దుర్మతిబొందనే కాని | ఘనమనోజ్ఞానసంగతి గొంత లేదు ||

చ|| చదువుగలిగినఫలము సంశయంబే కాని | సదమలజ్ఞాననిశ్చయ మింత లేదు |
యిది యెరిగి తిరువేంకటేశ్వరుని గొలిచినను | బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు ||

eMdu jUcina (Raagam: ) (Taalam: )

pa|| eMdu jUcina danaku ninniyunu niTlanE | kaMdulEnisuKamu kalanaina lEdu ||

ca|| sirulugaliginaPalamu ciMta boralane kAni | soridi saMtOSha miMcukaina lEdu |
taruNigalaPalamu vEdanala boraluTe kAni | nerasulEnisuKamu nimiShaMbu lEdu ||

ca|| tanuvugalaPalamu pAtakamusEyane kAni | anuvainapuNyaMbu adi yiMta lEdu |
manasugalaPalamu durmatiboMdanE kAni | GanamanOj~jAnasaMgati goMta lEdu ||

ca|| caduvugaliginaPalamu saMSayaMbE kAni | sadamalaj~jAnaniScaya miMta lEdu |
yidi yerigi tiruvEMkaTESvaruni golicinanu | braduku galugunu Bavamu prANulaku lEdu ||


eMdAka nEcitta mEtalapO - ఎందాక నేచిత్త మేతలపో

ఎందాక నేచిత్త (రాగం: ) (తాళం : )

ప|| ఎందాక నేచిత్త మేతలపో | ముందుముందు వేసారితి ములిగి వేసరితి ||

చ|| ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును | నామాట వినదిదే నావిహారము |
యేమరినా దలపించీ నేమైనా గడించీ | సాముసేసి వేసారితీ జడిసి వేసారితి ||

చ|| యేడ చుట్టాలేడ పొందులెవ్వరూ | తోడైనవారు గారు దొంగలు గారు |
కూడుచీరగానిచోటై కొరగానిపాటై | వాడివాడి వేసారితి వదిలి వేసారితి ||

చ|| యెందున నున్నాడేమిసేసీ నెక్కడ భోగించీని | విందులకువిందయిన వేంకటేశుడు |
యిందరి హృదయములో నిరవై యున్నాడతడు | చెందినన్ను గాచుగాక చెనకి వేసారితి ||

eMdAka nEcitta (Raagam: ) (Taalam: )

pa|| eMdAka nEcitta mEtalapO | muMdumuMdu vEsAriti muligi vEsariti ||

ca|| EmisEtu nEDacottu nEmani bOdhiMtunu | nAmATa vinadidE nAvihAramu |
yEmarinA dalapiMcI nEmainA gaDiMcI | sAmusEsi vEsAritI jaDisi vEsAriti ||

ca|| yEDa cuTTAlEDa poMdulevvarU | tODainavAru gAru doMgalu gAru |
kUDucIragAnicOTai koragAnipATai | vADivADi vEsAriti vadili vEsAriti ||

ca|| yeMduna nunnADEmisEsI nekkaDa BOgiMcIni | viMdulakuviMdayina vEMkaTESuDu |
yiMdari hRudayamulO niravai yunnADataDu | ceMdinannu gAcugAka cenaki vEsAriti ||


Puttimchaevaadavu neevae - పుట్టించేవాడవు నీవే

పుట్టించేవాడవు నీవే (రాగం:ముఖారి ) (తాళం : )

పుట్టించేవాడవు నీవే పోరులు వెట్టేవు నీవే
యెట్టు నేరుచుకొంటి విది నీవినోదమా

కొందరు దేవతలును కొందరు రాక్షసులును
ఇందరి కంతర్యామి వెప్పుడు నీవు
అంది కోప మొకరిపై అట్టె ప్రసాద మొకరి __
కిందులోనే పక్షపాత మిది నీకే తగును

నరకమనుచు గొంత నగి స్వర్గమని కొంత
నిరతి గురిసేసేవు నీకుక్షిలోనే
ధర జీక టొకవంక తగ వెన్నె లొకవంక
నెరపేవు నీమాయ నీకే తెలుసును

దానిపరిపాలనము తగు దుష్టశిక్షణము
వాసిగైకొంటివి నీకు వశమై రెండు
దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీవేంకటేశ
సేసినవారిపుణ్యమే చిత్తాన బెట్టితివి

Puttimchaevaadavu (Raagam: Mukhaari) (Taalam: )

Puttimchaevaadavu neevae porulu vettaevu neevae
Yettu naeruchukomti vidi neevinodamaa

Komdaru daevatalunu komdaru raakshasulunu
Imdari kamtaryaami veppudu neevu
Amdi kopa mokaripai atte prasaada mokari __
Kimdulonae pakshapaata midi neekae tagunu

Narakamanuchu gomta nagi svargamani komta
Nirati gurisaesaevu neekukshilonae
Dhara jeeka tokavamka taga venne lokavamka
Nerapaevu neemaaya neekae telusunu

Daaniparipaalanamu tagu dushtasikshanamu
Vaasigaikomtivi neeku vasamai remdu
Dosamu neevalla laedu tolutae sreevaemkataesa
Saesinavaaripunyamae chittaana bettitivi


eMdaru satulO - ఎందరు సతులో

ఎందరు సతులో (రాగం: ) (తాళం : )

ప|| ఎందరు సతులో యెందరు సుతులో | యిందు నందు నెట్లెరిగే నేను ||

చ|| మలయుచు నాయభిమానములని నే- | కెలన నిపుడు వెదకే నంటే |
పలుయోనులలో పలుమారు బొడమిన | చలమరి నా తొలి జన్మంబులను ||

చ|| గరిమెల బాణి గ్రహణము సేసిన | సిరుల చెలుల గలనే నంటే |
తరుణుల గురుతుల తలపున మరచితి | పరగిన బహు కల్పంబుల యందు ||

చ|| శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల | భావించియె కరి చైకొంటి |
తావుల జూడగ తగిలిన కోర్కుల | భావరతుల బెంబడి మనసందు ||

eMdaru satulO (Raagam: ) (Taalam: )

pa|| eMdaru satulO yeMdaru sutulO | yiMdu naMdu neTlerigE nEnu ||

ca|| malayucu nAyaBimAnamulani nE- | kelana nipuDu vedakE naMTE |
paluyOnulalO palumAru boDamina | calamari nA toli janmaMbulanu ||

ca|| garimela bANi grahaNamu sEsina | sirula celula galanE naMTE |
taruNula gurutula talapuna maraciti | paragina bahu kalpaMbula yaMdu ||

ca|| SrI vEMkaTagiri celuvuni yAj~jala | BAviMciye kari caikoMTi |
tAvula jUDaga tagilina kOrkula | BAvaratula beMbaDi manasaMdu ||


eMdariveMTa neTla - ఎందరివెంట నెట్ల

ఎందరివెంట నెట్ల (రాగం: ) (తాళం : )

ప|| ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు | కందువెఱిగి చీకటిదవ్వుకొనుగాక ||

చ|| తలరాయిగాగ నెందరికి మొక్కెడిని | తెలివిమాలినయట్టిదేహి |
కొలదిమీరిన దేవకోట్లు దనలోన | కలవాని నొక్కనినే కొలుచుగాక ||

చ|| కాలీచపడగ నెక్కడికి నేగెడివి | పాలుమాలిన యట్టిప్రాణి |
మేలిమిజగములు మేనిలో గలవాడు | పాలిటివాడై ప్రణుతికెక్కుగాక ||

చ|| నూరేండ్ల నెందరి నుతియింపగలవాడు | చేరదావులేని జీవి |
శ్రీరమణుడు శ్రీవేంకటేశుని | కోరికె దలచి ముక్తి కొల్లగొనుటగాక ||

eMdariveMTa neTla (Raagam: ) (Taalam: )

pa|| eMdariveMTa neTla dirugavaccu | kaMduverxigi cIkaTidavvukonugAka ||

ca|| talarAyigAga neMdariki mokkeDini | telivimAlinayaTTidEhi |
koladimIrina dEvakOTlu danalOna | kalavAni nokkaninE kolucugAka ||

ca|| kAlIcapaDaga nekkaDiki nEgeDivi | pAlumAlina yaTTiprANi |
mElimijagamulu mEnilO galavADu | pAliTivADai praNutikekkugAka ||

ca|| nUrEMDla neMdari nutiyiMpagalavADu | cEradAvulEni jIvi |
SrIramaNuDu SrIvEMkaTESuni | kOrike dalaci mukti kollagonuTagAka ||


Emdarito benagaenu - ఎందరితో బెనగేను

ఎందరితో బెనగేను (రాగం: ) (తాళం : )

ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
కందర్ప జనక నీవే గతిగాక మాకు


నిక్కి నాబలవంతాన నేనే గెలిచేనంటే__
నొక్కపంచేంద్రియముల కోపగలనా
తక్కినసంసారవార్ది దాటగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయగలనో

పన్నుకొన్నపాయమున పరము సాధించేనంటే
యెన్న నీమాయ కుత్తర మియ్యగలనా
వన్నెలనామనసే పంచుకోగలనో మరి
కన్నట్టి యీప్రపంచమే కడవగగలనో

వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేజేసేనంటే
తొల్లిటియజ్ఞానము తోయగలనా
ఇల్లిదే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుడ నౌదుగాక పంద నే గాగలనా

Emdarito benagaenu (Raagam: ) (Taalam: )

Emdarito benagaenu yekkadani poralaenu
Kamdarpa janaka neevae gatigaaka maaku


Nikki naabalavamtaana naenae gelichaenamtae__
Nokkapamchaemdriyamula kopagalanaa
Takkinasamsaaravaardi daatagalano mari
Dikkula karmabamdhamu temchivaeyagalano

Pannukonnapaayamuna paramu saadhimchaenamtae
Yenna neemaaya kuttara miyyagalanaa
Vannelanaamanasae pamchukogalano mari
Kannatti yeeprapamchamae kadavagagalano

Vullamulo ninnu dhyaana mogi naejaesaenamtae
Tollitiyaj~naanamu toyagalanaa
Illidae sreevaemkataesa yedutanae neeku mokki
Balliduda naudugaaka pamda nae gaagalanaa