Endu niku priyamo - ఎందు నీకు ప్రియమో

Endu niku priyamo - ఎందు నీకు ప్రియమో | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by VANI JAIRAM:

ఎందు నీకు (రాగం: ) (తాళం : )

ప|| ఎందు నీకు బ్రియమో యీతెప్పతిరునాళ్ళు | 

బిందువడె సిరులతో తెప్పతిరునాళ్ళు ||

చ|| పాలజలధిలో బవ్వళించి పాముతెప్ప | 

దేలుచున్న దది దెప్పతిరునాళ్ళు |
వోలి నేకోదకమై వొక్కమఱ్ఱియాకుమీద | 

తేలుచున్న దది తెప్పతిరునాళ్ళు ||

చ|| అమృతము దచ్చువాడు అంబుధిలో మందరము | 

తెమల దేలించుతెప్పతిరునాళ్ళు |
యమునలో కాళింగుసంగపుపడిగెమీద | 

తిమిరి తొక్కిన తెప్ప తిరునాళ్ళు ||

చ|| అప్పుడు పదారువేలు అంగనలచెమటల | 

తెప్పల దేలిన తెప్పతిరునాళ్ళు |
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతి గోనేటిలోన | 

తెప్పిరిల్లె నేటనేట తెప్పతిరునాళ్ళు ||

eMdu nIku (Raagam: ) (Taalam: )

pa|| eMdu nIku briyamO yIteppatirunALLu | 

biMduvaDe sirulatO teppatirunALLu ||

ca|| pAlajaladhilO bavvaLiMci pAmuteppa | 

dElucunna dadi deppatirunALLu |
vOli nEkOdakamai vokkamarxrxiyAkumIda | 

tElucunna dadi teppatirunALLu ||

ca|| amRutamu daccuvADu aMbudhilO maMdaramu | 

temala dEliMcuteppatirunALLu |
yamunalO kALiMgusaMgapupaDigemIda | 

timiri tokkina teppa tirunALLu ||

ca|| appuDu padAruvElu aMganalacemaTala | 

teppala dElina teppatirunALLu |
voppuga SrIvEMkaTAdri nunnati gOnETilOna | 

teppirille nETanETa teppatirunALLu ||