eccOTikEgina yeppuDU - ఎచ్చోటికేగిన యెప్పుడూ

ఎచ్చోటికేగిన యెప్పుడూ (రాగం: ) (తాళం : )

ప|| ఎచ్చోటికేగిన యెప్పుడూ దమలోని- | మచ్చిక పెనుదెవులు మానకపోయె ||

చ|| పాయపు సతుల గుబ్బల పెదపొట్లాల | కాయము వడి నొత్తి కాచగాను |
రాయిడిచే ఘనమాయగాని లోని- | మాయపు పెనుదెవులు మానకపోయె ||

చ|| అతివల మోహపుటధరామృతములు | యితవుగ నోరి కందియ్యగను |
అతిమోహమే ఘనమాయగాని లోని- | మతకరి పెనుదెవులు మానకపోయె ||

చ|| తరుణుల మేనిమెత్తని పరపులమీద | నిరవుగ నిటు సుఖియించగను |
తిరువేంకటాచలాధీశు కృపచేగాని | మరుచేతి పెనుదెవులు మానకపోయ ||

eccOTikEgina yeppuDU (Raagam: ) (Taalam: )

pa|| eccOTikEgina yeppuDU damalOni- | maccika penudevulu mAnakapOye ||

ca|| pAyapu satula gubbala pedapoTlAla | kAyamu vaDi notti kAcagAnu |
rAyiDicE GanamAyagAni lOni- | mAyapu penudevulu mAnakapOye ||

ca|| ativala mOhapuTadharAmRutamulu | yitavuga nOri kaMdiyyaganu |
atimOhamE GanamAyagAni lOni- | matakari penudevulu mAnakapOye ||

ca|| taruNula mEnimettani parapulamIda | niravuga niTu suKiyiMcaganu |
tiruvEMkaTAcalAdhISu kRupacEgAni | marucEti penudevulu mAnakapOya ||


evvaru lErU - ఎవ్వరు లేరూ

ఎవ్వరు లేరూ (రాగం: ) (తాళం : )

ప|| ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ- | నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా ||

చ|| అడవి బడినవాడు వెడల జోటులేక | తొడరి కంపలకిందు దూరినట్లు |
నడుమ దురిత కాననములతరి బడి | వెడలలేక నేము విసిగేమయ్యా ||

చ|| తెవులువడినవాడు తినబోయి మధురము | చవిగాక పులుసులు చవిగోరినట్లు |
భవరోగముల బడి పరమామృతము నోర | జవిగాక భవములు చవులాయనయ్యా ||

చ|| తనవారి విడిచి యితరమైనవారి- | వెనక దిరిగి తావెర్రైనట్లు |
అనయము తిరువేంకటాధీశు గొల్వక | మనసులోనివాని మరచేమయ్యా ||

evvaru lErU (Raagam: ) (Taalam: )

pa|| evvaru lErU hitavuceppaga vaTTI- | novvula baDi nEmu nogilEmayyA ||

ca|| aDavi baDinavADu veDala jOTulEka | toDari kaMpalakiMdu dUrinaTlu |
naDuma durita kAnanamulatari baDi | veDalalEka nEmu visigEmayyA ||

ca|| tevuluvaDinavADu tinabOyi madhuramu | cavigAka pulusulu cavigOrinaTlu |
BavarOgamula baDi paramAmRutamu nOra | javigAka Bavamulu cavulAyanayyA ||

ca|| tanavAri viDici yitaramainavAri- | venaka dirigi tAverrainaTlu |
anayamu tiruvEMkaTAdhISu golvaka | manasulOnivAni maracEmayyA ||


evvarivADO yeRugarAdu - ఎవ్వరివాడో యెఱుగరాదు

ఎవ్వరివాడో యెఱుగరాదు (రాగం: ) (తాళం : )

ప|| ఎవ్వరివాడో యెఱుగరాదు | అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే ||

చ|| ధర జనించకతొలుత తను గానరాదు | మరణమందినవెనుక మఱి కానరాదు |
వురువడిదేహముతో నుందినయన్నాళ్ళే | మరలుజీవునిబదుకు మాయవో చూడ |

చ|| యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు | మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు |
తహతహల గర్మబంధముల దగిలినయపుడే | అహహ దేహికి బడుచులాటవో బదుకు ||

చ|| సంతానరూపమై సాగు ముందరికి | కొంత వెనకటిఫలము గుడువ దా దిరుగు |
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి | అంతి నితనిగన్నబదుకువో బదుకు ||

evvarivADO yeRugarAdu (Raagam: ) (Taalam: )

pa|| evvarivADO yeRugarAdu | avvalivvalijIvu DATalO patimE ||

ca|| dhara janiMcakatoluta tanu gAnarAdu | maraNamaMdinavenuka marxi kAnarAdu |
vuruvaDidEhamutO nuMdinayannALLE | maralujIvunibaduku mAyavO cUDa |

ca|| yihamulO BOgiMcu niMdu gonnALLu | mahima paralOkamuna malayu gonnALLu |
tahatahala garmabaMdhamula dagilinayapuDE | ahaha dEhiki baDuculATavO baduku ||

ca|| saMtAnarUpamai sAgu muMdariki | koMta venakaTiPalamu guDuva dA dirugu |
yiMtaTiki SrIvEMkaTESu DaMtaryAmi | aMti nitanigannabadukuvO baduku ||


evvarivADO I - ఎవ్వరివాడో ఈ

ఎవ్వరివాడో ఈ (రాగం: ) (తాళం : )

ప|| ఎవ్వరివాడో ఈ దేహి | యివ్వల నవ్వల నీ దేహి ||

చ|| కామించు నూరకే కలవియు లేనివి | యేమిగట్టుకొనె నీ దేహి |
వాములాయ నిరువదియొక వావులు | యేమని తెలిసెనో యీ దేహి ||

చ|| కందువ నిజములు గల్లలునడపి | యెందుకు నెక్కెనో యీ దేహి |
ముందర నున్నవి మొగిదనపాట్లు | యిందె భ్రమసీ నీ దేహి ||

చ|| పంచేంద్రియముల పాలాయ జన్మము | యించుక యెరుగడు యీదేహి |
అంచెల శ్రీ వేంకటాధీశ నీకృప | వంచగ గెలిచెను వడి నీ దేహి ||

evvarivADO I (Raagam: ) (Taalam: )

pa|| evvarivADO I dEhi | yivvala navvala nI dEhi ||

ca|| kAmiMcu nUrakE kalaviyu lEnivi | yEmigaTTukone nI dEhi |
vAmulAya niruvadiyoka vAvulu | yEmani telisenO yI dEhi ||

ca|| kaMduva nijamulu gallalunaDapi | yeMduku nekkenO yI dEhi |
muMdara nunnavi mogidanapATlu | yiMde BramasI nI dEhi ||

ca|| paMcEMdriyamula pAlAya janmamu | yiMcuka yerugaDu yIdEhi |
aMcela SrI vEMkaTAdhISa nIkRupa | vaMcaga gelicenu vaDi nI dEhi ||


Evvarevvarivado - ఎవ్వరెవ్వరివాడో

Evvarevvarivado - ఎవ్వరెవ్వరివాడో | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by PB Srinivas:

ఎవ్వరెవ్వరివాడో (రాగం: ) (తాళం : )

ప|| ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ | నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||

చ|| ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక- | కెందరికి దోబుట్ట డీజీవుడు |
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ- | మెందరికి గావింప డీజీవుడు ||

చ|| ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక- | కెక్కడో తనజన్మ మీజీవుడు |
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు- | డెక్కడికి నేగునో యీజీవుడు ||

చ|| ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక- | కెన్నిదనువులు మోవ డీజీవుడు |
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి | యెన్నిపదవుల బొంద డీజీవుడు ||

evvarevvarivADO (Raagam: ) (Taalam: )

pa|| evvarevvarivADO yIjIvuDu cUDa | nevvariki nEmaunO yIjIvuDu ||

ca|| eMdariki goDukugA DIjIvuDu venuka- | keMdariki dObuTTa DIjIvuDu |
yeMdarini BramayiMca DIjIvuDu duHKa- | meMdariki gAviMpa DIjIvuDu ||

ca|| ekkaDekkaDa diruga DIjIvuDu venuka- | kekkaDO tanajanma mIjIvuDu |
yekkaDi cuTTamu danaku nIjIvuDu yeppu- | DekkaDiki nEgunO yIjIvuDu ||

ca|| ennaDunu jETulEnIjIvuDu venuka- | kennidanuvulu mOva DIjIvuDu |
yennagala tiruvEMkaTESu mAyala dagili | yennipadavula boMda DIjIvuDu ||

evvaDOkAni yerugarAdu - ఎవ్వడోకాని యెరుగరాదు

ఎవ్వడోకాని యెరుగరాదు (రాగం: ) (తాళం : )

ప|| ఎవ్వడోకాని యెరుగరాదు కడు | దవ్వులనే వుండు తలపులో నుండు ||

చ|| యెదయవు తనరెక్క లెగసి పోలేడు | కడు దాగుగాని దొంగయు గాడు |
వడి గిందుపడును సేవకుడునుగాడు | వెడగుగోళ్ళు వెంచు విటుడును గాడు ||

చ|| మిగుల బొట్టివాడు మింటికిని బొడవు | జగడాలు తపసి వేషములును |
మగువకై పోరాడు మరి విరక్తుండును | తగు గాపుబనులు నెంతయు దెల్లదనము ||

చ|| తరుణుల వలపించు దగిలి పైకొనడు | తురగము దోలు రౌతునుగాడు |
తిరువేంకటాద్రిపై పరగు నెప్పుడును | పరమమూర్తియై పరగు నీఘనుడు ||

evvaDOkAni yerugarAdu (Raagam: ) (Taalam: )

pa|| evvaDOkAni yerugarAdu kaDu | davvulanE vuMDu talapulO nuMDu ||

ca|| yedayavu tanarekka legasi pOlEDu | kaDu dAgugAni doMgayu gADu |
vaDi giMdupaDunu sEvakuDunugADu | veDagugOLLu veMcu viTuDunu gADu ||

ca|| migula boTTivADu miMTikini boDavu | jagaDAlu tapasi vEShamulunu |
maguvakai pOrADu mari viraktuMDunu | tagu gApubanulu neMtayu delladanamu ||

ca|| taruNula valapiMcu dagili paikonaDu | turagamu dOlu rautunugADu |
tiruvEMkaTAdripai paragu neppuDunu | paramamUrtiyai paragu nIGanuDu ||


evvarikigaladamma - ఎవ్వరికిగలదమ్మ యింత

ఎవ్వరికిగలదమ్మ యింత (రాగం: ) (తాళం : )

ప|| ఎవ్వరికిగలదమ్మ యింత సౌభాగ్యము | యివ్వల నీతో సరి యెంచరాదే నొరుల ||

చ|| వీడిన తురముతోడ విరుల పైపై రాల | వాడిక కన్నులతోడ వచ్చేనేమి ||

చ|| వడియు జెమటతోడ వత్తివంటి మోవితోడా | నడపు మురిపెములతోడ నవ్వేవేమే ||

చ|| నిద్దుర కన్నులతోడ నిండుబులకలతోడ | ముద్దుగారే మోముతోడ మురిసేవేమే |

వొద్దనే శ్రీవేంకటేశుడొగిగూడు తెరుగమే | ముద్దురాల నేడు నీ మోహ మెంచరాదే ||

evvarikigaladamma (Raagam: ) (Taalam: )

pa|| evvarikigaladamma yiMta sauBAgyamu | yivvala nItO sari yeMcarAdE norula ||

ca|| vIDina turamutODa virula paipai rAla | vADika kannulatODa vaccEnEmi ||

ca|| vaDiyu jemaTatODa vattivaMTi mOvitODA | naDapu muripemulatODa navvEvEmE ||

ca|| niddura kannulatODa niMDubulakalatODa | muddugArE mOmutODa murisEvEmE |
voddanE SrIvEMkaTESuDogigUDu terugamE | muddurAla nEDu nI mOha meMcarAdE ||