nIvEmi sEtuvayya - నీవేమి సేతువయ్య

నీవేమి సేతువయ్య (రాగం: ) (తాళం : )

ప|| నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేనివారి పాపమింతే కాని ||

చ|| పరమపద మొసగి పాపమడచేనని | చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె |
నిరతిని భూమిలోన నీవల్ల దప్పులేదు | పరగ నమ్మనివారి పాపమింతే కాని ||

చ|| నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని | యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత |
దాపుగా నీవల్ల నింక దప్పులేదు యెంచిచూచి | పైపై నమ్మినవారి పాపమింతే కాని ||

చ|| బంతి బురాణములను భక్తసులభుడ నని | అంతరాత్మ నీమాట ఆడితివి తొలుతనే |
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు | పంతాన నమ్మినవారి పాపమింతే కాని ||

nIvEmi sEtuvayya (Raagam: ) (Taalam: )

pa|| nIvEmi sEtuvayya nIvu dayAnidhi vaMduvu | BAviMcalEnivAri pApamiMtE kAni ||

ca|| paramapada mosagi pApamaDacEnani | caramaSlOkamunaMdu cATitivi tolutane |
niratini BUmilOna nIvalla dappulEdu | paraga nammanivAri pApamiMtE kAni ||

ca|| nIpAdamulaku nAku neyyamaina laMkeni | yEpuna dvayArthamuna niyyakoMTivi toluta |
dApugA nIvalla niMka dappulEdu yeMcicUci | paipai namminavAri pApamiMtE kAni ||

ca|| baMti burANamulanu BaktasulaBuDa nani | aMtarAtma nImATa ADitivi tolutanE |
iMtaTa SrIvEMkaTESa yEmisEtuvayya nIvu | paMtAna namminavAri pApamiMtE kAni ||


nI vElikavu mAku - నీ వేలికవు మాకు

నీ వేలికవు మాకు (రాగం: ) (తాళం : )

ప|| నీ వేలికవు మాకు నీదాసులము నేము | ఆవల నితరుల నే మడుగబొయ్యేమా ||

చ|| పసురమై వుండి యిచ్చీ బక్కన గామధేనువు | యెసగి మానైవుండి యిచ్చీ గల్పవృక్షము |
వెస రాయైవుండి యిచ్చీ వేడుక చింతామణి | మసలనిశ్రీపతివి మాకు నిచ్చే టరుదా ||

చ|| గాలి యావటించి యిచ్చీ గారుమేఘము మింట | వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత |
కాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ | మైలలేనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా ||

చ|| అండనే కామధేనువ వాశ్రితచింతామణివి | పండినకల్పకమవు భక్తులకెల్లా |
నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి | దండిగా నమ్మితే నీవు దయజూచు టరుదా ||

nI vElikavu mAku (Raagam: ) (Taalam: )

pa|| nI vElikavu mAku nIdAsulamu nEmu | Avala nitarula nE maDugaboyyEmA ||

ca|| pasuramai vuMDi yiccI bakkana gAmadhEnuvu | yesagi mAnaivuMDi yiccI galpavRukShamu |
vesa rAyaivuMDi yiccI vEDuka ciMtAmaNi | masalaniSrIpativi mAku niccE TarudA ||

ca|| gAli yAvaTiMci yiccI gArumEGamu miMTa | vIli jIrNamai yiccI vikramArkuniboMta |
kAlinapeMcai vuMDi kappera divyAnnamiccI | mailalEniSrIpativi mAku niccE darudA ||

ca|| aMDanE kAmadhEnuva vASritaciMtAmaNivi | paMDinakalpakamavu BaktulakellA |
niMDina SrIvEMkaTESa nIvu mammu nElitivi | daMDigA nammitE nIvu dayajUcu TarudA ||


nIvEla siggupaDEvu - నీవేల సిగ్గుపడేవు

నీవేల సిగ్గుపడేవు (రాగం: ) (తాళం : )

ప|| నీవేల సిగ్గుపడేవు నెట్టన దలవంచుక | భావించి నిన్ను బైకొని మెచ్చీని ||

చ|| వాడలు దిరిగి నీవు వచ్చిన రాకచూచి | వేడుకలు వెదచల్లీ వెలది |
జాడలతో నీ మోము చంద్రకళలు చూచి | వీడెపు నోటనే వేమారు బొగడీని ||

చ|| విదుటు దమకమున వుండే నీవునికి చూచి | కదిసి నవ్వులు నవ్వీ గలికి |
పొదిగిన నీశిరసు పువ్వులదండలు చూచి | యెదుట నిలుచుండి చేయెత్తి మొక్కీని ||

చ|| గక్కున వస్తా వచ్చి కౌగిట గూడగా చూచి | చెక్కులు నొక్కి నిన్ను దెలియ |
నిక్కి శ్రీ వేంకటేశుడ నీ మన్ననలెల్లా జూచి | పక్కన నీమీదటి పదాలు వాడీని ||

nIvEla siggupaDEvu (Raagam: ) (Taalam: )

pa|| nIvEla siggupaDEvu neTTana dalavaMcuka | BAviMci ninnu baikoni meccIni ||

ca|| vADalu dirigi nIvu vaccina rAkacUci | vEDukalu vedacallI veladi |
jADalatO nI mOmu caMdrakaLalu cUci | vIDepu nOTanE vEmAru bogaDIni ||

ca|| viduTu damakamuna vuMDE nIvuniki cUci | kadisi navvulu navvI galiki |
podigina nISirasu puvvuladaMDalu cUci | yeduTa nilucuMDi cEyetti mokkIni ||

ca|| gakkuna vastA vacci kaugiTa gUDagA cUci | cekkulu nokki ninnu deliya |
nikki SrI vEMkaTESuDa nI mannanalellA jUci | pakkana nImIdaTi padAlu vADIni ||


nIvEkA ceppajUpa - నీవేకా చెప్పజూప

నీవేకా చెప్పజూప (రాగం: ) (తాళం : )

ప|| నీవేకా చెప్పజూప నీవె నీవెకా | శ్రీవిభుప్రతినిధివి సేనమొదలారి ||

చ|| నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద | దేవతల గనిపించే దేవుడవు |
యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ- | సేవకుడవు నీవెకా సేనమొదలారి ||

చ|| పసిడిబద్దలవారు పదిగోట్లు గొలువ | దెసల బంపులువంపే ధీరుడవు |
వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ- | సిసువులగా నేలిన సేనమొదలారి ||

చ|| దొరలైన యసురుల తుత్తుమురుసేసి జగ- | మిరువుగా నేలితివేకరాజ్యమై |
పరగుసూత్రవతీపతివై వేంకటవిభు- | సిరులపెన్నిధి నీవే సేసిమొదలారి ||

nIvEkA ceppajUpa (Raagam: ) (Taalam: )

pa|| nIvEkA ceppajUpa nIve nIvekA | SrIviBupratinidhivi sEnamodalAri ||

ca|| nIvEkA kaTTedura nilucuMDi harivadda | dEvatala ganipiMcE dEvuDavu |
yEvaMka viccEsinAnu yiMdirApatiki nija- | sEvakuDavu nIvekA sEnamodalAri ||

ca|| pasiDibaddalavAru padigOTlu goluva | desala baMpuluvaMpE dhIruDavu |
vasamugA mujjagAlavAri niMdarini nI- | sisuvulagA nElina sEnamodalAri ||

ca|| doralaina yasurula tuttumurusEsi jaga- | miruvugA nElitivEkarAjyamai |
paragusUtravatIpativai vEMkaTaviBu- | sirulapennidhi nIvE sEsimodalAri ||


nIvEkAni yiMka - నీవేకాని యింక

నీవేకాని యింక (రాగం: ) (తాళం : )

ప|| నీవేకాని యింక నేనన్య మెరుగనే | త్రోవజూసి నాకు తోడయ్యెద వయ్య ||

చ|| అపరాధ శత కోట్లయిన నీ వొక్క | నెపమున ననుగావ నేరవా |
అపరిమిత దురితా లైనవి యే- | వుపుమ చేత నన్ను ఉద్ధరించెద వయ్య ||

చ|| అతిశయముగ కర్మి నైతిని నీ- | మతము నాకొక యింత మఱపవా |
ఇతర కర్మారంభ హితుడనే నాకింక | గతి మోక్ష మెటువలె కల్పించెద వయ్య ||

చ|| తిరు వేంకటాచలాధీశ్వర నీదు | శరణాగతులను బ్రోవగరాదా |
పరమ దయానంద పరుడవు నీవు యే- | వెరవున భవములు వెడల ద్రోచెద వయ్య ||

nIvEkAni yiMka (Raagam: ) (Taalam: )

pa|| nIvEkAni yiMka nEnanya meruganE | trOvajUsi nAku tODayyeda vayya ||

ca|| aparAdha Sata kOTlayina nI vokka | nepamuna nanugAva nEravA |
aparimita duritA lainavi yE- | vupuma cEta nannu uddhariMceda vayya ||

ca|| atiSayamuga karmi naitini nI- | matamu nAkoka yiMta marxapavA |
itara karmAraMBa hituDanE nAkiMka | gati mOkSha meTuvale kalpiMceda vayya ||

ca|| tiru vEMkaTAcalAdhISvara nIdu | SaraNAgatulanu brOvagarAdA |
parama dayAnaMda paruDavu nIvu yE- | veravuna Bavamulu veDala drOceda vayya ||

Get this widget | Track details | eSnips Social DNA

nIVudEvuDavu - నీవుదేవుడవు

నీవుదేవుడవు (రాగం: ) (తాళం : )

నీవుదేవుడవు | నేనొకజీవుడ
ఈవిధి నిద్దరి | కెంత అంతరువు ||

పొడమిన జగములు | పుట్టెడి జగములు
గుడిగొనె మీరోమ | కూపములు
యెడయక నీరూప | మేమని ధ్యానింతు
అడరి మీవాడ | ననుటే గాక ||

మునుపతి బ్రహ్మలు | ముందరి బ్రహ్మలు
మొనసి మీ నాభిని | మొలచేరు
ఘనుడవు నిన్నే | గతి నే దెలిసెద
అనువుగ మిముశర | ణనుటే గాక ||

సహజానందము | సంసారానందము
ఇహము పరముగా | నిచ్చేవు
అహిపతి శ్రీవేంక | టాధిప నీ కృప
మహిలో సేవించి | మనుటే గాక ||

nIVudEvuDavu (Raagam: ) (Taalam: )

nIVudEvuDavu | nEnokajIvuDa
Ividhi niddari | keMta aMtaruvu ||

poDamina jagamulu | puTTeDi jagamulu
guDigone mIrOma | kUpamulu
yeDayaka nIrUpa | mEmani dhyAniMtu
aDari mIvADa | nanuTE gAka ||

munupati brahmalu | muMdari brahmalu
monasi mI nAbhini | molachEru
ghanuDavu ninnE | gati nE deliseda
anuvuga mimuSara | NanuTE gAka ||

sahajAnaMdamu | saMsArAnaMdamu
ihamu paramugA | nichchEvu
ahipati SrIvEMka | TAdhipa nI kRpa
mahilO sEviMchi | manuTE gAka ||

Get this widget | Track details | eSnips Social DNA

nIvE mUlamuvO - నీవే మూలమువో

నీవే మూలమువో (రాగం: ) (తాళం : )

ప|| నీవే మూలమువో నేరిచినపెద్దలకు | దేవుడు నీయందులోనే తిరమాయ నిదివో ||

చ|| బాపురే వో దేహమా బాపురే వో నీవు | వోపి నే బెట్టినకొద్ది నుందువుగా |
రూపు నీవు గలిగితే రుచులెల్ల గానగద్దు | చాపలాన ధర్మములు సాధింపగలదు ||

చ|| మెచ్చితి నోమనసా మెచ్చితివో నీవూ నా- | యిచ్చకొలది నెందైనా నేగుదువుగా |
అచ్చపునీకతమున నవుగాము లెంచగవద్దు | పచ్చిగా యేమూర్తినైనా భావించగలదు ||

చ|| మేలు మేలు నాలికె మేలు మేలు నీవు | వోలి యేమాటకునైనా నొనరుదుగా |
చాలి నీవు మెలగంగ చదువు చదువగద్దు | పోలించి శ్రీవేంకటేశు బొగడగగలదు ||

nIvE mUlamuvO (Raagam: ) (Taalam: )

pa|| nIvE mUlamuvO nEricinapeddalaku | dEvuDu nIyaMdulOnE tiramAya nidivO ||

ca|| bApurE vO dEhamA bApurE vO nIvu | vOpi nE beTTinakoddi nuMduvugA |
rUpu nIvu galigitE ruculella gAnagaddu | cApalAna dharmamulu sAdhiMpagaladu ||

ca|| mecciti nOmanasA meccitivO nIvU nA- | yiccakoladi neMdainA nEguduvugA |
accapunIkatamuna navugAmu leMcagavaddu | paccigA yEmUrtinainA BAviMcagaladu ||

ca|| mElu mElu nAlike mElu mElu nIvu | vOli yEmATakunainA nonarudugA |
cAli nIvu melagaMga caduvu caduvagaddu | pOliMci SrIvEMkaTESu bogaDagagaladu ||