valacuTE dOsamA - వలచుటే దోసమా

వలచుటే దోసమా (రాగం: ) (తాళం : )

ప|| వలచుటే దోసమా వనిత నీకాతడు | నలువంక మరియేటి నవ్వులు నవ్వవే ||

చ|| పంతమెల్ల నీమాటపట్టు లోననే వున్నది | చింతలెల్ల నీచెక్కు చేతనున్నవి |
వింతలన్నియును నీ నివ్వెరుగులతో నున్నవి | యెంతకెంత పతినింకా యేటికి దూరేవే ||

చ|| బిగువెల్ల నిపుడు నీపెదవులపై నున్నది | తెగువలు నీకన్నుల తేటనున్నవి |
ఆగడింతా నీ పొలయలుకలలో నున్నది | యెగసక్కేలాతని నేటికి నాడేవే ||

చ|| గబ్బితనమెల్లాను నీ కౌగిటిలోనే వున్నది | నిబ్బరము నీవుండేటి నీటులో నున్నది |
అబ్బరమై శ్రీ వేంకటాధీశుడు నిన్నుగూడె | వుబ్బున నీతనికెంత వొరటలు చూపవే ||

valacuTE dOsamA (Raagam: ) (Taalam: )

pa|| valacuTE dOsamA vanita nIkAtaDu | naluvaMka mariyETi navvulu navvavE ||

ca|| paMtamella nImATapaTTu lOnanE vunnadi | ciMtalella nIcekku cEtanunnavi |
viMtalanniyunu nI nivverugulatO nunnavi | yeMtakeMta patiniMkA yETiki dUrEvE ||

ca|| biguvella nipuDu nIpedavulapai nunnadi | teguvalu nIkannula tETanunnavi |
AgaDiMtA nI polayalukalalO nunnadi | yegasakkElAtani nETiki nADEvE ||

ca|| gabbitanamellAnu nI kaugiTilOnE vunnadi | nibbaramu nIvuMDETi nITulO nunnadi |
abbaramai SrI vEMkaTAdhISuDu ninnugUDe | vubbuna nItanikeMta voraTalu cUpavE ||


valacina pativADE - వలచిన పతివాడే

వలచిన పతివాడే (రాగం: ) (తాళం : )

ప|| వలచిన పతివాడే వచ్చినదాన నేనిదె | తలపులు దలపులు తారుకాణలెన్నడే ||

చ|| పుచ్చబుచ్చ పున్నములు పొలతి నీ నవ్వులు | యిచ్చట నీపతి జూచేదిక నెన్నడే |
నిచ్చనిచ్చ గొత్తలాయ నెలత నీ జవ్వనము | మెచ్చిమెచ్చి ఆతనితో మేలమాడుటెన్నడే ||

చ|| వండవండ నట్లాయ వాడిక నీవలపు- | నిండినపతి కౌగిట నించుటెన్నడే |
వుండనుండ నొగరాయపువిద నీ జంకెనలు | అండ నాతనికి వినయాలు సేయుటెన్నడే ||

చ|| తినదిన దీపులాయ తెరవ నీమోవి జున్ను | పొనిగి శ్రీ వేంకటేశు పొందులెన్నడే |
ననిచియీతడే నేడు నయముల నిన్నుగూడె | మనికి మీ లోలోన మందలించుటెన్నడే ||

valacina pativADE (Raagam: ) (Taalam: )

pa|| valacina pativADE vaccinadAna nEnide | talapulu dalapulu tArukANalennaDE ||

ca|| puccabucca punnamulu polati nI navvulu | yiccaTa nIpati jUcEdika nennaDE |
niccanicca gottalAya nelata nI javvanamu | meccimecci AtanitO mElamADuTennaDE ||

ca|| vaMDavaMDa naTlAya vADika nIvalapu- | niMDinapati kaugiTa niMcuTennaDE |
vuMDanuMDa nogarAyapuvida nI jaMkenalu | aMDa nAtaniki vinayAlu sEyuTennaDE ||

ca|| tinadina dIpulAya terava nImOvi junnu | ponigi SrI vEMkaTESu poMdulennaDE |
naniciyItaDE nEDu nayamula ninnugUDe | maniki mI lOlOna maMdaliMcuTennaDE ||

Get this widget | Track details | eSnips Social DNA

Valachi paikonagaraadu - వలచి పైకొనగరాదు

Valachi paikonagaraadu - వలచి పైకొనగరాదు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

పరిచయం (Introduction)
అన్నమయ్య శృంగార సంకీర్తనలలో 'వలచి పైకొనఁగరాదు' అత్యంత అద్భుతమైనది. ఇది సామంత రాగంలో కూర్చబడింది. ఈ పాటలో అన్నమాచార్యులు మానవ సహజమైన మోహాన్ని, భగవంతుని పట్ల ఉండే అనురాగాన్ని ఎంతో చాతుర్యంతో వర్ణించారు. లోకంలోని విరుద్ధమైన భావాలను (ఉదాహరణకు: ఎండలో నీడ, నిప్పుపై నూనె) ఉదాహరణలుగా తీసుకుంటూ, శ్రీవేంకటేశ్వరుని కరుణ వల్ల కలిగే పరమానందాన్ని ఈ కీర్తనలో వివరించారు. లౌకిక సుఖాల కంటే భగవంతుని శరణాగతిలో ఉండే వింతైన సుఖాన్ని ఈ సంకీర్తన మనకు పరిచయం చేస్తుంది.
వలచి పైకొనగరాదు (రాగం:సామంత ) (తాళం : )
॥పల్లవి॥వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
కలికిమరుఁడు సేసినాజ్ఞ కడవఁగరాదురా

॥చ1॥అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు
ముంగిటి పసిఁడికుంభములును ముద్దులకుచయుగంబులు
యెంగిలిసేసినట్టితేనె లితవులైన మెఱుఁగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు

॥చ2॥కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలోనీడలు యెడనెడకూటములు
తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేఁతనవ్వులు
మంచితనములోని నొప్పులు మాటలలోనిమాటలు

॥చ3॥నిప్పులమీఁద జల్లిననూనెలు నిగిడితనివిలేనియాసలు
దప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమి
చెప్పఁగరానిమేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పనికరుణగలిగి మనుట అబ్బురమైనసుఖములు
Valachi paikonagaraadu (Raagam:Samanta ) (Taalam: )

|| Pallavi || Valachi paikonaga-raadu valadani tholaga-raadu Kaliki-marudu sesina-agna kadavaga-raaduraa

|| Charanam 1 || Angadi kettinatti-divve langana-mukhaambujamulu Mungiti pasidi-kumbhamulunu muddula-kucha-yugambulu Yengili-sesinatti-thenelu ithavulaina merugu-movulu Lingamu-leni deharamulu lekka-leni priyamulu

|| Charanam 2 || Kanchamu-loni vedi-kooralu garuvambulu polayalukalu Yenchaga yendalo-needalu yedaneda-kootamulu Tenchaga-raani vale-thaallu telivi-padani-letha-navvulu Manchitanamu-loni noppulu maatalaloni-maatalu

|| Charanam 3 || Nippula-meeda jallina-noonelu nigidi-thanivi-leni-aasalu Dappiki neyi-daaginatlu thamakamu-loni-thaalimi Cheppaga-raani-melu ganuta Shri Venkatapathi ganutalu Appani-karuna-galigi manuta abbura-maina-sukhamulu


English Meaning & Explanation
Pallavi (Refrain)
  • Valachi paikona-garaadu valadani tholaga-raadu / Kaliki-marudu sesina-gna kadava-garaaduraa
  • Meaning: One cannot forcefully embrace love, nor can one simply push it away when it arrives. The commands of Cupid (Lord of Love) are so powerful that they cannot be disobeyed or crossed.
Charanam 1
  • Meaning: Annamayya compares beauty to various metaphors: The lady's face is like a lamp lit in a market, her breasts are like golden pots in the front yard. Their kisses are like honey shared, and their bodies are like temples without a deity, filled with countless moments of affection.
Charanam 2
  • Meaning: He describes the paradoxes of romance—it is like hot food in a plate that gives comfort despite the heat. It is like finding shade in the middle of a hot sun, or small lovers' quarrels that only increase desire. These bonds of love are like unbreakable ropes, accompanied by innocent smiles and hidden meanings in their conversations.
Charanam 3
  • Meaning: This deep desire is compared to oil sprinkled on fire (it only intensifies). It’s like drinking ghee to quench thirst (an insatiable longing). Finally, Annamayya concludes that the greatest, most indescribable joy is finding Lord Sri Venkateswara and living under his mercy, which is the ultimate, wondrous happiness.

Frequently Asked Questions (FAQ)
  • ఈ సంకీర్తన ఏ రాగంలో పాడతారు? (What is the Raga?)
    ఈ సంకీర్తనకు అన్నమయ్య సూచించిన మూల రాగం సామంతం.
  • ఈ పాటలోని ప్రధాన సందేశం ఏమిటి? (Main Theme)
    ఇది శృంగార ఆధ్యాత్మిక సంకీర్తన. లౌకిక ప్రేమలోని తపనను వివరిస్తూనే, చివరగా శ్రీవేంకటేశ్వరుని కరుణ వల్ల కలిగే 'అబ్బురమైన సుఖం' (అద్భుతమైన ఆనందం) గురించి అన్నమయ్య చెబుతారు.
  • అన్నమయ్య ఇక్కడ ఉపయోగించిన కొన్ని అలంకారాలు ఏమిటి?
    'ఎండలోని నీడ', 'నిప్పుల మీద నూనె', 'దప్పికి నేయి తాగడం' వంటి అద్భుతమైన తెలుగు సామెతలను, విరుద్ధాభాస అలంకారాలను అన్నమయ్య ఇక్కడ ఉపయోగించారు.

Valadananorulaku - వలదననొరులకు

వలదననొరులకు (రాగం: ) (తాళం : )

వలదననొరులకు వశమటవే
తలచినట్లనిది దైవమెచేసె

తరుణికుచములను తామరమొగుడలు
విరిసేనోయని వెరపునను
సరగునపతినఖ చంద్రశకలములు
దరులుగలుగనిది దైవమెచేసె

పొలతివదనమను పున్నమచంద్రుడు
బలిమినెగయునని భయమునను
మెలుతచికురధ మ్మిల్లపురాహువు
తలచెదరగనిది దైవమెచేసె

వనితకువాడునొ వలపుతాపమున
తనులతికయనుచు తమకమున
ఘనవేంకటపతి కౌగిటచమటల
తనివి దీర్చనిది దైవమె చేసె

Valadananorulaku (Raagam: ) (Taalam: )

Valadananorulaku vasamatavae
Talachinatlanidi daivamechaese

Tarunikuchamulanu taamaramogudalu
Virisaenoyani verapunanu
Saragunapatinakha chamdrasakalamulu
Darulugaluganidi daivamechaese

Polativadanamanu punnamachamdrudu
Baliminegayunani bhayamunanu
Melutachikuradha mmillapuraahuvu
Talachedaraganidi daivamechaese

Vanitakuvaaduno valaputaapamuna
Tanulatikayanuchu tamakamuna
Ghanavaemkatapati kaugitachamatala
Tanivi deerchanidi daivame chaese


vaTTiyAsalaku lOnai - వట్టియాసలకు లోనై

వట్టియాసలకు (రాగం: ) (తాళం : )

ప|| వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు |

బట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ ||

చ|| చాలనమ్మి యీసంసారమునకు సోలిసోలి తిరిగేవు |

బాలయవ్వన ప్రౌఢలభ్రమ బడి లోలుడవై తిరిగేవు |
మేలుదెలియ కతికాముకుండవై మీదెరుగక తిరిగేవు |

మాలెమీద పరువెందాకా నీమచ్చిక విడువగలేవు ||

చ|| మానితముగ దురన్నపానముల మత్తుడవై వుండేవు |

నానావిధముల దుష్కర్మంబులు నానాటికి నాటించేవు |
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు |

ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియగలేవు ||

చ|| పామరివై దుర్వ్యాపారమునకు పలుమారును బొయ్యేవు |

వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు |
ప్రేమతో హరిదాసులపై సంప్రీతి నిలుపగాలేవు |

తామసమతివయి వేంకటనాథునితత్త్వ మెరుగగాలేవు ||

vaTTiyAsalaku lOnai (Raagam: ) (Taalam: )

pa|| vaTTiyAsalaku lOnai vadalaka tirigADEvu |

baTTabayalu yIsaMsAraMbani guTTudeliyalEvu prANI ||

ca|| cAlanammi yIsaMsAramunaku sOlisOli tirigEvu |

bAlayavvana prauDhalaBrama baDi lOluDavai tirigEvu |
mEludeliya katikAmukuMDavai mIderugaka tirigEvu |

mAlemIda paruveMdAkA nImaccika viDuvagalEvu ||

ca|| mAnitamuga durannapAnamula mattuDavai vuMDEvu |

nAnAvidhamula duShkarmaMbulu nAnATiki nATiMcEvu |
mEnilOni yEguru nArgurunu mitrulanucu nammEvu |

AnaMdaMbuna nAkarmamunaku adhipatulani teliyagalEvu ||

ca|| pAmarivai durvyApAramunaku palumArunu boyyEvu |

vEmaru durjanasaMgAtaMbulu viSrAmamanucu nuMDEvu |

prEmatO haridAsulapai saMprIti nilupagAlEvu |

tAmasamativayi vEMkaTanAthunitattva merugagAlEvu ||


Vattimopu moyanaela - వట్టిమోపు మోయనేల

వట్టిమోపు మోయనేల (రాగం:బౌళి ) (తాళం : )

వట్టిమోపు మోయనేల వడి ములుగగనేల
వట్టిన నేమముతోడ బ్రదుక గవలదా.

తల్లిదండ్రిగలవారు తమలేము లెఱగక
చెల్లపిళ్లలై యాటల జెందినయట్టు
వుల్లములో హరినమ్మివుండినప్రపన్నులెల్ల
పల్లదాన నిర్భరులై బ్రతుకగవలదా.

మగడుగలసతులు మంచి ముత్తైదువలై
యెగువ నితరమార్గా లెరగనట్టు
నగుతా లక్ష్మీపతి నమ్మినప్రపన్నులెల్ల
పగటు గర్మము మాని బ్రదుకగవలదా.

యేలికె నమ్మినబంటేరికి బ్రియము చెప్ప
కోలి బతివాకిలి గాచుండినయట్టు
తాలిమి శ్రీవేంకటేశుదాసులైనప్రపన్నులు
పాలించినాతని నమ్మి బ్రతుకగవలదా.

Vattimopu moyanaela (Raagam: ) (Taalam: )

Vattimopu moyanaela vadi mulugaganaela
Vattina naemamutoda braduka gavaladaa.


Tallidamdrigalavaaru tamalaemu le~ragaka
Chellapillalai yaatala jemdinayattu
Vullamulo harinammivumdinaprapannulella
Palladaana nirbharulai bratukagavaladaa.

Magadugalasatulu mamchi muttaiduvalai
Yeguva nitaramaargaa leraganattu
Nagutaa lakshmeepati namminaprapannulella
Pagatu garmamu maani bradukagavaladaa.

Yaelike namminabamtaeriki briyamu cheppa
Koli bativaakili gaachumdinayattu
Taalimi sreevaemkataesudaasulainaprapannulu
Paalimchinaatani nammi bratukagavaladaa.


Valadana norulaku - వలదన నొరులకు

వలదన నొరులకు (రాగం:సామంతం ) (తాళం : )

వలదన నొరులకు వసమటవే
తలచినట్లు నిది దైవమె చేసె

తరుణి కుచములను తామర మొగుడలు
విరిసేనో యని వెరపునను
సరగున బతి నఖ చంద్రశకలములు
దరుల గలుగ నివి దైవమె చేసె

పొలతి వదనమను పున్నమ చంద్రుడు
బలిమి నెగయునని భయమునను
మెలుత చికుర ధమ్మిల్లపు రాహువు
తల జెదరగ నిది దైవమె సేసె

వనితకు వాడునొ వలపు తాపమున
తనులతిక యనుచు దమకమున
ఘన వేంకటపతి కౌగిట చెమటల
దనివి దీర్చనిది దవమె సేసె

Valadana norulaku (Raagam:saamamtam ) (Taalam: )

Valadana norulaku vasamatavae
Talachinatlu nidi daivame chaese

Taruni kuchamulanu taamara mogudalu
Virisaeno yani verapunanu
Saraguna bati nakha chamdrasakalamulu
Darula galuga nivi daivame chaese

Polati vadanamanu punnama chamdrudu
Balimi negayunani bhayamunanu
Meluta chikura dhammillapu raahuvu
Tala jedaraga nidi daivame saese

Vanitaku vaaduno valapu taapamuna
Tanulatika yanuchu damakamuna
Ghana vaemkatapati kaugita chematala
Danivi deerchanidi davame saese