vAsivaMtu viDicinavADE - వాసివంతు విడిచినవాడే

వాసివంతు విడిచినవాడే (రాగం: ) (తాళం : )

ప|| వాసివంతు విడిచినవాడే యోగి యీ- | ఆసలెల్లా విడిచిన ఆతడే యోగి ||

చ|| గద్దించి పారెడు తురగమువంటి మనసు | వద్దని మరలించినవాడే యోగి |
వొద్దనే కొండలవంటివున్న దేహగుణాలు | దిద్ది మట్టుపెట్టువాడే ధీరుడైన యోగి ||

చ|| ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన | వంచన మునుగునట్టివాడే యోగి |
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు | దంచి పారజల్లువాడే తత్త్వమెరిగిన యోగి ||

చ|| వెగటుకామాదుల వెళ్ళగొట్టి శాంతుడై | వగలుడిగినయట్టివాడే యోగి |
నిగిడి శ్రీవేంకటపతి నిజదాసుడై భక్తి | దగిలి నిలుపువాడే ధన్యుడైన యోగి ||

vAsivaMtu viDicinavADE (Raagam: ) (Taalam: )

pa|| vAsivaMtu viDicinavADE yOgi yI- | AsalellA viDicina AtaDE yOgi ||

ca|| gaddiMci pAreDu turagamuvaMTi manasu | vaddani maraliMcinavADE yOgi |
voddanE koMDalavaMTivunna dEhaguNAlu | diddi maTTupeTTuvADE dhIruDaina yOgi ||

ca|| muMcukonna yiMdriyapu mOhajaladhilOna | vaMcana munugunaTTivADE yOgi |
poMci puNyapApamulu poTTuvaMTi karmamulu | daMci pArajalluvADE tattvamerigina yOgi ||

ca|| vegaTukAmAdula veLLagoTTi SAMtuDai | vagaluDiginayaTTivADE yOgi |
nigiDi SrIvEMkaTapati nijadAsuDai Bakti | dagili nilupuvADE dhanyuDaina yOgi ||


vADe vEMkaTESuDanEvADe - వాడె వేంకటేశుడనేవాడె

వాడె వేంకటేశుడనేవాడె (రాగం: ) (తాళం : )

ప|| వాడె వేంకటేశుడనేవాడె వీడు | వాడిచుట్టుగైదువవలచేతివాడు ||

చ|| కారిమారసుతుని చక్కనిమాటలకు జొక్కి | చీరగా వేదాలగుట్టు చూపినవాడు |
తీరని వేడుకతో తిరుమంగయాళువారి- | ఆరడిముచ్చిమికూటి కాసపడ్డవాడు ||

చ|| పెరియాళువారిబిడ్డ పిసికి పైవేసిన | విరులదండల మెడవేసినవాడు |
తరుణి చేయివేసిన దగ్గరి బుజముచాచి | పరవశమై చొక్కి పాయలేనివాడు ||

చ|| పామరుల దనమీది పాటలెల్లా బాడుమంటా | భూమికెల్లా నోర నూరిపోసినవాడు |
మామకూతురల మేలుమంగనాచారియు దాను | గీముగానే వేంకటగిరి నుండేవాడు ||

vADe vEMkaTESuDanEvADe (Raagam: ) (Taalam: )

pa|| vADe vEMkaTESuDanEvADe vIDu | vADicuTTugaiduvavalacEtivADu ||

ca|| kArimArasutuni cakkanimATalaku jokki | cIragA vEdAlaguTTu cUpinavADu |
tIrani vEDukatO tirumaMgayALuvAri- | AraDimuccimikUTi kAsapaDDavADu ||

ca|| periyALuvAribiDDa pisiki paivEsina | viruladaMDala meDavEsinavADu |
taruNi cEyivEsina daggari bujamucAci | paravaSamai cokki pAyalEnivADu ||

ca|| pAmarula danamIdi pATalellA bADumaMTA | BUmikellA nOra nUripOsinavADu |
mAmakUturala mElumaMganAcAriyu dAnu | gImugAnE vEMkaTagiri nuMDEvADu ||


vADE vADE allarivA - వాడే వాడే అల్లరివా

వాడే వాడే అల్లరివా (రాగం: ) (తాళం : )

వాడే వాడే అల్లరివా డదివో
నాడు నాడు యమునా నదిలో ||

కాంతలు వలయపు కంకణ రవముల
సంతంత గోలాట మాడ గను
చెంతల నడమను శ్రీరమణుడమరె
సంతతపుజుక్కలలో చంద్రునివలెను ||

మగువలు ముఖ పద్మములు దిరిగిరా
నగపడి కోలాట మాడ గను
నిగిఢీ నడుమ నదె నీల వర్ణుడు
పగటుతో గమల బంధుని వలెను ||

vADE vADE allarivA (Raagam: ) (Taalam: )

vADE vADE allarivA DadivO
nADu nADu yamunA nadilO ||

kAMtalu valayapu kaMkaNa ravamula
saMtaMta gOlATa mADa ganu
cheMtala naDamanu SrIramaNuDamare
saMtatapujukkalalO chaMdrunivalenu ||

maguvalu mukha padmamulu dirigirA
nagapaDi kOlATa mADa ganu
nigiDhI naDuma nade nIla varNuDu
pagaTutO gamala baMdhuni valenu ||


vaaDala vaaDala - వాడల వాడల

వాడల వాడల (రాగం:శ్రీరాగం ) (తాళం : )

వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ

కలికి నవ్వులె నీకు కప్పుర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మట్లాడినదె కుంకుమ వసంతము
చలమున చల్లె నీ పై జాజర జాజర జాజ


కామిని జంకెన నీకు కస్తూరి వసంతము
వాముల మోహపునీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజ గురుడ నీపై జాజర జాజర జాజ

అంగన అధరమిచ్చె అమృత వసంతము
సంగడి శ్రీ వేంకటేశ సతి గూడితి
ముంగిటి రతి చెమట ముత్తేల వసంతము
సంగతాయెనిద్దరికి జాజర జాజర జాజ

vaaDala vaaDala (Raagam: SrIraagam) (Taalam: )

vaaDala vaaDala venTa vasantamu
jaaDatO challEru neepai jaajara jaajara jaaja

kaliki navvule neeku kappura vasantamu
valachUpu kaluvala vasantamu
kuliki maTlaaDinade kumkuma vasantamu
chalamuna challe nee pai jaajara jaajara jaaja


kaamini jamkena neeku kastUri vasamtamu
vaamula mOhapuneeTi vasantamu
bUmela sarasamula puppoDi vasantamu
saamaja guruDa neepai jaajara jaajara jaaja

angana adharamichche amRta vasantamu
samgaDi SrI vEmkaTESa sati gUDiti
mungiTi rati chemaTa muttEla vasntamu
samgataayeniddariki jaajara jaajara jaaja

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

Vaadivo veedivo - వాడివో వీడివో

వాడివో వీడివో (రాగం:పాడి ) (తాళం : )

వాడివో వీడివో హరి వలసిన వారికెల్లా
మూడులోకముల మరి మొరగ జోటేడి

బహిరంతరాన హరి ప్రత్యxఅమై యుండగాను
సహజాన బ్రత్యxఅవిచారమేల
ఇహములో గలవెల్లా యీతనిలీలై యుండగా
విహరించేలీల వేరే వెదకనేలా.

మనికై యన్నిటా నుండి మాటలాదుచుండగాను
వెనక హరి మాటలు వేరే వున్ననా
కనుచూ పతడంతటా కలగొన జూడగాను
చనవిచ్చి కృపాదృష్టి చల్లుమననేలా.

నెలవై యాత డిన్నిటా నిండుకొనియుండగాను
అలరి వేరే వచ్చీనననేలా
యెలమి శ్రీవేంకటేశుయిచ్చకొలదే యింతా
పలుమారు నిట్టట్టని బావించదగునా.

Vaadivo veedivo (Raagam:Paadi ) (Taalam: )

Vaadivo veedivo hari valasina vaarikellaa
Moodulokamula mari moraga jotaedi

Bahiramtaraana hari pratyaxamai yumdagaanu
Sahajaana bratyaxavichaaramaela
Ihamulo galavellaa yeetanileelai yumdagaa
Viharimchaeleela vaerae vedakanaelaa.

Manikai yannitaa numdi maatalaaduchumdagaanu
Venaka hari maatalu vaerae vunnanaa
Kanuchoo patadamtataa kalagona joodagaanu
Chanavichchi krpaadrshti challumananaelaa.

Nelavai yaata dinnitaa nimdukoniyumdagaanu
Alari vaerae vachcheenananaelaa
Yelami sreevaemkataesuyichchakoladae yimtaa
Palumaaru nittattani baavimchadagunaa.


vADevO prahlAdavaraduDu - వాడెవో ప్రహ్లాదవరదుడు

వాడెవో ప్రహ్లాదవరదుడు (రాగం: ) (తాళం : )

ప|| వాడెవో ప్రహ్లాదవరదుడు | వాడెవో భక్తవత్సలుడు ||

చ|| కోరదవడలతో కోటిసూర్యతేజముతో | హారకేయూర భూషణాంబరాలతో |
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను | మేరమీరిన సిరుల మేడతో నున్నాడు ||

చ|| తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ | చల్లని గందముల వాసనలతోడ |
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా | వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు ||

చ|| సంకుచక్రములతోడ జంట పూదండలతోడ | పొంకపు నానావిధ భోగములతో |
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు | అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు ||

vADevO prahlAdavaraduDu (Raagam: ) (Taalam: )

pa|| vADevO prahlAdavaraduDu | vADevO BaktavatsaluDu ||

ca|| kOradavaDalatO kOTisUryatEjamutO | hArakEyUra BUShaNAMbarAlatO |
cEri brahmAdu lellAnu sEvalu sEyagAnu | mEramIrina sirula mEDatO nunnADu ||

ca|| tellanimEnitODa tIgenavvulatODa | callani gaMdamula vAsanalatODa |
pellugA nAradAdulu pErukoni nutiMcagA | vellaviri koluvai vEDuka nunnADu ||

ca|| saMkucakramulatODa jaMTa pUdaMDalatODa | poMkapu nAnAvidha BOgamulatO |
aMkapu SrIvEMkaTAdri nahObalamunaMdu | aMkela nEpoddU nelavai tAnunnADu ||


Vade venkatadri mida - వాడె వేంకటాద్రి మీద

Vade venkatadri mida - వాడె వేంకటాద్రి మీద | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by OLETI VENKATESWARLU:

వాడె వేంకటాద్రిమీద (రాగం: ) (తాళం : )

ప|| వాడె వేంకటాద్రిమీద వరదైవము |
పోడమితో బొడచూపె బొడవైన దైవము ||

చ|| వొక్కొక్కరోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు |
పిక్కటిల్ల వెలుగొందే పెనుదైవము |
పక్కనను తనలోని పదునాలుగులోకాలు |
తొక్కి పాదానగొలచేదొడ్డదైవము ||

చ|| వేదశాస్త్రాలు నుతించి వేసరి కానగలేని- |
మోదపుపెక్కుగుణాలమూలదైవము |
పోది దేవతలనెల్ల బుట్టించ రక్షించ |
ఆదికారణంబైన అజునిగన్నదైవము ||

చ|| సరుస శంఖచక్రాలు సరిబట్టి యసురల |
తరగ పడవేసినదండిదయివమా |
సిరి వురమున నించి శ్రీవేంకటేశుడయి |
శరణాగతులగాచేసతమయినదయివము ||

vADe vEMkaTAdrimIda (Raagam: ) (Taalam: )

pa|| vADe vEMkaTAdrimIda varadaivamu |
pODamitO boDacUpe boDavaina daivamu ||

ca|| vokkokkarOmakUpAna nogi brahmAMDakOTlu |
pikkaTilla velugoMdE penudaivamu |
pakkananu tanalOni padunAlugulOkAlu |
tokki pAdAnagolacEdoDDadaivamu ||

ca|| vEdaSAstrAlu nutiMci vEsari kAnagalEni- |
mOdapupekkuguNAlamUladaivamu |
pOdi dEvatalanella buTTiMca rakShiMca |
AdikAraNaMbaina ajunigannadaivamu ||

ca|| sarusa SaMKacakrAlu saribaTTi yasurala |
taraga paDavEsinadaMDidayivamA |
siri vuramuna niMci SrIvEMkaTESuDayi |
SaraNAgatulagAcEsatamayinadayivamu ||