Posts

kOrudu nAmadi naniSamu - కోరుదు నామది ననిశము

Image
ప|| కోరుదు నామది ననిశము గుణధరు నిర్గుణు కృష్ణుని | నారాయణు విశ్వంభరు నవనీతాహారుని || చ|| కుండలి మణిమయ భూషణు కువలదళ వర్ణాంగుని | అణ్డజపతి వాహనుని అగణిత భవహరుని | మణ్డన చోదకదమనుని మాలాలంకౄత వక్షుని | నిండు కౄపాంబుధి చంద్రుని నిత్యానందుని || చ|| ఆగమపుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని | నాగేంద్రాయుత తల్పుని నానా కల్పుని | చాగుబ్రహ్మ మయాఖ్యుని సంతతగాన విలోలుని | వాగీశ సంస్తోత్రుని వైకుంఠోత్తముని || చ|| కుంకుమ వసంతకాముని గోపాంగన కుచలిప్తుని | శంకర సతీమణి నుతుని సర్వాత్ముని సముని | శంఖ నినాద మౄదంగుని చక్రాయుధ విదీప్తుని | వేంకటగిరి నిజవాసుని విభవ విధాయకుని || pa|| kOrudu nAmadi naniSamu guNadharu nirguNu kRShNuni | nArAyaNu viSvaMBaru navanItAhAruni || ca|| kuMDali maNimaya BUShaNu kuvaladaLa varNAMguni | aNDajapati vAhanuni agaNita Bavaharuni | maNDana cOdakadamanuni mAlAlaMkRuta vakShuni | niMDu kRupAMbudhi caMdruni nityAnaMduni || ca|| AgamapuMja padArthuni ApatsaKa saMBUtuni | nAgEMdrAyuta talpuni nAnA kalpuni | cAgubrahma mayAKyuni saMtatagAna vilOluni | vAgISa saMstOtruni vaikuMThOttamuni ||...

kAmadhEnu vidE kalpavRkSha - కామధేను విదే కల్పవృక్ష

Image
ప|| కామధేను విదే కల్పవృక్ష మిదే | ప్రామాణ్యముగలప్రపన్నులకు || చ|| హరినామజపమె ఆభరణంబులు | పరమాత్మునినుతి పరిమళము | ధరణిదరుపాదసేవే భోగము | పరమంబెరిగిన ప్రపన్నులకు || చ|| దేవునిధ్యానము దివ్యాన్నంబులు | శ్రీవిభుభక్తే జీవనము | ఆవిష్ణుకైంకర్యమే సంసారము | పావనులగుయీప్రపన్నులకు || చ|| యేపున శ్రీవేంకటేశుడే సర్వము | దాపై యితనివందనమే విధి | కాపుగ శరణాగతులే చుట్టాలు | పై పయి గెలిచినప్రపన్నులకు || pa|| kAmadhEnu vidE kalpavRkSha midE | prAmANyamugalaprapannulaku || ca|| harinAmajapame ABaraNaMbulu | paramAtmuninuti parimaLamu | dharaNidarupAdasEvE BOgamu | paramaMberigina prapannulaku || ca|| dEvunidhyAnamu divyAnnaMbulu | SrIviBuBaktE jIvanamu | AviShNukaiMkaryamE saMsAramu | pAvanulaguyIprapannulaku || ca|| yEpuna SrIvEMkaTESuDE sarvamu | dApai yitanivaMdanamE vidhi | kApuga SaraNAgatulE cuTTAlu | pai payi gelicinaprapannulaku || Sung by:Shobaraju Get this widget | Share | Track details

kaMTirA viMTirA kamala - కంటిరా వింటిరా కమల

కంటిరా వింటిరా కమలనాభుని శక్తి వొంటి నితనిశరణ మొకటే వుపాయము యీతనినాభి పొడమె యెక్కువైనబ్రహ్మయు యీతడే రక్షించినాడు యింద్రాదుల యీతడాకుమీద( దేలె నేకార్ణవమునాడు యీతడే పో హరి మనకిందరికి దైవము యీతడే యసురబాధ లిన్నియు( బరి హరించె- నీతనిమూడడుగులే యీలోకాలు యీతడే మూలమంటే నేతెంచి కరి(గాచె నీతనికంటే వేల్పు లిక మరి కలరా యీతడే వైకుంఠనాథు( డీతడే రమానాథు(- డీతడే వేదోక్తదైవ మిన్నిటా తానె యీతడే అంతర్యామి యీ చరాచరములకు నీతడే శ్రీవేంకటేశు( డీహపరధనము kaMTirA viMTirA kamalanAbhuni Sakti voMTi nitaniSaraNa mokaTE vupAyamu yItaninAbhi poDame yekkuvainabrahmayu yItaDE rakshiMchinADu yiMdrAdula yItaDAkumIda( dEle nEkArNavamunADu yItaDE pO hari manakiMdariki daivamu yItaDE yasurabAdha linniyu( bari hariMche- nItanimUDaDugulE yIlOkAlu yItaDE mUlamaMTE nEteMchi kari(gAche nItanikaMTE vElpu lika mari kalarA yItaDE vaikuMThanAthu( DItaDE ramAnAthu(- DItaDE vEdOktadaiva minniTA tAne yItaDE aMtaryAmi yI charAcharamulaku nItaDE SrIVEMkaTESu( DIhaparadhanamu Sung by:M.Balamurali Krishna Get this widget | Track...

koMDavElanettinaTTi - కొండవేలనెత్తినట్టి

Image
కొండవేలనెత్తినట్టి గోవిందా నిన్ను గొండించేరు యశోదకు గోవిందా గొల్లెతలు మొక్కేరు గోవిందా నీ- కొల్లల చీరలిమ్మని గోవిందా గొల్లు వెన్న దొంగిలగ గోవిందా నిన్ను కొల్లున నవ్వేరు వీరె గోవిందా గోవుల గాచేవేళ గోవిందా పిల్ల(- గోవిని వలచిరి గోవిందా గోవాళులై యమునలో గోవిందా నీకు కోవరమున్నారురా గోవిందా కొట్టేటి వుట్లకింద గోవిందా నీతో- గొట్టెవాటై పెనగేరు గోవిందా గుట్టుతో శ్రీవేంకటాద్రిగోవిందా కూడి గొట్టాన( బెట్టేరు బత్తి గోవిందా koMDavElanettinaTTi gOviMdA ninnu goMDiMchEru yaSOdaku gOviMdA golletalu mokkEru gOviMdA nI- kollala chIralimmani gOviMdA gollu venna doMgilaga gOViMdA ninnu kolluna navvEru vIre gOviMdA gOvula gAchEvELa gOviMdA pilla(- gOvini valachiri gOviMdA gOvALulai yamunalO gOviMdA nIku kOvaramunnArurA gOviMdA koTTETi vuTlakiMda gOviMdA nItO- goTTevATai penagEru gOviMdA guTTutO SrIvEMkaTAdrigOviMdA kUDi goTTAna( beTTEru batti gOviMdA Get this widget | Share | Track details

kOrikalu konasaage - కోరికలు కొనసాగె

కోరికలు కొనసాగె గోవిందరాజా మేరమీరి ఇట్లానే మెరసితివా || బాలుడవై రేపల్లెలో బాలుదాగేవేళ యీలీలనే పవళించి యిరవైతివా గోలవై తొట్టెలలోన గొల్లత లూచిపాడగా ఆలకించి విని పాట లవధరించితివా || కొంచక మధురలోన గుబ్జయింట నీలాగుల మంచాలపై బవళించి మరిగితివా చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా || పదియారువేల ఇంతుల పాలిండ్లు తలగడలై పొదల నిటువలెనే భోగించితివా యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన నిదిరించక శ్రీభూమి నీళల్ గూడితివా || gOviMdaraaju maerameera iTlaanae merasitivaa || baaluDavai raepallelO baaludaagaevaeLa yeeleelanae pavaLiMchi yiravaitivaa gOlavai toTTelalOna gollata loochipaaDagaa aalakiMchi vini paaTa lavadhariMchitivaa || koMchaka madhuralOna gubjayiMTa neelaagula maMchaalapai bavaLiMchi marigitivaa chaMchula dvaarakalOna satyabhaama toDameeda muMchi yeereeti noragi muchchaTalaaDitivaa || padiyaaruvaeliMtula paaliMDlu talagaDalai podala niTuvalenae bhOgiMchitivaa yeduTa Sree vaeMkaTaeSa iTTe tirupatilOna nidiriMchaka Sreebhoomi neeLal^ gooDitivaa || Sung by:Bala...

koluvuDI Bakti koMDala - కొలువుడీ భక్తి కొండల

ప|| కొలువుడీ భక్తి కొండలకోనేటి- | నిలయుని శ్రీనిధి యైనవాని || చ|| ఆదిదేవుని నభవుని సామ- | వేదనాద వినోదుని నెర- | వాది జితప్రియు నిర్మలతత్త్వ- | వాదులజీవనమైన వాని || చ|| దేవదేవుడైన దివ్యుని సర్వ- | భావాతీత స్వభావుని | శ్రీవేంకటగిరి దేవుడైన పర- | దేవుని భూదేవతత్పరుని || pa|| koluvuDI Bakti koMDalakOnETi- | nilayuni SrInidhi yainavAni || ca|| AdidEvuni naBavuni sAma- | vEdanAda vinOduni nera- | vAdi jitapriyu nirmalatattva- | vAdulajIvanamaina vAni || ca|| dEvadEvuDaina divyuni sarva- | BAvAtIta svaBAvuni | SrIvEMkaTagiri dEvuDaina para- | dEvuni BUdEvatatparuni || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

kaDavarAdu hari ghanamAya - కడవరాదు హరి ఘనమాయ

కడవరాదు హరి ఘనమాయ | తెగి విడువగరాదు వేసరరాదు. చూపుల యెదిటికి సోద్యంబైనది పాపపుణ్యములప్రపంచము తీపులు పుట్టించు దినదినరుచులై పూపలసంసారభోగములు మనసులోపలికి మర్మంబైనది జననమరణములశరీరము వెనవెనక తిరుగు వెడ లంపటమై కనకపుటాసలకర్మములు తగుమోక్షమునకు( దాపయైనదిదె నగి హరి తలచిన నాలుకిది వెగటు దీరె శ్రీవేంకటపతియై యగపడె నిపుడు పురాకృతము kaDavarAdu hari ghanamAya | tegi viDuvagarAdu vEsararAdu. chUpula yediTiki sOdyMbainadi pApapuNyamulaprapaMcamu tIpulu puTTiMchu dinadinaruchulai pUpalasaMsArabhOgamulu manasulOpaliki marmaMbainadi jananamaraNamulaSarIramu venavenaka tirugu veDa laMpaTamai kanakapuTAsalakarmamulu tagumOkshamunaku( dApayainadide nagi hari talachina nAlukidi vegaTu dIre SrIvEMkaTapatiyai yagapaDe nipuDu purAkRtamu Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA