Posts

okkaDE EkAMga viiruDurviki daivamaunaa

Image
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా యెక్కడా హనుమంతుని కెదురా లోకము ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు అందరు దైత్యులచంపి హరిపేరైనాడు అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు యెందునా హనుమంతుని కెదురా లోకము చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు ఎక్కువ హనుమంతుని కెదురా లోకము జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు మలసి మేరుపుపొంత సింహమైనాడు బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి ఇల ఈ హనుమంతుని కెదురా లోకము in English: okkaDE EkAMga viiruDurviki daivamaunaa yekkaDA hanumaMtuni keduraa lOkamu muMdaTa nEleDi paTTamunaku brahmayinaaDu aMdaru daityulachaMpi haripErainaaDu aMdi rudraviiryamu taanai haruDainaaDu yeMdunaa hanumaMtuni keduraa lOkamu chukkalu mOva perigi suuryuDu taanainaaDu chikku paataaLamu duuri SEshuDainaaDu gakkana vaayujuDai jagatpraaNuDainaaDu ekkuva hanumaMtuni keduraa lOkamu jaladhi puTamegasi chaMdruDu taanainaaDu malasi mErupupoMta siMhamainaaDu balimi SriivEMkaTESu baMTai maMgaaMbudhi ila ii hanumaMtuni keduraa lOkamu Sung by:Balak...

O pavanAtmaja O ghanuDA

Image
ప|| ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా చ1|| ఓ హనుమంతుడ ఉదయాచల ని- ర్వాహక నిజ సర్వ ప్రబలా దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా || చ2|| ఓ రవి గ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా దారుణపు వినతా తనయాదులు గారవింప నిటు కలిగితిగా|| చ3|| ఓ దశముఖ హర ఓ వేంకటపతి- పాదసరోరుహ పాలకుడా ఈ దేహముతో ఇన్నిలోకములు నీదేహమెక్క నిలిచితిగా || in english: pa|| O pavanAtmaja O ghanuDA bApu bApanagA parigitigA ca1|| O hanumaMtuDa udayAchala ni- rwAhaka nija sarwa prabalA dEhamu mOcina teguvaku niTuvale sAhasa miTuvale chATitigA || ca2|| O ravi grahaNa OdanujAMtaka mArulEka mati malasitigA dAruNapu vinatA tanayAdulu gAraviMpa niTu kaligitigA|| ca3|| O daSamukha hara O vEMkaTapati- pAdasarOruha pAlakuDA I dEhamutO innilOkamulu nIdEhamekka nilichitigA || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

OyammA iMtayEla voddanarE

Image
ఓయమ్మా ఇంతయేల వొద్దనరే నాయముగాదిందరిలో నగుబాటు తనకును చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని మక్కువతో నెంతైనా మాటాడడు మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును కచ్చుపెట్టి యెంతైనా కరగడు ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు కన్నులా జొక్కితిని కాగిటా నించితిని మన్నించె రతినెంతైనా మానడు సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు in english: OyammA iMtayEla voddanarE nAyamugAdiMdarilO nagubATu tanakunu chekkunokkitini selavi navvitini makkuvatO neMtainA mATADaDu mokkU mokkitini mOnAna nuMDitini yekkuDu diTTitinaMTA negguvaTTI nitaDu ichchakamu jEsiti ichchiti viDemunu kachchupeTTi yeMtainA karagaDu muchchaTalADitini mOvijUchiti tannu bachchigA jEsitinaMTA pagachATI nitaDu kannulA jokkitini kAgiTA niMchitini manniMche ratineMtainA mAnaDua sannala mechchitini chAyala hechchitini inniTA SrIvEMkaTESu DeMtajANE itaDu Sung by:Srirangam Gopalaratnam Oyamma Inthaela Oddanare - Srirangam Go...

OhO yentaTi vaaDE voddanunnavaaDE

Image
ఓహో యెంతటి వాడే వొద్దనున్నవాడే సాహసపు గుణములచతురుడా యితడు జలధిలో బవళించి జలనిధి బంధించి జలనిధి కన్యకను సరిబెండ్లాడి జలనిధిలో నీది జలనిధి మధియించి జలధి వెరించిన చలమరాయితడు ధరణికి బతియై ధరణి గ్రుంగిన నెత్తి ధరణి కూతురు దానె తగ బెండ్లాడి ధరణి పాదము మోపి ధరణి భారము దించి ధరణీ ధరుడైన దైవమా ఇతడు కొండ గొడుగుగ నెత్తి కొండ దూటు పడవేసి కొండకిందగుదురై కూచుండి కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటి రాయడై కొండ వంటి దేవుడైన కోవిదుడా ఇతడు OhO yentaTi vaaDE voddanunnavaaDE saahasapu guNamulachaturuDaa yitaDu jaladhilO bavaLinchi jalanidhi bandhinchi jalanidhi kanyakanu saribenDlaaDi jalanidhilO needi jalanidhi madhiyinchi jaladhi verinchina chalamaraayitaDu dharaNiki batiyai dharaNi grungina netti dharaNi kUturu daane taga benDlaaDi dharaNi paadamu mOpi dharaNi bhaaramu dinchi dharaNI dharuDaina daivamaa itaDu konDa goDuguga netti konDa dUTu paDavEsi konDakindagudurai kUchunDi konDapai SrI vEnkaTaadri kOnETi raayadai konDa vanTi dEvuDaina kOviduDaa itaDu Sung by:Balakrishna Prasad Get this widget | T...

okkokkasatinaDuma okkokka rUpu gaikoni

Image
ఒక్కొక్కసతినడుమ ఒక్కొక్క రూపు గైకొని యెక్కువైతివి కృష్ణా నిన్నెట్ల నమ్మేదిరా మాటలాడే వొకతెతో మళ్ళిచూచే వొకతెను వోటలేక నవ్వు నవ్వేవు వొకతెతోను కూటవై గొల్లెతలము గుంపుగూడున్నారమిదే యేటిది నీమోహ మింక నెందని నమ్మేదిరా కన్నుగీటె వొకతెకు కాగిలించే వొకతెను వెన్నదిన్న మోవిచ్చేవు వేరొకతెకు వున్నతి రాసక్రీడ లున్నార మిందరము ఇన్నిటిలో నీవలపు యెందని నమ్మేదిరా తమ్మవెట్టే వొకతెను తగమెచ్చే వొకతెను సమ్మతించ జేశొకతె చన్ను లంటేవు యెమ్మెల శ్రీవేంకటేశ ఇందరి మమ్ము గూడితి- విమ్ముల నే నమ్మితిగాకెటుల నమ్మేదిరా okkokkasatinaDuma okkokka rUpu gaikoni yekkuvaitivi kRshNA ninneTla nammEdirA mATalADE vokatetO maLLichUchE vokatenu vOTalEka navvu navvEvu vokatetOnu kUTavai golletalamu guMpugUDunnAramidE yETidi nImOha miMka neMdani nammEdirA kannugITe vokateku kAgiliMchE vokatenu vennadinna mOvichchEvu vErokateku vunnati rAsakrIDa lunnAra miMdaramu inniTilO nIvalapu yeMdani nammEdirA tammaveTTE vokatenu tagamechchE vokatenu sammatiMcha jESokate channu laMTEvu yemmela SrIvEMkaTESa iMdari mammu gUDiti- vimmula nE nammiti...

OhO nilichinadokaTidiyE

Image
ఓహో నిలిచినదొకటిదియే శ్రీహరిసాకార చింతనము పంచమవేదపు పద్మాక్షునామము అంచె పాపహరము ఔషధము పంచల పీతాంబరు శరణాగతి ముంచిన యజ్ఞానమునకు దీపము విందుల కుడుపులు విష్ణు కీర్తనము చందపు వైకుంఠ(ము) సంబళము పొందుగ అచ్యుతు పూజించు పూజలు కిందట కొనకెక్కెడినిచ్చెనలు కట్టినముడుపగు ఘనకృష్ణభక్తి ముట్టిన పాపవిమోచనము యిట్టె శ్రీవేంకటేశ్వరు కృప యిది పట్టినవారికి బలువగు కొమ్ము(మ్మ?) OhO nilichinadokaTidiyE SrIharisAkAra chiMtanamu paMchamavEdapu padmAkshunAmamu aMche pApaharamu aushadhamu paMchala pItAMbaru SaraNAgati muMchina yaj~nAnamunaku dIpamu viMdula kuDupulu vishNu kIrtanamu chaMdapu vaikuMTha(mu) saMbaLamu poMduga achyutu pUjiMchu pUjalu kiMdaTa konakekkeDinichchenalu kaTTinamuDupagu ghanakRshNabhakti muTTina pApavimOchanamu yiTTe SrIvEMkaTESwaru kRpa yidi paTTinavAriki baluvagu kommu(mma?) Sung by:Balakrishna Prasad

osagitivinniyu okamATE

ఒసగితివిన్నియు ఒకమాటే వెసనిక జేసే విన్నపమేది నారాయణా నీనామము దలచిన - నీరాని వరములిచ్చితివి చేరి నిన్ను నిటు సేవించిననిక గోరి పడయ నిక కోరికలేవి హరి నీకొకమరి యటు శరణంటే గరిమల నన్నిటు గాచితివి నిరతముగా నిక నిను నుతియింపుచు అరగొరతనివి నిను నడిగేదేదో శ్రీవేంకటేశ్వర చేయెత్తి మొక్కిన భావమే నీవై పరగితివి యీవరుసల నీవింతటిదాతవు ఆవలనిను కొనియాడెడిదేమి osagitivinniyu okamATE vesanika jEsE vinnapamEdi nArAyaNA nInAmamu dalachina - nIrAni varamulichchitivi chEri ninnu niTu sEviMchinanika gOri paDaya nika kOrikalEvi hari nIkokamari yaTu SaraNaMTE garimala nanniTu gAchitivi niratamugA nika ninu nutiyiMpuchu aragoratanivi ninu naDigEdEdO SrIvEMkaTESwara chEyetti mokkina bhAvamE nIvai paragitivi yIvarusala nIviMtaTidAtavu Avalaninu koniyADeDidEmi Sung by:Balakrishna Prasad