Posts

shODasakaLaanidhiki - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వనిలయున కాసనము నెమ్మి నిదే అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణము లివే ధరణీధరునకు గంధపుష్ప ధూపములు తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము అమృతమథనునకు నదివో నైవేద్యము గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో shODasakaLaanidhiki shODaSOpachaaramulu jaaDatODa nichchalunu samarpayaami alaru viSvaatmakuna kaavaahana mide sarvanilayuna kaasanamu nemmi nidae alagaMgaa janakuna karghyapaadyaachamanaalu jaladhi Saayikini majjanamidae varapeetaaMbarunaku vastraalaMkaaramide sari SreemaMtunaku bhooshaNamu livae dharaNeedharunaku gaMdhapushpa dhoopamulu tira mide kOTisooryataejunaku deepamu amRtamathanunaku nadivO naivaedyamu gami(ravi)jaMdrunaetrunaku kappuraviDemu amarina SreevaeMkaTaadri meedi daevuniki tamitO pradakshiNaalu daMDamulu nivigO Sung by:Balakrishna Prasad Get this...

sakalaM hE saKi jAnAmi tata - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
One of the very few Srungara Keerthanams in Sanskrit. ప|| సకలం హే సఖి జానామి తత | ప్రకట విలాసం పరమం ధధసే || చ|| అలిక మౄగమద మయ మషీకల నో- | జ్జ్వలతాం హే సఖి జానామి | లలితం తవ పల్లవి తమనసి ని- | శ్చలతర మేఘ శ్యామం ధధసే || చ|| చారు కపోలస్థల కరాంచిత వి- | చారం హే సఖి జానామి | నారాయణ మహినాయక శయనం | శ్రీ రమణం తవ చిత్తే ధధసే || చ|| ఘనకుచ శైలాగ్ర స్థిత విధుమణి | జననం హే సఖి జానామి | కనదురసా వేంకట గిరిపతే | వినుత భోగసుఖ విభవం దధసే || pa|| sakalaM hE saKi jAnAmi tata | prakaTa vilAsaM paramaM dhadhasE || ca|| alika mRugamada maya maShIkala nO- | jjvalatAM hE saKi jAnAmi | lalitaM tava pallavi tamanasi ni- | Scalatara mEGa SyAmaM dhadhasE || ca|| cAru kapOlasthala karAMcita vi- | cAraM hE saKi jAnAmi | nArAyaNa mahinAyaka SayanaM | SrI ramaNaM tava cittE dhadhasE || ca|| Ganakuca SailAgra sthita vidhumaNi | jananaM hE saKi jAnAmi | by Nayanatara Kosaraju, during 599th annamayya jayanti programs, Annamayyapuram. Sakalamhesakhi_Nay... Hosted by eSnips Sakalam He Sakhi.f... Hosted by eSnips

siMgAramUritivi cittaju guruDavu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| సింగారమూరితివి చిత్తజు గురుడవు | చక్కగ జూచేరు మిము సాసముఖా || చ|| పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి | పూవులు ఆకసము మోప పూచిచల్లుచు | దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా | సావధానమగు నీకు సాసముఖా || చ|| అంగరంగవైభవాల అమరకామినులాడ | నింగినుండి దేవతలు నినుజూడగా | సంగీత తాళవాద్య చతురతలు మెరయ | సంగడిదేలేటి నీకు సాసముఖా || చ|| పరగ కోనేటిలోన పసిడి మేడనుండి | అరిది యిందిరయు నీవు ఆరగించి | గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ | సరవి నోలాడు సాసముఖా || pa|| siMgAramUritivi cittaju guruDavu | cakkaga jUcEru mimu sAsamuKA || ca|| pUvula teppalamIda polatulu nIvunekki | pUvulu Akasamu mOpa pUcicallucu | dEvaduMduBulu mrOya dEvatalu koluvagA | sAvadhAnamagu nIku sAsamuKA || ca|| aMgaraMgavaiBavAla amarakAminulADa | niMginuMDi dEvatalu ninujUDagA | saMgIta tALavAdya caturatalu meraya | saMgaDidElETi nIku sAsamuKA || ca|| paraga kOnETilOna pasiDi mEDanuMDi | aridi yiMdirayu nIvu AragiMci | garima SrIvEMkaTESa kannula paMDuvakAga | saravi nOlADu sAsamuKA || Sung by:Balakrishna Prasad Get this w...

satulAla chUDarE SrAvaNabahuLAshTami - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి( గతలాయ నడురేయి( గలిగె శ్రీకృషుడు పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు కొద దీర మరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు satulAla chUDarE SrAvaNabahuLAshTami( gatalAya naDurEyi( galige SrIkRshuDu puTTEyapuDE chaturbhujAlu SaMkhuchakrAlu yeTTu dhariyiMchenE yI kRshNuDu aTTe kirITamu nAbharaNAlu dhariMchi yeTTA neduTa nunnADu yI kRshNuDu vachchi brahmayu rudruDu vAkiTa nutiMchagAnu yichchagiMchi vinuchunnA(DIkRshNuDu muchchaTADI dEvakitO muMchi vasudEvunitO hechchinamahimalatO yI kRshNuDu koda dIra mari naMdagOpunaku yaSOdaku idigO tA biDDADAye nIkRshNuDu adana SrI vEMkaTESuDai yalamElmaMga(gUDi yeduTanE niluchunnA DIkRshNuDu Sung by:Balakrishna Prasad G...

siggari peMDli kUtura sItamma - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను యెల్లినేడే పెండ్లాడీ నిదివో నిన్ను యెల్లగా జనకుడు నిన్నిచ్చీనట వీడె వెల్లవిరి నీమాట వినవమ్మా అదె పెండ్లితెర యెత్తి రండనే వశిష్టుడుండి చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా మొదల రాముని కంటె ముంచి తలంబ్రాలు వోసి సుదతి యాతని మోము చూడవమ్మా కంకణదారాలు గట్టి కాలుదొక్కితివి మీరు పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ వుంకువ వావిలిపాట నుండి శ్రీవేంకటగిరి తెంకుల నిన్ను గూడి తిరమాయనమ్మా siggari peMDli kUtura sItamma daggari siMgArabomma talavaMchakammA allanADE rAGhavuDu harivillu virichenu yellinEDE peMDlADI nidivO ninnu yellagA janakuDu ninnichchInaTa vIDe vellaviri nImATa vinavammA ade peMDlitera yetti raMDanE vaSiShTuDuMDi chadivI maMtrAlu sEsa challavammA modala rAmuni kaMTe muMchi talaMbrAlu vOsi sudati yAtani mOmu chUDavammA kaMkaNadArAlu gaTTi kAludokkitivi mIru poMkAna buvva maMdarO pottula namma vuMkuva vAvilipATa nuMDi SrIvEMkaTagiri teMkula ninnu gUDi tiramAyanammA Tuned&Sung by:Chakrapani Get thi...

sumukha maMgaLamu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

సుముఖ మంగళము జయమంగళము శమదమగత తే జయమంగళం గంభీరగుణ కమలారమణా శంభురాని నుత సకళలోకయుత మాంభజతే జయమంగళం అంభోధిశయన హరినయనా కనకాంబర నిజఘనచరణాంబర దనుజగణ హతదైత్యగణా అనుపమచరిత అనంత నిరత సనకప్రియ తే జయ మంగళము చతుర్భుజాంగా సదయా పాంగ గతనక్రాంబుజకర చక్ర శ్రితశరణాగత శ్రీవేంకటపతి చతుర నమో తే జయమంగలం sumukha maMgaLamu jayamaMgaLamu Samadamagata tE jayamaMgaLaM gaMbhIraguNa kamalAramaNA SaMbhurAni nuta sakaLalOkayuta mAMbhajatE jayamaMgaLam aMbhOdhiSayana harinayanA kanakAmbara nijaghanacharaNAMbara danujagaNa hatadaityagaNA anupamacharita anaMta nirata sanakapriya tE jaya maMgaLamu chaturbhujAMgA sadayA pAMga gatanakrAMbujakara chakra SritaSaraNAgata SrIvEMkaTapati chatura namO tE jayamaMgalaM Get this widget | Track details | eSnips Social DNA

sakalabalaMbulu nIvE - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు పొందుగ( జక్రాంకితమే బుజబల మిదే నాకు అందినహరి నీచింతే ఆత్మబలము నాకు సందడి( బేరుబలము కేశవనామము నాకు యిందును నందును భవభయ మిక లేదిదే నాకు అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు సంగతి నీపై పాటలె సర్వబలి మిదే నాకు రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు యింగితముగ నిహపరముల కెదురే దిదే నాకు కనుగొను నీవిగ్రహమే గ్రహబలి మిదే నాకు విను నీదాసులసేవే వెనుబలిమిదె నాకు తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు ఘనమే చెప్పగ నింతటా కలిగెబో యిదే నాకు In English: sakalabalaMbulu nIvE sarwESwarA nAku akalaMkamagusukhamE anniTanidE nAku poMduga( jakrAMkitamE bujabala midE nAku aMdinahari nIchiMtE Atmabalamu nAku saMdaDi( bErubalamu kESavanAmamu nAku yiMdunu naMdunu bhavabhaya mika lEdidE nAku aMgapu tirumaNulivi paMchAMgabalamu nAku saMgati nIpai pATale sarwabali midE nAku raMguga nIguNarAsulE rAsibalamu nAku yiMgitamuga nihaparamula kedurE didE nAku kanugonu nIvigrahamE grahabali midE nAku vinu nIdAsulasEvE venubalimide nAku tanarina SrIvEMkaTapati daivabalamu nAku...