evvarivADAgAnu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english
ఎవ్వరివాడాగాను యేమందునిందుకు నవ్వుచు నాలోనిహరి నన్నుగావవే కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు నేను చూపుడుఁబూట వెట్టితి సొగిసి నేను యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను దాపుగ తొర్లుఁబూట తగిలించుకొంటిని మొదల కర్మములకు మోసపోయి యీ బ్రదుకు కుదువవెట్టితి నే గురి గానక వెదకి కామునికి విషయములకు నే అదివో నావయసెల్ల నాహివెట్టితిని ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు కప్పిన గురుడు నీకు క్రయమిచ్చెను వొప్పించిరిందరు బలువుడు చేపట్టెననుచు అప్పులెల్లబాసి నీ సొమ్మైతినేనయ్యా evvarivADAgAnu yEmaMduniMduku navvuchu nAlOnihari nannugAvavE kOpularAjulanella kolichi konnALLu nEnu chUpuDu@MbUTa veTTiti sogisi nEnu yEpuna saMsAramuna idigAka kammaTAnu dApuga torlu@MbUTa tagiliMchukoMTini modala karmamulaku mOsapOyi yI braduku kuduvaveTTiti nE guri gAnaka vedaki kAmuniki vishayamulaku nE adivO nAvayasella nAhiveTTitini ippuDE SrIvEMkaTESa yIDErchi nAmanasu kappina guruDu nIku krayamichchenu voppiMchiriMdaru baluvuDu chEpaTTenanuchu appulellabAsi nI sommaitinEnayyA Tune & Sung by:Srirangam Gopalaratnam listen from ...