Posts

inniTA GanuDu - ఇన్నిటా ఘనుడు

ఇన్నిటా ఘనుడు (రాగం: ) (తాళం : ) ఇన్నిటా ఘనుడు దాను యేమి చెప్పేరే యెన్నుకోనీ నా గుణము లేమి చెప్పేరే || చెంత దన చెప్పినట్టు సేసితినంటా నిదె యేంత నన్ను బుజ్జగించీ నేమి చెప్పేరే అంతటా దన కిచ్చక మాడితినంటా నిదె ఇంతలో నన్ను బొగడీనేమి చెప్పేరే వొట్టి తనపై పాటలు వొనర బాడితినంటా ఇబ్డె విదెమిచ్చీని యేమి చెప్పేరే జట్టిగా జన్నులతోడ సాము సేఇంచితి నంటా యెట్టనెదుటనే మెచ్చీ నేమి చెప్పేరే || మనసు మర్మములంటా మంతన మాడితినంటా యెనసి కౌగలించీ యేమి చెప్పేరే చెనకి మొక్కితినంటా శ్రీ వేంకటేశ్వరుడు ఇనుముడిగా మన్నించె నేమి చెప్పేరే || inniTA GanuDu (Raagam: ) (Taalam: ) inniTA GanuDu dAnu yEmi cheppErE yennukOnI nA guNamu lEmi cheppErE || cheMta dana cheppinaTTu sEsitinaMTA nide yEMta nannu bujjagiMchI nEmi cheppErE aMtaTA dana kichchaka mADitinaMTA nide iMtalO nannu bogaDInEmi cheppErE voTTi tanapai pATalu vonara bADitinaMTA ibDe videmichchIni yEmi cheppErE jaTTigA jannulatODa sAmu sEiMchiti naMTA yeTTaneduTanE mechchI nEmi cheppErE || manasu marmamulaMTA maMtana mADitinaMTA yenasi kougaliMchI yEmi...

inniTa niMtaTa - ఇన్నిట నింతట

ఇన్నిట నింతట (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నిట నింతట ఇరవొకటే | వెన్నుని నామమే వేదంబాయె || చ|| నళినదళాక్షుని నామ కీర్తనము | కలిగి లోకమున గల దొకటే | ఇల నిదియే భజియింపగ పుణ్యులు | చెలగి తలప సంజీవని యాయె || చ|| కోరిన నచ్యుత గోవిందా యని | ధీరులు తలపగ తెరువకటే | ఘోరదురితహర గోవర్ధన | నారాయణ యని నమ్మగ గలిగె || చ|| తిరువేంకటగిరి దేవుని నామము | ధర తలపగ నాధారమిదె | గరుడధ్వజుని సుఖప్రద నామము | నరులకెల్ల ప్రాణము తానాయె || inniTa niMtaTa (Raagam: ) (Taalam: ) pa|| inniTa niMtaTa iravokaTE | vennuni nAmamE vEdaMbAye || ca|| naLinadaLAkShuni nAma kIrtanamu | kaligi lOkamuna gala dokaTE | ila nidiyE BajiyiMpaga puNyulu | celagi talapa saMjIvani yAye || ca|| kOrina nacyuta gOviMdA yani | dhIrulu talapaga teruvakaTE | GOraduritahara gOvardhana | nArAyaNa yani nammaga galige || ca|| tiruvEMkaTagiri dEvuni nAmamu | dhara talapaga nAdhAramide | garuDadhvajuni suKaprada nAmamu | narulakella prANamu tAnAye ||

innicaduvanEla iMta - ఇన్నిచదువనేల ఇంత

ఇన్నిచదువనేల ఇంత (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నిచదువనేల ఇంత వెదకనేల | కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి || చ|| వలెననేదొకమాట వలదనేదొక మాట | సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను | వలెనంటె బంధము వలదంటె మోక్షము | తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే || చ|| పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను | పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే || చ|| పరమనేదొకటే ప్రపంచమొకటే | సిరుల నీరెంటికిని జీవుడే గురియౌను | ఇరవు వేంకటేశుడిహ పరములకర్త | శరణాగతులకెల్ల సతమీతడొకడే || innicaduvanEla (Raagam: ) (Taalam: ) pa|| innicaduvanEla iMta vedakanEla | kannu teracuTokaTi kanumUyuTokaTi || ca|| valenanEdokamATa valadanEdoka mATa | silugulI reMTikini cittamE guriyaunu | valenaMTe baMdhamu valadaMTe mOkShamu | telisi vij~jAnulaku teruvidi yokaTE || ca|| puTTeDidokaTE pOyeDidokaTE | tiTTamai reMTikini dEhamE guriyaunu | puTTuTa saMSayamu pOvuTa niScayamu | voTTi vij~jAnulaku vupamidi vokaTE || ca|| paramanEdokaTE prapaMcamokaTE | sirula nIreMTikini jIvuDE guriyaunu ...

Inni daehamula butti - ఇన్ని దేహముల బుట్టి

ఇన్ని దేహముల(రాగం:దేపాళం ) (తాళం : ) ఇన్ని దేహముల బుట్టి యేమిగంటిమి పున్నతపుహరిదాస్యమొక్కటేకాక హీనజంతువైననాడు యేనుగై పుట్టిననాడు ఆనంద మొక్కటే అంగాలే వేరు యీనేటియజ్ఞానము యీజీవుల కొక్కలాగే జ్ఞానమే యెక్కుడుగాక సరిలేని దొకటే నరలోక భోగానకు నరకానుభవానకు సరేగాని ముగులదు చనెదొల్లె గరిమ నేర్పడ నందు ఘనమేమి కొంచెమేమి హరిదాసుడై బ్రదుకుటదియే లాభము బాలుడైనయప్పుడూను పండి ముదిసినప్పుడు కాలమొక్కటే బుద్ది కడు లేదు ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి యేలికంటా మొక్కుచుండే దిదియే భాగ్యము. Inni daehamula (Raagam:Daepaalam ) (Taalam: ) Inni daehamula butti yaemigamtimi Punnatapuharidaasyamokkataekaaka Heenajamtuvainanaadu yaenugai puttinanaadu Aanamda mokkatae amgaalae vaeru Yeenaetiyaj~naanamu yeejeevula kokkalaagae J~naanamae yekkudugaaka sarilaeni dokatae Naraloka bhogaanaku narakaanubhavaanaku Saraegaani muguladu chanedolle Garima naerpada namdu ghanamaemi komchemaemi Haridaasudai bradukutadiyae laabhamu Baaludainayappudoonu pamdi mudisinappudu Kaalamokkatae buddi kadu laedu Aalakimchi sreeva...

inni janmamulETiki - ఇన్ని జన్మములేటికి

ఇన్ని జన్మములేటికి (రాగం: ) (తాళం : ) ప|| ఇన్ని జన్మములేటికి హరిదాసు- | లున్న వూర దానుండిన జాలు || చ|| హరిభక్తుల యింటి యన్నము గొనువారి | వరువుడై యుండవలెనన్న జాలు | పరమభాగవత భవనంబుల జెడ్డ | పురువు దానయి పొడమిన జాలు || చ|| వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను | రోసిన యెంగిలి రుచిగొన్న జాలు | శ్రీసతీశుని దలచినవారి దాసాను- | దాసుడైవుండ దలచినజాలు || చ|| శ్రీవేంకటేశు జూచినవారి శ్రీపాద | సేవకుడై యండజేరిన జాలు || ఈ విభుదాసుల హితుల పాదధూళి | పావనమై సోకి బ్రదికిన జాలు || inni janmamulETiki (Raagam: ) (Taalam: ) pa|| inni janmamulETiki haridAsu- | lunna vUra dAnuMDina jAlu || ca|| hariBaktula yiMTi yannamu gonuvAri | varuvuDai yuMDavalenanna jAlu | paramaBAgavata BavanaMbula jeDDa | puruvu dAnayi poDamina jAlu || ca|| vAsudEvuni Baktavarula dAsulu munnu | rOsina yeMgili rucigonna jAlu | SrIsatISuni dalacinavAri dAsAnu- | dAsuDaivuMDa dalacinajAlu || ca|| SrIvEMkaTESu jUcinavAri SrIpAda | sEvakuDai yaMDajErina jAlu || I viBudAsula hitula pAdadhULi | pAvanamai sOki bradikina jAlu ||

inni cEtalunu dEvuDiccinavE - ఇన్ని చేతలును దేవుడిచ్చినవే

ఇన్ని చేతలును (రాగం: శంకరాభరణం ) (తాళం : ) ప|| ఇన్ని చేతలును దేవుడిచ్చినవే | ఉన్నవారి యీపులెల్ల నొద్దికయ్యీనా || చ|| తెగని యాపదలకు దేవుడే కలడుగాక | వగలుడుప బరుల వసమయ్యీనా | నొగలి యితరులకు నోళ్ళు దెరచిన | నగుబాటేకాక మానగ బొయ్యీనా || చ|| అగ్గలపు దురితాలు హరియే మానుపుగాక | బగ్గన నొక్కరు వచ్చి పాప బొయ్యేరా | తగ్గుమగ్గులైనవేళ తలచినవారెల్ల | సిగ్గుబాటేకాక తమ్ముజేరవచ్చేరా || చ|| ఎట్టుసేసినను వేంకటేశుడే నేరుచుగాక | కట్టకడ వారెల్ల గరుణించేరా | ఇట్టే యేమడిగిన నితడే యొసగుగాక | వుట్టివడి యెవ్వరైనా నూరడించేరా || inni cEtalunu (Raagam: SaMkarAbharaNaM ) (Taalam: ) pa|| inni cEtalunu dEvuDiccinavE | unnavAri yIpulella noddikayyInA || ca|| tegani yApadalaku dEvuDE kalaDugAka | vagaluDupa barula vasamayyInA | nogali yitarulaku nOLLu deracina | nagubATEkAka mAnaga boyyInA || ca|| aggalapu duritAlu hariyE mAnupugAka | baggana nokkaru vacci pApa boyyErA | taggumaggulainavELa talacinavArella | siggubATEkAka tammujEravaccErA || ca|| eTTusEsinanu vEMkaTESuDE nErucugAka | kaTTakaDa vArella garuNi...

innALLu naMdunaMdu - ఇన్నాళ్ళు నందునందు

ఇన్నాళ్ళు నందునందు (రాగం: ) (తాళం : ) ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని అన్నిటా శరణు చొచ్చి హరి నిను గంటిని అంగనలపసఁజిక్కి అలయికలే కంటి బంగారు వెంటఁ దగిలి భ్రమ గంటిని ముంగిటి క్షేత్రాలంటి ముంచి వెట్టిసేయగంటి అంగపునన్నే చూచి అంతరాత్మఁ గంటి చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి మట్టిలేని వయసుతో మదము గంతి వట్టి కామములు సేసి వరుస మాయలు గంటి పట్టి నారాయణుని భక్తి నిన్ను గంటిని వింతచదువులవల్ల వేవేలు మతాలు గంటి సంతకర్మములవల్ల సాము గంటిని యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము చింతించి అందులోన నీశ్రీపాదాలు గంటి innALLu naMdunaMdu (Raagam: ) (Taalam: ) innALLu naMdunaMdu nEmigaMTini anniTA SaraNu chochchi hari ninu gaMTini aMganalapasa@Mjikki alayikalE kaMTi baMgAru veMTa@M dagili bhrama gaMTini muMgiTi kshEtrAlaMTi muMchi veTTisEyagaMTi aMgapunannE chUchi aMtarAtma@M gaMTi chuTTAla@M jEri chUchi suddulavAvulu gaMTi maTTilEni vayasutO madamu gaMTi vaTTi kAmamulu sEsi varusa mAyalu gaMTi paTTi nArAyaNuni bhakti ninnu gaMTini viMtachaduvulavalla vEvElu matAlu gaMTi saMtakarmamulavalla sAmu ga...