eMtavicAriMcukonnA - ఎంతవిచారించుకొన్నా
ఎంతవిచారించుకొన్నా (రాగం: ) (తాళం : ) ప|| ఎంతవిచారించుకొన్నా నిదియే తత్త్వము హరి | వంతుకు నీకృపగలవాడే యెరుగు హరి || చ|| నిన్నునమ్మినట్టివాడు నిఖిలవంద్యుడు హరి | నిన్నునొల్లనట్టివాడు నీరసాధముడు | మున్నుదేవతలు నీకుమొక్కి బదికిరి హరి | వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి || చ|| యేపున నీపేరిటివాడిన్నిట ధన్యుడు హరి | నీపేరొల్లనివాడు నిర్భాగ్యుడే హరి | కైపులనిన్ను నుతించి గెలిచె నారదుడు హరి | పైపై నిన్నుదిట్టి శిశుపాలుడు వీగెను హరి || చ|| యిట్టె నీవిచ్చినవరమెన్నడు జెడదు హరి | గట్టిగా నీవియ్యనివి కపటములే హరి | అట్టె శ్రీ వేంకటేశ నీవంతరంగుడవు హరి | వుట్టిపడి కానకున్న దేహికి హరి || eMtavicAriMcukonnA (Raagam: ) (Taalam: ) pa|| eMtavicAriMcukonnA nidiyE tattvamu hari | vaMtuku nIkRupagalavADE yerugu hari || ca|| ninnunamminaTTivADu niKilavaMdyuDu hari | ninnunollanaTTivADu nIrasAdhamuDu | munnudEvatalu nIkumokki badikiri hari | vunnati nasuralu ninnollaka ceDiri hari || ca|| yEpuna nIpEriTivADinniTa dhanyuDu hari | nIpErollanivADu nirBAgyuDE hari | kaipulaninnu nutiMci gelice nArad...