Posts

OrucukOvE yeTTayinA - ఓరుచుకోవే యెట్టయినా

ఓరుచుకోవే యెట్టయినా (రాగం: ) (తాళం : ) ప|| ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు | నేరుపరి నీ విభుడు నేడే వచ్చీ నీడకు || చ|| కలువల వేసితేనే కాముడు చుట్టము గాడా | వెలయు విరహులకు వెగటు గాక | చలివెన్నెల గాసితే చందురుడు పగవాడా | పొలయలు కలవారే పొగడరుగాక || చ|| కొసరుచు బాడితేనే కోయిల గుండె బెదరా | అసదు విరహులు కాదందురు గాక | ముసరితే దుమ్మిద మూకలు దయలేనివా | విసిగిన కాముకులే వినలేరు గాక || చ|| వనము సింగారించితే వసంతుడు కౄరుడా | వొనరని విరహుల కొంటదుగాక | యెనసి శ్రీ వేంకటేశుడేలె నిన్ను చిలుకలు | కినిసేనా పాంథులకు కేరడముగాక || OrucukOvE yeTTayinA (Raagam: ) (Taalam: ) pa|| OrucukOvE yeTTayinA vuvida nIvu | nErupari nI viBuDu nEDE vaccI nIDaku || ca|| kaluvala vEsitEnE kAmuDu cuTTamu gADA | velayu virahulaku vegaTu gAka | calivennela gAsitE caMduruDu pagavADA | polayalu kalavArE pogaDarugAka || ca|| kosarucu bADitEnE kOyila guMDe bedarA | asadu virahulu kAdaMduru gAka | musaritE dummida mUkalu dayalEnivA | visigina kAmukulE vinalEru gAka || ca|| vanamu siMgAriMcitE vasaMtuDu kRUruDA | vonar...

OhO DEMDEM - ఓహో డేండేం

ఓహో డేండేం (రాగం: ) (తాళం : ) ప|| ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని | సాహసమున శ్రుతి దాటెడిని || చ|| పరమున నరము బ్రకృతియు ననగా | వెరవుదెలియుటే వివేకము | పరము దేవుడును అపరము జీవుడు | తిరమైన ప్రకృతియె దేహము || చ|| జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును | పూని తెలియుటే యోగము | జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ | జ్ఞానగమ్యమే సాధించుమనసు || చ|| క్షరము నక్షరమును సాక్షి పురుషుడని | సరవి దెలియుటే సాత్వికము | క్షరము ప్రపంచ, మక్షరము కూటస్థుడు | సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు || OhO DEMDEM (Raagam: ) (Taalam: ) pa|| OhO DEMDEM vogi brahma midiyani | sAhasamuna Sruti dATeDini || ca|| paramuna naramu brakRutiyu nanagA | veravudeliyuTE vivEkamu | paramu dEvuDunu aparamu jIvuDu | tiramaina prakRutiye dEhamu || ca|| j~jAnamu j~jEyamu j~jAnagamyamunu | pUni teliyuTE yOgamu | j~jAnamu dEhAtma, j~jEyamu paramAtma | j~jAnagamyamE sAdhiMcumanasu || ca|| kSharamu nakSharamunu sAkShi puruShuDani | saravi deliyuTE sAtvikamu | kSharamu prapaMca, makSharamu kUTasthuDu | siripuruShOttamuDE SrI vEMkaTESuDu || ...

O pavanAtmaja - ఓ పవనాత్మజ

ఓ పవనాత్మజ (రాగం: ) (తాళం : ) ప|| ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా చ1|| ఓ హనుమంతుడ ఉదయాచల ని- ర్వాహక నిజ సర్వ ప్రబలా దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా || చ2|| ఓ రవి గ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా దారుణపు వినతా తనయాదులు గారవింప నిటు కలిగితిగా|| చ3|| ఓ దశముఖ హర ఓ వేంకటపతి- పాదసరోరుహ పాలకుడా ఈ దేహముతో ఇన్నిలోకములు నీదేహమెక్క నిలిచితిగా || O pavanAtmaja (Raagam: ) (Taalam: ) pa|| O pavanAtmaja O ghanuDA bApu bApanagA parigitigA ca1|| O hanumaMtuDa udayAchala ni- rwAhaka nija sarwa prabalA dEhamu mOcina teguvaku niTuvale sAhasa miTuvale chATitigA || ca2|| O ravi grahaNa OdanujAMtaka mArulEka mati malasitigA dAruNapu vinatA tanayAdulu gAraviMpa niTu kaligitigA|| ca3|| O daSamukha hara O vEMkaTapati- pAdasarOruha pAlakuDA I dEhamutO innilOkamulu nIdEhamekka nilichitigA || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

osagitivinniyu - ఒసగితివిన్నియు

ఒసగితివిన్నియు (రాగం: ) (తాళం : ) ప|| ఒసగితివిన్నియు ఒకమాటే | వెసనిక జేసే విన్నపమేది || చ|| నారాయణ నీ నామమె తలచిన | నీరాని వరము లిచ్చితివి | చేరి నిన్నిట సేవించిన నిక | కోరి పడయనిక కోరికలేవి || చ|| హరి నీ కొకమరి యటు శరణంటే | గరిమల నన్నిటు గాచితివి | నిరతముగా నిక నుతియింపుచు | అర గొరతని నిను అడిగేదో || చ|| శ్రీ వేంకటేశ్వర చేయెత్తి మ్రొక్కిన | భావమె నీవై పరగితివి | ఈ వరుసల నీవింతటి దాతవు | ఆవాలనిను కొనియాడేడి దేమి || osagitivinniyu (Raagam: ) (Taalam: ) pa|| osagitivinniyu okamATE | vesanika jEsE vinnapamEdi || ca|| nArAyaNa nI nAmame talacina | nIrAni varamu liccitivi | cEri ninniTa sEviMcina nika | kOri paDayanika kOrikalEvi || ca|| hari nI kokamari yaTu SaraNaMTE | garimala nanniTu gAcitivi | niratamugA nika nutiyiMpucu | ara goratani ninu aDigEdO || ca|| SrI vEMkaTESvara cEyetti mrokkina | BAvame nIvai paragitivi | I varusala nIviMtaTi dAtavu | Avaalaninu koniyADEDi dEmi ||

orasi cUDabOtE - ఒరసి చూడబోతే

ఒరసి చూడబోతే (రాగం: ) (తాళం : ) ప|| ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు | పొరల మేను ధరించి పొరలగ బట్టెను || చ|| పాతకములటకొన్ని బలు పుణ్యాలట కొన్ని | యీతల స్వర్గనరకాలిచ్చేనట | యేతుల నందుగొన్నాళ్ళు యిందు గొన్నాళ్ళు దేహికి | పోతరించి కాతరించి పొరలనే పట్టెను || చ|| పొలతులట కోందరు పురుషులట కొందరు | వెలుగును జీకట్లు విహారమట | కలవరింతలుగొంత ఘన సంసారము గొంత | పొలసి జీవులు రెంటా బొరలగ బట్టెను || చ|| ఒక్కవంక జ్ఞానమట వొక్కవంక గర్మమట | మొక్కి యిహపరాలకు మూలమిదట | తక్కక శ్రీ వేంకటేశు దాసులై గెలిచిరట | పుక్కిట నిన్నాళ్ళు రెంటా బొరలగ బట్టెను || orasi cUDabOtE (Raagam: ) (Taalam: ) pa|| orasi cUDabOtE nokaTI nijamu lEdu | porala mEnu dhariMci poralaga baTTenu || ca|| pAtakamulaTakonni balu puNyAlaTa konni | yItala svarganarakAliccEnaTa | yEtula naMdugonnALLu yiMdu gonnALLu dEhiki | pOtariMci kAtariMci poralanE paTTenu || ca|| polatulaTa kOMdaru puruShulaTa koMdaru | velugunu jIkaTlu vihAramaTa | kalavariMtalugoMta Gana saMsAramu goMta | polasi jIvulu reMTA boralaga baTTenu || ca|| okkavaMka j~jA...

oppulai noppulai - ఒప్పులై నొప్పులై

ఒప్పులై నొప్పులై (రాగం: ) (తాళం : ) ప|| ఒప్పులై నొప్పులై వుండుగాన | అప్పటికి జూడ నదియేకా నిజము || చ|| కన్నుల కిన్నియు జూడ కలలై వలలై | వున్నతాలు నడ్డాలై వుండుగాన | చిన్నచిన్న చిటిపొటి చిమ్ముదొమ్ముదిమ్ములవి | వున్నవన్నియు జూడ నొకటేకా నిజము || చ|| సారెకు నోరికి జూడ చవులై నవ్వులై | వూరటమాటలై వుండుగాన | తారుమారు తాకుసోకు తప్పుదోపులన్నియు | వోరపారులేనివెల్ల నొక్కటేకా నిజము || చ|| మేనికి నిన్నియు జూడ మృదువై పొదువై | పూని సంపదలై వుండుగాన | తేనై తీపై తిరువేంకటేశ నిన్ను | కానవచినదే నొక్కటేకా నిజము || oppulai noppulai (Raagam: ) (Taalam: ) pa|| oppulai noppulai vuMDugAna | appaTiki jUDa nadiyEkA nijamu || ca|| kannula kinniyu jUDa kalalai valalai | vunnatAlu naDDAlai vuMDugAna | cinnacinna ciTipoTi cimmudommudimmulavi | vunnavanniyu jUDa nokaTEkA nijamu || ca|| sAreku nOriki jUDa cavulai navvulai | vUraTamATalai vuMDugAna | tArumAru tAkusOku tappudOpulanniyu | vOrapArulEnivella nokkaTEkA nijamu || ca|| mEniki ninniyu jUDa mRuduvai poduvai | pUni saMpadalai vuMDugAna | tEnai tIpai tiru...

Olladugaaka daehi - ఒల్లడుగాక దేహ

ఒల్లడుగాక దేహ (రాగం:లలిత ) (తాళం : ) ఒల్లడుగాక దేహి వుద్యోగించడుగాక కొల్లలైనమేలు తనగుణములో నున్నది తలచుకొంటేజాలు దైవమేమి దవ్వా నిలుచుక తనలోనే నిండుకున్నాడు చలపట్టితేజాలు సర్గ మేమి బాతా చలివేడినాలికపై సత్యములో నున్నాడు ఆయమెఱిగితే జాలు నాయుష్యము గరవా కాయపుటూపిరిలోనే గని వున్నది చేయబోతే పుణ్యుడుగా జీవునికి దడవా చేయుర గర్మము తనచేతిలోనే వున్నది మొక్క నేరిచితే జాలు మోక్షమేమి లేదో యెక్కువశ్రీవేంకటేశుడిదె వున్నాడు దక్కగొంటేజాలు పెద్దతనమేమి యరుదా తక్కక శాంతముతోడిదయ లోన నున్నది Olladugaaka daehi (Raagam: Lalita) (Taalam: ) Olladugaaka daehi vudyogimchadugaaka Kollalainamaelu tanagunamulo nunnadi Talachukomtaejaalu daivamaemi davvaa Niluchuka tanalonae nimdukunnaadu Chalapattitaejaalu sarga maemi baataa Chalivaedinaalikapai satyamulo nunnaadu Aayame~rigitae jaalu naayushyamu garavaa Kaayaputoopirilonae gani vunnadi Chaeyabotae punyudugaa jeevuniki dadavaa Chaeyura garmamu tanachaetilonae vunnadi Mokka naerichitae jaalu mokshamaemi laedo Yekkuvasreevaemkataesudide vunnaadu Dakkagomtae...