OrucukOvE yeTTayinA - ఓరుచుకోవే యెట్టయినా
ఓరుచుకోవే యెట్టయినా (రాగం: ) (తాళం : ) ప|| ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు | నేరుపరి నీ విభుడు నేడే వచ్చీ నీడకు || చ|| కలువల వేసితేనే కాముడు చుట్టము గాడా | వెలయు విరహులకు వెగటు గాక | చలివెన్నెల గాసితే చందురుడు పగవాడా | పొలయలు కలవారే పొగడరుగాక || చ|| కొసరుచు బాడితేనే కోయిల గుండె బెదరా | అసదు విరహులు కాదందురు గాక | ముసరితే దుమ్మిద మూకలు దయలేనివా | విసిగిన కాముకులే వినలేరు గాక || చ|| వనము సింగారించితే వసంతుడు కౄరుడా | వొనరని విరహుల కొంటదుగాక | యెనసి శ్రీ వేంకటేశుడేలె నిన్ను చిలుకలు | కినిసేనా పాంథులకు కేరడముగాక || OrucukOvE yeTTayinA (Raagam: ) (Taalam: ) pa|| OrucukOvE yeTTayinA vuvida nIvu | nErupari nI viBuDu nEDE vaccI nIDaku || ca|| kaluvala vEsitEnE kAmuDu cuTTamu gADA | velayu virahulaku vegaTu gAka | calivennela gAsitE caMduruDu pagavADA | polayalu kalavArE pogaDarugAka || ca|| kosarucu bADitEnE kOyila guMDe bedarA | asadu virahulu kAdaMduru gAka | musaritE dummida mUkalu dayalEnivA | visigina kAmukulE vinalEru gAka || ca|| vanamu siMgAriMcitE vasaMtuDu kRUruDA | vonar...