nIvE kAviMka - నీవే కావింక
నీవే కావింక (రాగం: ) (తాళం : ) ప|| నీవే కావింక నేనన్య మెరగ యే- | త్రోవ చూపి నాకు దోడయ్యెదవయ్య || చ|| అపరాధశత కోట్లయినవి వొక్క- | నెపమున నను గవనేరవా | అపరిమితదురితా లైనవి యే- | ఉపమచేత నన్ను నుద్ధరించెదవయ్య || చ|| అతిశయముగ గర్మినైతిని నీ- | మతము నాకొకయింత మరపవా | ఇతరకర్మారంభహితుడను | గతి మోక్షమెటువలె గల్పించెదవయ్య || చ|| తిరువేంకటాచలాధీశ్వరా నీ- | శరణాగతుల బ్రోవజాలవా | పరమదయానందపరుడవు యే- | వెరవున భవములు వెడలద్రోచెదవయ్య || nIvE kAviMka (Raagam: ) (Taalam: ) pa|| nIvE kAviMka nEnanya meraga yE- | trOva cUpi nAku dODayyedavayya || ca|| aparAdhaSata kOTlayinavi vokka- | nepamuna nanu gavanEravA | aparimitaduritA lainavi yE- | upamacEta nannu nuddhariMcedavayya || ca|| atiSayamuga garminaitini nI- | matamu nAkokayiMta marapavA | itarakarmAraMBahituDanu | gati mOkShameTuvale galpiMcedavayya || ca|| tiruvEMkaTAcalAdhISvarA nI- | SaraNAgatula brOvajAlavA | paramadayAnaMdaparuDavu yE- | veravuna Bavamulu veDaladrOcedavayya ||