Posts

Vaesaraku vee Daela - వేసరకు వీ డేల యనకుము

వేసరకు వీ డేల (రాగం: ) (తాళం : ) వేసరకు వీ డేల యనకుము విడువ నిన్నిక శరణు చొచ్చితి నీసరెవ్వరు లేరు వెదకిన నిండుబండికి జేట వేగా మీరు నాకు గలరు నేనేమి సేసిన గాతురనియెడి ధీరతను జము సరకు గొనకే తివిరి సేసితి బాపము॥ వోరసేయుచు నెంతలేదని వూరకే మీరుంటిరేనియు వారికివి గొరగాను॥ నేనెవ్వరిని నెఱగను మిమ్మేకాని॥ మిమ్ముగొలిచినగర్వమున నేమీ జేయక కాలమందే, నమ్మి కర్మములెల్ల మానితి నాకునాకే వేసరి॥ దొమ్మి కోపక మీకు నాకును దూరమనుచు బరాకుచేసిన యిమ్ములను నన్నవియు రోసును యేల నా కవి నీవేకాక॥ నీకు మొక్కినమందెమేళము నేనొక కొండసేసుక లోకములదేవతలకెల్లను లోను వెలిగా నైతి॥ యీకడను శ్రీవేంకటేశుడ యిప్పుడిటు ననుగరుణజూచితి చేకొనుచు వారె మెత్తురు చెలగి నీకింకరుడననుచు Vaesaraku vee (Raagam: ) (Taalam: ) Vaesaraku vee Daela yanakumu viduva ninnika saranu chochchiti Neesarevvaru laeru vedakina nimdubamdiki jaeta vaegaa Meeru naaku galaru naenaemi saesina gaaturaniyedi Dheeratanu jamu saraku gonakae tiviri saesiti baapamu Vorasaeyuchu nemtalaedani voorakae meerumtiraeniyu Vaarikivi goragaanu naenevvarini ne~raganu m...

Vae~rokachota laedu - వేఱొకచోట లేడు

వేఱొకచోట లేడు (రాగం:లలిత ) (తాళం : ) వేఱొకచోట లేడు వీడివో హరి వీఱిడియై చేరువనే వీడివో హరి. మునుకొని వెదకితే ముక్కుమార్పుగాలికొన వెనవెనక దిరిగీ వీడివో హరి పెనగి వెదకబోతే పెడచెవులమంత్రమై వినవచ్చీ మాటలలో వీడివో హరి. సోదించి వెదకితేను చూపులకొనలనే వీదుల నెందు చూచినా వీడివో హరి ఆదిగొని వెదకితే నట్టే నాలికకొన వేదమై నిలిచినాడు వీడివో హరి. తెలిసి వెదకబోతే దేహపుటంతరాత్మయై వెలుపలా లోపలాను వీడివో హరి చెలగి శ్రీవేంకటాద్రి చేకొని మమ్ము రక్షించ వెలసె నిందరు జూడ వీడివో హరి. Vae~rokachota (Raagam:Lalita ) (Taalam: ) Vae~rokachota laedu veedivo hari Vee~ridiyai chaeruvanae veedivo hari. Munukoni vedakitae mukkumaarpugaalikona Venavenaka dirigee veedivo hari Penagi vedakabotae pedachevulamamtramai Vinavachchee maatalalo veedivo hari. Sodimchi vedakitaenu choopulakonalanae Veedula nemdu choochinaa veedivo hari Aadigoni vedakitae nattae naalikakona Vaedamai nilichinaadu veedivo hari. Telisi vedakabotae daehaputamtaraatmayai Velupalaa lopalaanu veedivo hari Chelagi sreevaemkataadri chaekoni mam...

Vaevaelu bamdhamulu - వేవేలు బంధములు

వేవేలు బంధములు (రాగం:శంకరాభరణం ) (తాళం : ) వేవేలు బంధములు విడువ ముడువబట్టె దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా పారీ ముందటిభవపాశములు తీరీ దొల్లిటితిత్తిలో పుణ్యము వూరీ గోరిక లొకటొకటే యేరీతి సుజ్ఞాన మెరిగేనయ్యా పట్టీ నాకొంగు పంచేంద్రియములు తొట్టీ బాపము తోడుతనే పెట్టీ భ్రమల బెరిగి నీమాయలు అట్టే మోక్ష మెన్నడందేమయ్యా విందై యిహము వెనకకు దీసీ అందీ వైరాగ్య మరచేతికి కందువ శ్రీవేంకటపతి యీ రెండు బొందించితి వేది భోగింతునయ్యా Vaevaelu bamdhamulu (Raagam: Samkaraabharanam) (Taalam: ) Vaevaelu bamdhamulu viduva muduvabatte Daivamaa ninnettu tagilaemayyaa Paaree mumdatibhavapaasamulu Teeree dollititittilo punyamu Vooree gorika lokatokatae Yaereeti suj~naana merigaenayyaa Pattee naakomgu pamchaemdriyamulu Tottee baapamu todutanae Pettee bhramala berigi neemaayalu Attae moksha mennadamdaemayyaa Vimdai yihamu venakaku deesee Amdee vairaagya marachaetiki Kamduva sreevaemkatapati yee remdu Bomdimchiti vaedi bhogimtunayyaa

vELagAdu siggulaku - వేళగాదు సిగ్గులకు

వేళగాదు సిగ్గులకు (రాగం: ) (తాళం : ) ప|| వేళగాదు సిగ్గులకు విచ్చనవిడింతే కాని | గోలతనమిపుడేలే కొంగుపట్టీ నతడు || చ|| తమకించి నపుడే తతియాయ రతులకు | సుముఖుడైనపుడే సూటి మాటకు | చెమరించినపుడే చేతలకెల్లా లోను | కొమరె వేల లోగేవే కొంగువట్టీ నతడు || చ|| అంట జూచినపుడే అదనట్టే నవ్వులకు | వెంట వచ్చినపుడే విందుమోవికి | నంటు సేసుకున్నప్పుడే నయము కోరికలకు | దంటవు యేల కొంకేవే దక్కగొనీ నతడు || చ|| ఆయములంటినప్పుడే అనువు నీ పంతాలకు | చాయ సేసుకొన్నపుడే చవి కౌగిలి | యీయెడ నలమేల్మంగ ఇదిగో శ్రీ వేంకటేశు- | నోయమ్మ కూడితివి నీ వొడి వట్టెనతడు || vELagAdu siggulaku (Raagam: ) (Taalam: ) pa|| vELagAdu siggulaku viccanaviDiMtE kAni | gOlatanamipuDElE koMgupaTTI nataDu || ca|| tamakiMci napuDE tatiyAya ratulaku | sumuKuDainapuDE sUTi mATaku | cemariMcinapuDE cEtalakellA lOnu | komare vEla lOgEvE koMguvaTTI nataDu || ca|| aMTa jUcinapuDE adanaTTE navvulaku | veMTa vaccinapuDE viMdumOviki | naMTu sEsukunnappuDE nayamu kOrikalaku | daMTavu yEla koMkEvE dakkagonI nataDu || ca|| AyamulaMTinappuDE anuvu nI ...

vEMkaTagiri gOviMduDA - వేంకటగిరి గోవిందుడా

వేంకటగిరి గోవిందుడా (రాగం: ) (తాళం : ) ప|| వేంకటగిరి గోవిందుడా | యింకా నొకరో యిద్దరో మీరు || చ|| పచ్చలు దాచిన బాహుపురులతో | అచ్చపు గరముల అందముతో | అచ్చలు నిచ్చలు నలరుదురిదివో | నిచ్చలు నీవో నీవో కానీ || చ|| నిలుచుండుటయును నెరి బవళింపుచు | నలరుటయును మీరటునిటును | జలజాక్షులు దొడ చరచగ నొరపుల | వెలయగ నిద్రో విభవమిదో || చ|| తిరువేంకటగిరి దిగువ తిరుపతిని | పరమానందపు బహుసిరులు | అరుదుగ బొందుచు అధికము లందుచు | ఉరగశయనుడవొ వొడయడవో || vEMkaTagiri (Raagam: ) (Taalam: ) pa|| vEMkaTagiri gOviMduDA | yiMkA nokarO yiddarO mIru || ca|| paccalu dAcina bAhupurulatO | accapu garamula aMdamutO | accalu niccalu nalaruduridivO | niccalu nIvO nIvO kAnI || ca|| nilucuMDuTayunu neri bavaLiMpucu | nalaruTayunu mIraTuniTunu | jalajAkShulu doDa caracaga norapula | velayaga nidrO viBavamidO || ca|| tiruvEMkaTagiri diguva tirupatini | paramAnaMdapu bahusirulu | aruduga boMducu adhikamu laMducu | uragaSayanuDavo voDayaDavO ||

vEDukoMdAmA - వేడుకొందామా

వేడుకొందామా (రాగం: ) (తాళం : ) ప|| వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని || చ|| ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు | తోమని పళ్యాలవాడె దురిత దూరుడే || చ|| వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు | గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే || చ|| ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు | అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే || vEDukoMdAmA (Raagam: ) (Taalam: ) pa|| vEDukoMdAmA vEMkaTagiri vEMkaTESvaruni || ca|| AmaTi mrokkula vADe AdidEvuDE vADu | tOmani paLyAlavADe durita dUruDE || ca|| vaDDikAsula vADe vanajanABuDE puTTu | goDDurAMDraku biDDaliccE gOviMduDE || ca|| elimi gOrina varAliccE dEvuDE vADu | alamElmaMgA SrIvEMkaTAdri nAthuDE || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA Sung by:Sobha Raju Get this widget | Track details | eSnips Social DNA Vedukondama.mp3 Get this widget | Track details | eSnips Social DNA

vEdana boralE - వేదన బొరలే

వేదన బొరలే (రాగం: ) (తాళం : ) ప|| వేదన బొరలే వెరవేలా | యీదయ విధి దనకీయదా || చ|| తత్తరపాట్ల తనువికారముల | జిత్తము దెంచేచెలువేలా | బత్తితో దాచిన పరధనంబుగొని | సత్తయు వుండుట చాలదా || చ|| యెక్కువతమకపుటింతుల బొందక | వక్కుచువాడే వయసేలా | మొక్కుచు దాచిన మూలధనము గన- | నెక్కువ దైవంబియ్యదా || చ|| సేతల బొరలెడి చిక్కుల గెరలెడి- | రోతల యీనేరుపులేలా | బాతిగ వేంకటపతిరతి జిత్తపు- | టూతల గోరిక లూనవా || vEdana boralE (Raagam: ) (Taalam: ) pa|| vEdana boralE veravElA | yIdaya vidhi danakIyadA || ca|| tattarapATla tanuvikAramula | jittamu deMcEceluvElA | battitO dAcina paradhanaMbugoni | sattayu vuMDuTa cAladA || ca|| yekkuvatamakapuTiMtula boMdaka | vakkucuvADE vayasElA | mokkucu dAcina mUladhanamu gana- | nekkuva daivaMbiyyadA || ca|| sEtala boraleDi cikkula geraleDi- | rOtala yInErupulElA | bAtiga vEMkaTapatirati jittapu- | TUtala gOrika lUnavA ||