suvvi suvvi suvvani - సువ్వి సువ్వి సువ్వని
సువ్వి సువ్వి (రాగం: ) (తాళం : ) ప|| సువ్వి సువ్వి సువ్వి సువ్వని | సుదతులు దంచెద రోలాల || చ|| వనితలు మనసులు కుందెన చేసిటు | వలపులు తగనించోలాల | కనుచూపు లనెడు రోకండ్లను | కన్నెలు దంచెద రోలాల || చ|| బంగరు చెరుగుల పట్టు పుట్టములు | కొంగులు దూలగ నోలాల | అంగనలందరు నతివేడుకతో | సంగడి దంచెద రోలాల || చ|| కురులు దూలగ మంచి గుబ్బచనులపై | సరులు దూలాడగ నోలాల | అరవిరి బాగుల నతివలు ముద్దులు | గురియుచు దంచెద రోలాల || చ|| ఘల్లు ఘల్లుమను కంకణరవముల | పల్లవపాణుల నోలాల | అల్లన నడుములు అసియాడుచు సతు | లొల్లనె దంచెద రోలాల || చ|| కప్పురగంధులు కమ్మనిపువ్వుల | చప్పరములలో నోలాల | తెప్పలుగా రతి దేలుచు గోనే- | టప్పని బాడెద రోలాల || suvvi suvvi (Raagam: ) (Taalam: ) pa|| suvvi suvvi suvvi suvvani | sudatulu daMceda rOlAla || ca|| vanitalu manasulu kuMdena cEsiTu | valapulu taganiMcOlAla | kanucUpu laneDu rOkaMDlanu | kannelu daMceda rOlAla || ca|| baMgaru cerugula paTTu puTTamulu | koMgulu dUlaga nOlAla | aMganalaMdaru nativEDukatO | saMgaDi daMceda rOlAla || ca|| kurulu dUlaga maMci gubbacanulapai | ...