Vinayaka Vrata Dandakam - విఘ్నేశ్వర దండకం
Sri Siddhi Vinayaka Vrata Dandakam – విఘ్నేశ్వర దండకం, మంగళహారతులు విఘ్నేశ్వర దండకం శ్రీపార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేభవక్త్రా మహాకాయ కాత్యాయనీనాథసంజాత స్వామీ శివా సిద్ధివిఘ్నేశ నీ పాదపద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జురూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ కుంకుమంబక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులున్ మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పునుగులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్ నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరు బళ్ళెమందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబ...