Chuda juda manikyalu - చూడ జూడ మాణిక్యాలు

Chuda juda manikyalu - చూడ జూడ మాణిక్యాలు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by VANI JAYARAM:

చూడ జూడ మాణిక్యాలు (రాగం: ) (తాళం : )

ప|| చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి | 

యీడులేని కన్నులెన్నులవె యినచంద్రులు ||

చ|| కంటి గంటి వాడె వాడె ఘనమైనముత్యాల | 

కంటమాలలవే పదకములు నవె |
మింటిపొడవై నట్టిమించుగిరీటం బదె | 

జంటల వెలుగు శంఖచక్రాలవె ||

చ|| మొక్కు మొక్కు వాడె వాడె ముందరనే వున్నాడు | 

చెక్కులవే నగవుతో జిగిమోమదె |
పుక్కిట లోకములవె భుజకీర్తులును నవె | 

చక్కనమ్మ అలమేలు జవరాలదె ||

చ|| ముంగైమురాలును నవె మొల కఠారును నదె | 

బంగరునిగ్గులవన్నె పచ్చబట్టదె |
ఇంగితమెరిగి వేంకటేశుడిదె కన్నులకు | 

ముంగిట నిధానమైన మూలభూత మదే ||


cUDa jUDa mANikyAlu (Raagam: ) (Taalam: )

pa|| cUDa jUDa mANikyAlu cukkalavale nunnavi | 

yIDulEni kannulennulave yinacaMdrulu ||

ca|| kaMTi gaMTi vADe vADe GanamainamutyAla | 

kaMTamAlalavE padakamulu nave |
miMTipoDavai naTTimiMcugirITaM bade | 

jaMTala velugu SaMKacakrAlave ||

ca|| mokku mokku vADe vADe muMdaranE vunnADu |
 

cekkulavE nagavutO jigimOmade |

pukkiTa lOkamulave BujakIrtulunu nave | 

cakkanamma alamElu javarAlade ||

ca|| muMgaimurAlunu nave mola kaThArunu nade | 

baMgAruniggulavanne paccabaTTade |
iMgitamerigi vEMkaTESuDide kannulaku | 

muMgiTa nidhAnamaina mUlaBUta madE ||