pADarE sObanAlu paDatulArA - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english


ప|| పాడరే సోబనాలు పడతులారా |
వేడుక లిద్దరిని వెలసెజూడరే ||

చ|| కొండలే పీటలుగా కూచున్నారెదురుబడి |
అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు |
వెండిపైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల |
పెండిలాడే రిద్దరును ప్రియమున చూడరే ||


చ|| భవనాశిజలముల పాయక తోడనీళ్ళాడిరి |
ఇవలా నవలా తాము ఏటిదరుల |
జవళి మంచిపూవుల సరిసేసలు వెట్టుచు |
తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు ||

చ|| పొందుగ కనకావతి భోగవతి నదుల |
సందడి వసంతముగా జల్లులాడుచు |
అందమై శ్రీవేంకటాద్రి అహోబలాన ఒక |
చందమున కూడి సరసములాడేరు ||


pa|| pADarE sObanAlu paDatulArA |
vEDuka liddarini velasejUDarE ||

ca|| koMDalE pITalugA kUcunnAredurubaDi |
aMDanE nArasiMhuDu AdilakShmiyu |
veMDipaiDi niMDukonna vEdAdri garuDAdrula |
peMDilADE riddarunu priyamuna cUDarE ||

ca|| BavanASijalamula pAyaka tODanILLADiri |
ivalA navalA tAmu ETidarula |
javaLi maMcipUvula sarisEsalu veTTucu |
tavili sumuhUrtAna tappaka cUcEru ||

ca|| poMduga kanakAvati BOgavati nadula |
saMdaDi vasaMtamugA jallulADucu |
aMdamai SrIvEMkaTAdri ahObalAna oka |
caMdamuna kUDi sarasamulADEru ||


Sung by:Sri Balakrishna Prasad

Popular posts from this blog

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న