Annitaa sreeharidaasudagu - అన్నిటా శ్రీహరిదాసుడగు

రాగమ్: రామక్రియ

అన్నిటా శ్రీహరిదాసుడగువానికి కొన్నిదైవముల గొలువగ దగునా

విహితకర్మముసేసి వెదకేటిహరి నిట్టె సహజమై కొలచేతిసరసునికి గహనపుగర్మాలు కడమలైన నేమి మహి గనకాద్రికి మరి పైడి వలెనా

పలుదానములకెల్ల బలమైనహరి నిట్టె బలువుగ జేకొన్న భక్తునికిని నెలకొని యాత డన్నియును జేసినవాడె తెలిసి సూర్యుని జూడ దీపాలు వలెనా

వేదవేద్యుడు శ్రీవేంకటపతి రామ మాదిగా బఠియించే యధికునికి ఆదైవచదువులు అఱచేతి వతనికి మేదిని దిరుగాడ మెట్లు వలెనా

Raagam:Raamakriya

Annitaa sreeharidaasudaguvaaniki Konnidaivamula goluvaga dagunaa

Vihitakarmamusesi vedaketihari nitte Sahajamai kolachetisarasuniki Gahanapugarmaalu kadamalaina nemi Mahi ganakaadriki mari paidi valenaa

Paludaanamulakella balamainahari nitte Baluvuga jekonna bhaktunikini Nelakoni yaata danniyunu jesinavaade Telisi sooryuni jooda deepaalu valenaa

Vedavedyudu sreevenkatapati raama Maadigaa bathiyimche yadhikuniki Aadaivachaduvulu aracheti vataniki Medini dirugaada metlu valenaa