eTTucEsina jEse - ఎట్టుచేసిన జేసె
ఎట్టుచేసిన జేసె (రాగం: ) (తాళం : ) ప|| ఎట్టుచేసిన జేసె నేమిసేయగవచ్చు | చుట్టపువిరోధంబు సూనాస్త్రుచెలిమి || చ|| ఒడలిలోపలిరోగ మొనర బరితాపంబు | కడుపులోపలిపుండు కడలేనియాస | తడిపాతమెడగోత తలపువిషయాసక్తి | గుడిమీదితరువు అలుగులము ప్రాణులకు || చ|| నీడలోపలయెండ నెలకొన్నబంధంబు | గోడపైసున్నంబు కొదలేనియెఱుక | పాడూరిలో బ్రదుకు పాపకర్మబుద్ధి | తాడుపైతపసు తమధనము ప్రాణులకు || చ|| మంటజేసినబొమ్మమనికి సంసారంబు | రెంటికినిగానివీరిడికొలువు బ్రదుకు | యింటివేలుపు వేంకటేశు గొలువక పరుల- | వెంట దిరుగుట వోడవిడిచి వదరిడుట || eTTucEsina jEse (Raagam: ) (Taalam: ) pa|| eTTucEsina jEse nEmisEyagavaccu | cuTTapuvirOdhaMbu sUnAstrucelimi || ca|| oDalilOpalirOga monara baritApaMbu | kaDupulOpalipuMDu kaDalEniyAsa | taDipAtameDagOta talapuviShayAsakti | guDimIditaruvu alugulamu prANulaku || ca|| nIDalOpalayeMDa nelakonnabaMdhaMbu | gODapaisunnaMbu kodalEniyerxuka | pADUrilO braduku pApakarmabuddhi | tADupaitapasu tamadhanamu prANulaku || ca|| maMTajEsinabommamaniki saMsAraMbu | reMTikinigAnivIriDikoluvu bradu...