Ekkada ni vudyogamu - ఎక్కడ నీ వుద్యోగము

Ekkada ni vudyogamu - ఎక్కడ నీ వుద్యోగము | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by VANI JAIRAM:

ఎక్కడ నీ వుద్యోగము (రాగం:రామక్రియ ) (తాళం : )

ఎక్కడ నీ వుద్యోగ మెటు విచ్చేసేవయ్యా

యిక్కువ నీమహిమకు నెవ్వ రెదురయ్యా ॥పల్లవి॥


పల్లించి గరుడనిపై నీ వుబ్బుననెక్క

అల్లనాఁడె పారిజాత మడవికెక్కె

పల్లదపురుద్రుఁడును బాణునివాకిలి దొక్కె

చుల్లరి రాక్షసమూఁక సురసుర సుక్కె ॥ఎక్కడ॥


గరుడినిపై నీవు కడుఁబేరెములవార

ధరజలధరుల నమృతములు దేరె

నిరతిఁ గంసాదులనెత్తురు టేరులు వారె

పరులు నీకెదిరిన పగయెల్ల దీరె ॥ఎక్కడ॥


బంగారు గరుడనిపై నీవు వీదులేఁగ

చెంగట శ్రీ వేంకటేశ సిరులుమూఁగె

సంగతి నలమేల్మంగ సంతసాన విఱవీగె

పొంగారు దేవదుందుభులు పై పై వాఁగె ॥ఎక్కడ॥

ekkaDa nI vudyOgamu (Raagam:rAmakriya ) (Taalam: )

ekkaDa nI vudyOga meTu vichchEsEvayyA

yikkuva nImahimaku nevva redurayyA ॥pallavi॥


palliMchi garuDanipai nI vubbunanekka

allanA@MDe pArijAta maDavikekke

palladapurudru@MDunu bANunivAkili dokke

chullari rAkshasamU@Mka surasura sukke ॥ekkaDa॥


garuDinipai nIvu kaDu@MbEremulavAra

dharajaladharula namRtamulu dEre

nirati@M gaMsAdulanetturu TErulu vAre

parulu nIkedirina pagayella dIre ॥ekkaDa॥


baMgAru garuDanipai nIvu vIdulE@Mga

cheMgaTa SrI vEMkaTESa sirulumU@Mge

saMgati nalamElmaMga saMtasAna vi~ravIge

poMgAru dEvaduMdubhulu pai pai vA@Mge ॥ekkaDa॥