Polayaluka nidduralu - పొలయలుక నిద్దురలు
Polayaluka nidduralu - పొలయలుక నిద్దురలు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by VANI JAIRAM:
పొలయలుక నిద్దురలు భోగించ దొరకొంటి
అలర వడి మేల్కొనవె అఖిలేశ్వర ॥పల్లవి॥
తరుణిమైనపుడె పరితాప సూర్యుఁడు వొడిచె
వరుసఁ జెలి కన్నుఁగలువలు మొగిచెను
మరుని సాయకపు తామరలు వికసించె
కరుణతో మేల్కొనవె కమలేశ్వర ॥పొల॥
కాంత నిట్లూర్పులను గాలియును నగ్నియును
వంత చెమటలవాన వరుణుండును
వింతలుగ నిన్ను సేవింతుమని యున్నారు
పంతమున మేల్కోనవె పరమేశ్వర ॥పొల॥
మెలుఁత పెనుఁదురుమనెడి మేఘమండలములో
నలుగడలఁ జెలఁగె సుమనసపంక్తులు
కులికి పూవులవాన గురియంగ నున్న దిదే
చలముడిగి మేల్కొనవె సర్వేశ్వర ॥పొల॥
కదిసి పులకలసృష్టి కడలేక పొడమించు
మదనుఁడను మానస కమల భవుఁడును
ముదిత కోపపుహరుఁడు మొనసి యున్నారిదే
నిదుర మేల్కొనవె జలనిధిశయనుఁడ ॥పొల॥
ఒడికముగఁ జెలిలోన నుదయరాగము వొడమె
వెడలె నదె పలుకుఁ గోవిలరవములు
పడఁతిఁ గూడితివి రవి పరవశం బిఁకనైన
కడఁగి మేల్కనవె వేంకటరమణుఁడ ॥పొల॥
polayaluka nidduralu bhOgiMcha dorakoMTi
alara vaDi mElkonave akhilESvara ॥pallavi॥
taruNimainapuDe paritApa sUryu@MDu voDiche
varusa@M jeli kannu@Mgaluvalu mogichenu
maruni sAyakapu tAmaralu vikasiMche
karuNatO mElkonave kamalESvara ॥pola॥
kAMta niTlUrpulanu gAliyunu nagniyunu
vaMta chemaTalavAna varuNuMDunu
viMtaluga ninnu sEviMtumani yunnAru
paMtamuna mElkOnave paramESvara ॥pola॥
melu@Mta penu@MdurumaneDi mEghamaMDalamulO
nalugaDala@M jela@Mge sumanasapaMktulu
kuliki pUvulavAna guriyaMga nunna didE
chalamuDigi mElkonave sarvESvara ॥pola॥
kadisi pulakalasRshTi kaDalEka poDamiMchu
madanu@MDanu mAnasa kamala bhavu@MDunu
mudita kOpapuharu@MDu monasi yunnAridE
nidura mElkonave jalanidhiSayanu@MDa ॥pola॥
oDikamuga@M jelilOna nudayarAgamu voDame
veDale nade paluku@M gOvilaravamulu
paDa@Mti@M gUDitivi ravi paravaSaM bi@Mkanaina
kaDa@Mgi mElkanave vEMkaTaramaNu@MDa ॥pola॥