Vanitaku bati kide - వనితకు బతి కిదె
Vanitaku bati kide - వనితకు బతి కిదె | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by P SUSHEELA, G NAGESWARA NAIDU:
॥పల్లవి॥ వనితకుఁ బతి కిదె వసంతము
దినదినము నమరె తిరుమలమీఁద
॥చ1॥ పుప్పొడి వసంతము పొసఁగె రమణునికి
కప్పురవసంతము కాంతకును
కొప్పెరల నెదురుగఁ గుంకుమ పన్నీరు నించి
కుప్పెలఁ జల్లులాడేరు కోనేటికాడ
॥చ2॥ జవ్వాదివసంతము చతురుఁడు గై కొనె
పువ్వుల వసంతము పొలఁతి కిదె
రవ్వగా బండ్లపై రాసులు వోసుక
నవ్వుతా వేటులాడేరు నడిమించింతాడ
॥చ3॥ గందపు వసంతముఁ గడు శ్రీవేంకటపతి
అందె కస్తూరివసంత మలమేల్మంగ
చిందుచుఁ దట్టుపుణుఁగు చిమ్ముచుఁ గూడాడేరు
సందడి సమరతుల సంపెఁగకాడ
|| Pallavi ||
vanitaku~ bati kide vasaMthamu
dinadinamu namare tirumalamee~da
|| Cha1 ||
puppoDi vasaMthamu posa~ge ramaNuniki
kappuravasaMthamu kAMtakunu
kopperala neduruga~ guMkuma panneeru niMchi
kuppela~ jallulAdEru kOnETikADa
|| Cha2 ||
javvAdivasaMthamu chaturu~du gaikone
puvvula vasaMthamu pola~ti kide
ravvagA baMDlapei rAsulu vOsuka
navvutA vETulAdEru naDimiMchiMtADa
|| Cha3 ||
gaMdapu vasaMthamu~ gaDu SreevEMkaTapati
aMde kastUrivasaMtha malamElmaMga
chiMduchu~ daTTupuNu~gu chimmuchu~ gUdAdEru
saMdaDi samaratula saMpe~gakADa