Varusato sasamukha - వరుసతో సాసముఖా
Varusato sasamukha - వరుసతో సాసముఖా | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by VANI JAIRAM:
వరుసతో సాసముఖా వసంతపూర్ణిమ నేఁడు
సిరుల యీ విభవాలు సేవించరో ॥పల్లవి॥
లలితపు గోవిందుఁడు లక్ష్మీమండపమందున్న
వలరాజదివో కొలువఁగ వచ్చెను
వెలిఁ జంద్రుఁడు తోడనే వెల్లగొడగటు వట్టె
సులభానఁ బవనుఁడు సురటి విసరెను ॥వరు॥
పొందుగా వసంతుఁడు పువ్వులఁ బూజించవచ్చె
కందువతోఁ దుమ్మిదలు గానముసేసె
సందడించి చిలుకలు చదువఁజొచ్చె పద్యాలు
గొందినే కట్టిగ వారై కోవిలలుగ్గడించె ॥వరు॥
రతిదేవి మొదలైన రమణులు నాట్యమాడి
రతివసంతమాడె మేఘావళి యెల్ల
తతి శ్రీ వెంకటగిరిఁ దావుకొని యిందునందూ
మితిమీరఁగా మొక్కేరు మెరసి దేవతలు ॥వరు॥
varusatO sAsamukhA vasaMtapUrNima nE@MDu
sirula yI vibhavAlu sEviMcharO ॥pallavi॥
lalitapu gOviMdu@MDu lakshmImaMDapamaMdunna
valarAjadivO koluva@Mga vachchenu
veli@M jaMdru@MDu tODanE vellagoDagaTu vaTTe
sulabhAna@M bavanu@MDu suraTi visarenu ॥varu॥
poMdugA vasaMtu@MDu puvvula@M bUjiMchavachche
kaMduvatO@M dummidalu gAnamusEse
saMdaDiMchi chilukalu chaduva@Mjochche padyAlu
goMdinE kaTTiga vArai kOvilaluggaDiMche ॥varu॥
ratidEvi modalaina ramaNulu nATyamADi
rativasaMtamADe mEghAvaLi yella
tati SrI veMkaTagiri@M dAvukoni yiMdunaMdU
mitimIra@MgA mokkEru merasi dEvatalu ॥varu॥