Vijayaputammu vese - విజయపుటమ్ము వేసె

Vijayaputammu vese - విజయపుటమ్ము వేసె | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by VANI JAIRAM:

విజయపుటమ్ము వేసె (రాగం:సామంతం ) (తాళం : )

॥పల్లవి॥ విజయపుటమ్ము వేసె వేంకటేశుఁడు

విజయుని సఖుఁడు యీ వేదమూరితి


॥చ1॥ పాఱితెంచి దశకంఠు పదిశిరసులమీఁద

ఆఱికినమ్ము వేసె నాదిదేవుఁడు

ఆఱడి సేనల తోడ నంబుధి మీఁద వేసె

వేఱొకయమ్ము దొడిగి విష్ణుదేవుఁడు


॥చ2॥ చాలుగ నేడుదాళ్లు సర్వము నొక్కటిగాఁగ

ఆలములో నమ్మువేసె నఖిలేశుఁడు

ఆలించి రుక్మిణిఁ బెండ్లి యాడునాఁడు వైరులపై

జాలియమ్ము వేసెను విజయకృష్ణుఁడు


॥చ3॥ భజన నిందిరఁగూడి పంతమున నమ్మువేసె

విజయదశమిని శ్రీవేంకటేశుఁడు

సుజనుల దేవతల సొరిది నిందరిఁ గాచు

విజయము చేకొనె విష్ణుదేవుఁడు

vijayapuTammu vese (Raagam:sAmaMtaM ) (Taalam: )

||pallavi||

vijayapuTammu vese veMkaTeShuDu

vijayuni sakhuDu yI vedamUriti


||cha1||

pARiteMchi dashakaMTha padishirasulamIda

ARikinammu vese nAdidevuDu

ARaDi senala tODa naMbudhi mIda vese

veRokayAmmu doDigi viShNudevuDu


||cha2||

chAluga nEDudALlu sarvamu nokkaTigAga

alamulO nammuvese nakhileshuDu

AliMchi rukmiNi beMDli yADunAdu vairulapai

jAliyAmmu vesenu vijayakriShNuDu


||cha3||

bhajana niMdiragUDi paMtamuna nammuvese

vijayadashamini shrIveMkaTeShuDu

sujanula devatala soridi niMdari gAchu

vijayamu chekone viShNudevuDu