Aina dedi kani - ఐన దేది కాని
Aina dedi kani - ఐన దేది కాని | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
ఐన దేది కాని దందులో నేది
నానారూపి శ్రీనాథుఁడె కాకా ॥పల్లవి॥
యెవ్వరి దూషించే మెవ్వరి భూషించే
మెవ్వరు స్వతంత్రు లిందులో
అవ్వల నివ్వల నంతరాత్ముఁడైన
యవ్వనజాక్షుని ననుట గాకా ॥ఐన॥
యెందుకుఁ గోపించే మెందుకు మెచ్చే
మెందుఁ గద్దు మే లిందులో
అందు నిందుఁ దానె యల్లుకొన్న
నందనందనునే నమ్ముట గాకా ॥ఐన॥
యేచోటు మంచిది యేచోటు చెడ్డది
యేచోటు సతమౌ నిందులో
కాచేటి శ్రీవెంకటనాథుఁడె
చేచేతఁ గాణాచై చెల్లించెఁ గాకా ॥ఐన॥
aina dEdi kAni daMdulO nEdi
nAnArUpi SrInAthu~De kAkA ॥pallavi॥
yevvari dUshiMchE mevvari bhUshiMchE
mevvaru svataMtru liMdulO
avvala nivvala naMtarAtmu~Daina
yavvanajAkshuni nanuTa gAkA ॥aina dEdi॥
yeMduku~ gOpiMchE meMduku mechchE
meMdu~ gaddu mE liMdulO
aMdu niMdu~ dAne yallukonna
naMdanaMdanunE nammuTa gAkA ॥aina dEdi॥
yEchOTu maMchidi yEchOTu cheDDadi
yEchOTu satamau niMdulO
kAchETi SrIveMkaTanAthu~De
chEchEta~ gANAchai chelliMche~ gAkA ॥aina dEdi॥