Ainapani kiMkanEla - ఐనపని కిఁకనేల
Ainapani kiMkanEla - ఐనపని కిఁకనేల | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
ఐనపని కిఁకనేల అనుమానము
కానిమ్మని లోనుగాక కట్టుకునేదేమీ ॥పల్లవి॥
మొగముచూచినదాన మొక్కవద్దా నీకు నేను
యెగసక్కెమాడఁగాను యేమాయను
నగినదాన నీతో నంటున మెప్పించవద్దా
జగడమడిచి నిన్ను సాదించేదేమి ॥ఐన॥
చేరఁగవచ్చినదాన సేవలు సేయఁగవద్దా
యీరసాన జంకించఁగ నేమాయను
పేరఁబిలిచినదాన ప్రియములు చెప్పవద్దా
దూరి నిన్నుఁ దిట్టుఁగాను దొరతనమేమి ॥ఐన॥
సిగ్గులువడినదాన చెప్పినట్లు సేయవద్దా
యెగ్గులెంచి పెనఁగఁగా నేమాయను
వెగ్గళించి నన్నిదె శ్రీవేంకటేశ కూడితివి
బగ్గన నిన్నఁగాదనేపను లిఁకనేమి ॥ఐన॥
ainapani kiMkanEla anumAnamu
kAnimmani lOnugAka kaTTukunEdEmI ॥pallavi॥
mogamuchUchinadAna mokkavaddA nIku nEnu
yegasakkemADagAnu yEmAyanu
naginadAna nItO naMTuna meppiMchavaddA
jagaDamaDichi ninnu sAdhiMchEdEmi ॥ainapani॥
chEra~gavachchinadAna sEvalu sEya~gavaddA
yIrasAna jaMkiMcha~ga nEmAyanu
pEra~bilichinadAna priyamulu cheppavaddA
dUri ninnu~ diTTu~gAnu doratanamEmi ॥ainapani॥
sigguluvaDinadAna cheppinaTlu sEyavaddA
yegguleMchi pena~ga~gA nEmAyanu
veggaLiMchi nannide SrIvEMkaTESa kUDitivi
baggana ninna~gAdanEpanu liMkanEmi ॥ainapani॥