Aitive yelikesani - ఐతివే యేలికెసాని
Aitive yelikesani - ఐతివే యేలికెసాని | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
ఐతివే యేలికెసాని వందరికిని
నీతితో సవతులెల్ల నీకు లోనే యిఁకను ॥పల్లవి॥
ఆరసి నీ కాతఁడు అరవడమచ్చునే
పేరురాన నేపొద్దూఁ బెట్టుకున్నాఁడు
సారెకు నీవు మంచి సకినాన వచ్చితివే
యీరాని చనవులెల్లా నిచ్చినాఁడు నీకు ॥ఐతివే॥
పొందుల నీకాతనికి పొంతనాలు గూడునే
మందలించి నీవాడినమాట దోయఁడు
యెందును నీమొకమాయ మందు యెటువంటిదే
కందువ నీ మోవికే కాచుకున్నాఁ డిపుడు ॥ఐతివే॥
చెలఁగి మంచివేళనే సేస నీవు వెట్టితివే
కలసి పాయఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
అలరి మమ్మేలెనాతఁ డప్పణ నీవిచ్చితివే
వలపించ నేరుతువే వసమాయ నతఁడు ॥ఐతివే॥
aitivE yElikesAni vaMdarikini
nItitO savatulella nIku lOnE yi~kanu ॥pallavi॥
Arasi nI kAta~Du aravDamaccunE
pErurAna nEpoddU~ beTTukunnA~Du
sAreku nIvu maMchi sakinAna vaccitivE
yIrAni chanavulellA niccinA~Du nIku ॥aitivE॥
poMdula nIkAtaniki poMtanAlu gUDunE
maMdaliMchi nIvADinamATa dOya~Du
yeMdunu nImokamAya maMdu yeTuvaMTidE
kaMduva nI mOvikE kAchukunnA~ DipuDu ॥aitivE॥
chela~gi maMchivELanE sEsa nIvu veTTitivE
kalasi pAya~Du SrIvEMkaTESvaru~Du
alari mammElenAta~ DappaNa nIviccitivE
valapiMcha nErutuvE vasamAya nata~Du ॥aitivE॥