Auduvayya janavu - ఔదువయ్య జాణవు

Auduvayya janavu - ఔదువయ్య జాణవు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

ఔదువయ్య జాణవు (రాగం: ) (తాళం : )

ఔదువయ్య జాణవు ప్రహ్లాదవరద

ఆదిగొని మొక్కీని ప్రహ్లాదవరదా ॥పల్లవి॥


యెదురుఁగొండలెక్కిన యిందిరఁ బెండ్లాడితివి

అది జాణతనము ప్రహ్లదవరద

వుదుటుఁ గోపముమాని వూరకే నవ్వు నవ్వితి-

వదన నాపెఁ జూచి ప్రహ్లదవరదా ॥ఔదువయ్య॥


మొగము చూచితేనే మోహముపైఁ జల్లితివి

అగడాయ బనులు ప్రహ్లదవరద

తగిలి కొంగువట్టితే తమకించేవింతలో

అగవుదగవుల ప్రహ్లదవరదా ॥ఔదువయ్య॥


చేయి చాఁచగా నాపెను సిగ్గువీడఁ గూడితివి

ఆయమెఱుఁగుదువు ప్రహ్లదవరదా

యీయెడ నహోబలాన నిట్టే శ్రీవేంకటాద్రిని

ఆయిత్తము పెండ్లిండ్లు ప్రహ్లదవరదా ॥ఔదువయ్య॥

auduvayya jANavu (Raagam: ) (Taalam: )

auduvayya jANavu prahlAdavarada

Adigoni mokkIni prahlAdavaradA ॥pallavi॥


yeduru~goMDalekkina yiMdira~ beMDlADitivi

adi jANatanamu prahladavarada

vuduTu~ gOpamumAni vUrakE navvu navviti-

vadana nApe~ jUchi prahladavaradA ॥auduvayya॥


mogamu chUchitEnE mOhamupai~ jallitivi

agaDAya banulu prahladavarada

tagili koMguvaTTitE tamakiMchEviMtalO

agavudagavula prahladavaradA ॥auduvayya॥


chEyi chA~chagA nApenu sigguvIDa~ gUDitivi

AyameRu~guduvu prahladavaradA

yIyeDa nahObalAna niTTE SrIvEMkaTAdrini

Ayittamu peMDliMDlu prahladavaradA ॥auduvayya॥