Auduve janavu nivu - ఔదువే జాణవు నీవు

Auduve janavu nivu - ఔదువే జాణవు నీవు | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

ఔదువే జాణవు నీవు (రాగం: ) (తాళం : )

ఔదువే జాణవు నీవు అన్నిటాను

సాదవా నీవును తొల్లె జాణఁడవురా ॥పల్లవి॥


ఆకసపుఁగొలనిపై నంటుఁదామరలు వుట్టె

యీకత చెప్పఁగదవే యింతిరో నీవు

మేకొని మరువింకి మిట్టెకోలలై యవి

కూకులు వత్తులుగానీగురి దాఁకురా ॥ఔదు॥


అలరినశశిబింబమందు తేనెపెర వుట్టె

కల విరుచఁగదే నిక్కముగా నీవు

చలమున నిదియె చంద్రకళలోనితేటై

నెలకొన నీనోరు నిండుకొనురా ॥ఔదు॥


ఆమనెరఁటులపై రావాకుబదనికె వుట్టె

నేమందుకు వచ్చును నా కెరిఁగించవే

గోమున శ్రీవేంకటేశ కూడిన యీరతివేళ

వేమరు నాతో నీవు విద్యలాడవచ్చురా ॥ఔదు॥

auduvE jANavu (Raagam: ) (Taalam: )

auduvE jANavu nIvu anniTAnu

sAdavA nIvunu tolle jANa~DavurA ॥pallavi॥


Akasapu~golanipai naMTu~dAmaralu vuTTe

yIkata cheppa~gadavE yiMtirO nIvu

mEkoni maruviMki miTTekOlalai yavi

kUkulu vattulugAnIguri dA~kurA ॥auduvE॥


alarinaSasibiMbamandu tEnepera vuTTe

kala virucha~gadE nikkamugA nIvu

chalamuna nidiniye chaMdrakaLalOnitETai

nelakona nInOru niMDukonurA ॥auduvE॥


Amanera~Tulai rAvAkubadanike vuTTe

nEmaMduku vachchunu nA keri~giMchavE

gOmuna SrIvEMkaTESa kUDina yIrativELa

vEmaru nAtO nIvu vidyalADavachchurA ॥auduvE॥