Aunoumari aduvara - ఔనౌమరి ఆడువార
Aunoumari aduvara - ఔనౌమరి ఆడువార | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
ఔ నౌ మరి ఆఁడువార మంత కోపము
ఆనతిమ్మా నీకు నితవైనట్టే సేసేను ॥పల్లవి॥
సారె సారె నీతోను సణఁగులు చూపఁగాను
భారము గాదుగదా పంతగాఁడవు
కూరిమి గలిగి నేను గొణుఁగుచుఁ దిట్టఁగాను
వైరముగాదుగదా వాసికాఁడవు ॥ఔనౌ॥
కప్పినట్టి నీమోవిగంట్లిట్టె రేఁచఁగాను
నొప్పులు గావుగదా నుడికారివి
చిప్పిల నింటికి నీవు చేయివట్టి తియ్యగాను
దప్పులు గొనవుగదా తమకపుదొరవు ॥ఔనౌ॥
కాలుమీఁద గాలువేసి కరఁగించి కూడఁగాను
నాలితో మొక్కవుగదా నాఁటకీఁడవు
యీలీల శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
వేళలు గావవుగదా వేడుకకాఁడవు ॥ఔనౌ॥
aunau mari A~Duvaara maMta kOpamu
Anatimma nIku nitavainaTTE sEsEnu ॥pallavi॥
sAre sAre nItOnu saNa~gulu chUpa~gAnu
bhAramu gAdugadA paMtagA~Davu
kUrimi galigi nEnu goNu~guchu~ diTTa~gAnu
vairamugAdugadA vAsikA~Davu ॥aunau mari॥
kappinaTTi nImOvigaMTliTTe rE~cha~gAnu
noppulu gAvugadA nuDikArivi
chippila niMTiki nIvu chEyivaTTi tiyyagAnu
dappulu gonavugadA tamakapudoravu ॥aunau mari॥
kAlumI~da gAluvEsi kara~giMchi kUDa~gAnu
nAlitO mokkavugadA nA~TakI~Davu
yIlIla SrIvEMkaTESa iTTe nannu~ gUDitivi
vELalu gAvavugadA vEDukakA~Davu ॥aunau mari॥