Idivo Shrutimula - ఇదివో శ్రుతిమూల
Idivo Shrutimula - ఇదివో శ్రుతిమూల | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by KONDAVEETI JYOTHIRMAYI:
ఇదివో శ్రుతిమూల మెదుటనే వున్నది
సదరముగా హరి చాటీ నదివో ॥పల్లవి॥
యెనసి పుణ్యముసేసి యే లోకమెక్కిన
మనికై భూమియందు మగుడఁ బొడముటే
పొనిగి “యా బ్రహ్మభువనా లోకాః
పునరావృత్తి” యనెఁ బురుషోత్తముఁడు ॥ఇది॥
తటుకున శ్రీహరి తన్నునే కొలిచిన
పటుగతితో మోక్షపదము సులభమనె
ఘటన “మాముపేత్యతు కౌంతేయ” మహిని
నటనఁ “బునర్జన్మ న విద్యతే” ॥ఇది॥
యిన్నిటా శ్రీవేంకటేశ్వరు సేవె
పన్నినగతి నిహపరసాధన మదే
మన్నించి యాతఁడే “మన్మనా భవ” యని
అన్నిటా నందరి కానతిచ్చెఁగాన ॥ఇది॥
idivO SrutimUlameduTanE vunnadi
sadaramugA hari chATI nadivO ॥idivO॥
yenasi puNyamusEsi yE lOkamekkina
manikai bhUmiyaMdu maguDa~ boDamuTE
ponigi “yA brahmabhuvanA lOkAH
punarAvRutti” yane~ burushOttamu~Du ॥idivO॥
taTukuna SrIhari tannunE kolicina
paTugatitO mOkshapadamu sulabhamane
ghaTana “mAmupEtyatu kauMtEya” mahini
naTana~ “punarjanma na vidyatE” ॥idivO॥
yinniTA SrIvEMkaTESvaru sEve
panninagati nihaparasAdhana madE
mAnniMchi yAta~DE “manmanA bhava” yani
anniTA naMdari kAnaticce~gAna ॥idivO॥