muddugAraganide muMgiTa - ముద్దుగారగనిదె


ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు
వొద్దికేగి చెలులెల్ల వూరడించరే

వేకువజామున లేచి వేడుక కృష్ణుడు తల్లి
ఆకలయ్యీ ననుచు వొయ్యనె మంచము దిగి
కాకలతో పసివాడి కన్నులు పులుముకొంటా
యేకరుచు నున్నవాడు యెత్తుకోరే బిడ్డని

బాలులతో వూరనెల్ల బరువులు వెట్టి వెట్టి
చాలుకొని యాడి యాడి జామెక్కగా వచ్చి
కేలుచాచి వెన్నడిగి కిందుపడీ యంతలో
బేలులై వుండగనేల పెట్టరే బిడ్డనికి

మట్టమద్యాన్నపువేళ మలయుచు నింటిలోనే
చట్టల పెరుగు వేడీ చాలఁబెట్టరే మీరు
పట్టపు శ్రీవేంకటాద్రిపై కీలుకొనె నిదె
అట్టిట్టనక వీని నాదరించరే

---Painting by Sri Raja Ravivarma------

muddugAraganide muMgiTa niluchunnADu
voddikEgi chelulella vUraDiMcharE

vEkuvajAmuna lEchi vEDuka kRshNuDu talli
AkalayyI nanuchu voyyane maMchamu digi
kAkalatO pasivADi kannulu pulumukoMTA
yEkaruchu nunnavADu yettukOrE biDDani

bAlulatO vUranella baruvulu veTTi veTTi
chAlukoni yADi yADi jAmekkagA vachchi
kEluchAchi vennaDigi kiMdupaDI yaMtalO
bElulai vuMDaganEla peTTArE biDDaniki

maTTAmadyAnnapuvELa malayuchu niMTilOnE
chaTTala perugu vEDI chAla@MbeTTarE mIru
paTTapu SrIvEMkaTAdripai kIlukone nide
aTTiTTanaka vIni nAdariMcharE



Sung by:Ramya. S

kaladu tirumaMtramu kaladihamu - కలదు తిరుమంత్రము


ప|| కలదు తిరుమంత్రము కలదిహము బరము | కలిమి గలుగు మాకు గడమే లేదు ||
చ|| కమలాక్షు నీవు మాకు గలిగియుండగ భూమి | నమరలేని దొకటి నవ్వలలేదు |
నెమకి నాలుకమీద నీనామము మెలగగ | తమితో బరుల వేడ దా జోటులేదు ||
చ|| శౌరి నీ చక్రము నాభుజము మీదనుండగాను | బూరవపు బగ లేదు యెదురూ లేదు |
చేరువ నీ సేవ నాచేతులపై నుండగాను | తీరని కర్మపు వెట్టిదినమూ లేదు ||
చ|| అచ్చుత నీపై భక్తి యాతుమలో నుండగాను | రచ్చల బుట్టిన యపరాధమూ లేదు |
నిచ్చలు శ్రీ వేంకటేశ నీశరణాగతుండగా | విచ్చిన విడే కాని విచారమే లేదు ||


pa|| kaladu tirumaMtramu kaladihamu baramu | kalimi galugu mAku gaDamE lEdu ||
ca|| kamalAkShu nIvu mAku galigiyuMDaga BUmi | namaralEni dokaTi navvalalEdu |
nemaki nAlukamIda nInAmamu melagaga | tamitO barula vEDa dA jOTulEdu ||
ca|| Sauri nI cakramu nABujamu mIdanuMDagAnu | bUravapu baga lEdu yedurU lEdu |
cEruva nI sEva nAcEtulapai nuMDagAnu | tIrani karmapu veTTidinamU lEdu ||
ca|| accuta nIpai Bakti yAtumalO nuMDagAnu | raccala buTTina yaparAdhamU lEdu |
niccalu SrI vEMkaTESa nISaraNAgatuMDagA | viccina viDE kAni vicAramE lEdu ||


Listen Audio:

atisulaBaM bidi yaMdaripAliki - అతిసులభంబిది

ప|| అతిసులభంబిది యందరిపాలికి | గతియిది శ్రీపతి కైంకర్యంబు ||
చ|| పాలసముద్రము బలిమి దచ్చి కొని- | రాలరి దేవత లమృతమును |
నాలుక నిదె హరినామపుటమృతము | యేల కానరో యిహపరసుఖము ||
చ|| అడరి బాతిపడి యవని దేవతలు | బడివాయరు యజ్ఞ భాగాలకు |
విడువక చేతిలో విష్ణుప్రసాదము | కడిగడియైనది కానరుగాని ||
చ|| యెక్కుదురు దిగుదు రేడులోకములు | పక్కన దపముల బడలుచును |
చిక్కినాడు మతి స్రీవేంకటేశ్వరు- | డిక్కడితుదిపద మెఱగరుగాని ||

pa|| atisulaBaM bidi yaMdaripAliki | gatiyidi SrIpati kaiMkaryaMbu ||
ca|| pAlasamudramu balimi dacci koni- | rAlari dEvata lamRtamunu |
nAluka nide harinAmapuTamRtamu | yEla kAnarO yihaparasuKamu ||
ca|| aDari bAtipaDi yavani dEvatalu | baDivAyaru yaj~na BAgAlaku |
viDuvaka cEtilO viShNuprasAdamu | kaDigaDiyainadi kAnarugAni ||
ca|| yekkuduru digudu rEDulOkamulu | pakkana dapamula baDalucunu |
cikkinADu mati srIvEMkaTESvaru- | DikkaDitudipada me~ragarugAni ||


eMta puNyamO yiTu mAku - ఎంత పుణ్యమో



ఎంత పుణ్యమో యిటు మాకు కలిగె
చెంతనే నీకృప సిధ్ధించబోలు

శ్రీపతి మీకథ చెవులను వింటిమి
పాపము లణగెను భయముడిగె
తీపుగ తులసితీర్థము గొంటిమి
శాపము దీరెను సఫలంబాయ

గోవింద మిము కనుగోంటి మిప్పుడే
పావనమైతిమి బ్రతికితిమి
తావుల మీపాదములకు మ్రొక్కితి
వేవేలు కలిగెను వేడుకలాయ

శ్రీవేంకటేశ్వర సేవించితి మిము
ధావతి దీరెను తనిసితిమి
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి
నీవారమైతిమి నిలిచితి మిపుడు


eMta puNyamO yiTu mAku kalige
cheMtanE nIkRpa sidhdhiMchabOlu

SrIpati mIkatha chevulanu viMTimi
pApamu laNagenu bhayamuDige
tIpuga tulasitIrthamu goMTimi
SApamu dIrenu saphalaMbAya

gOviMda mimu kanugOMTi mippuDE
pAvanamaitimi bratikitimi
tAvula mIpAdamulaku mrokkiti
vEvElu kaligenu vEDukalAya

SrIvEMkaTESwara sEviMchiti mimu
dhAvati dIrenu tanisitimi
vAviri mummAru valagoni vachchiti
nIvAramaitimi nilichiti mipuDu

sEyanivADevvaDu chEri - సేయనివాడెవ్వడు

సేయనివాడెవ్వడు చేరి చిల్లర దోషాలు
యేయెడ జీవుల జాడ లీశ్వరకల్పితమే

దేవుని నమ్మినయట్టి దేహియట ఆతనికి
యీవల యెంతట పాప మేమి సేసును
భావించి యన్ని నేరాలు పరిహరించు నతడే
ఆవటించు సూర్యునికి అంధకారమెదురా

పూజింపించుకొనువాడు భువనరక్షకుడట
తేజముతో దురితాలు తెంచగలేడా
రాజు సేసిన యాజ్ఞ రాజుకంటెనెక్కుడా
వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు


చేతనాత్మకుడట శ్రీవేంకటేశ్వరుడు
జాతిలేని జీవునికి స్వతంత్రమేది
కాతరపు జన్మానకు కార్యకారణమేది
యేతున గరుడనికి నెదురా పాములు

sEyanivADevvaDu chEri chillara dOshAlu
yEyeDa jIvula jADa lISwarakalpitamE

dEvuni namminayaTTi dEhiyaTa Ataniki
yIvala yeMtaTa pApa mEmi sEsunu
bhAviMchi yanni nErAlu parihariMchu nataDE
AvaTiMchu sUryuniki aMdhakAramedurA

pUjiMpiMchukonuvADu bhuvanarakshakuDaTa
tEjamutO duritAlu teMchagalEDA
rAju sEsina yAj~na rAjukaMTenekkuDA
vOjatO vajrAyudhAna kOpunA parwatAlu

chEtanAtmakuDaTa SrIvEMkaTESwaruDu
jAtilEni jIvuniki swataMtramEdi
kAtarapu janmAnaku kAryakAraNamEdi
yEtuna garuDaniki nedurA pAmulu



balavaMtuDitani - బలవంతుడితని

బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము
కిలకిల నవ్వీ సుగ్రీవ నరసింహుడు

దేవదేవుడితడు తేజోరాశి యితడు
భావించ నలవిగాని బ్రహ్మ మితడు
శ్రీవల్లభుడితడు జీవరక్షకుడితడు
కేవలమయిన సుగ్రీవనరసింహుడు

పరమాత్ముడితడు భయహరుడితడు
నిరుపమగుణముల నిత్యుడితడు
వరదుడితడు సర్వవంద్యుడు నీతడు
గిరిగుహలోని సుగ్రీవ నరసింహుడు


లరూపుడితడు కరుణానిధియితడు
మేలిమి జగత్తులకు మేటి యీతడు
మూలమై శ్రీవేంకటశైల నిలయుడితడు
కీలకమిన్నిటికి సుగ్రీవ నరసింహుడు


balavaMtuDitani baMTlamai bratukudumu
kilakila navvI sugrIva narasiMhuDu

dEvadEvuDitaDu tEjOrASi yitaDu
bhAviMcha nalavigAni brahma mitaDu
SrIvallabhuDitaDu jIvarakshakuDitaDu
kEvalamayina sugrIvanarasiMhuDu

paramAtmuDitaDu bhayaharuDitaDu
nirupamaguNamula nityuDitaDu
varaduDitaDu sarvavaMdyuDu nItaDu
giriguhalOni sugrIva narasiMhuDu

larUpuDitaDu karuNAnidhiyitaDu
mElimi jagattulaku mETi yItaDu
mUlamai SrIvEMkaTaSaila nilayuDitaDu
kIlakaminniTiki sugrIva narasiMhuDu


kAnIvE aMdukEmI kanukonE - కానీవే అందుకేమీ

కానీవే అందుకేమీ కనుకొనే పను లెల్ల
యీ నాటకములు నేనెఱగనివా

పంతము లాడిన తానే భ్రమసీ గాక నాకు
యింతలోనే యేమి దప్పె నెందు వోయీని
వింత యడవుల వెంట వెదకడా సీతఁదొల్లి
యెంత లేదు తనగుండె యెఱగనిదా

బిగియుచున్న వాడే బిలిచీగాక నన్ను
తగవులే నెరపేను దాని కేమే
వెగటయి రాధాదేవివెంట తిరుగడా
యెగువనె తనగుట్టు యెఱగనిదా

కడలనున్న వాడే కలసీగాక నన్ను
తడవకు వాని నిట్టె తతి రానీవే
అడరి శ్రీవేంకటేశ్వరుడట్టె నన్ను గలసె
యెడయకున్నాడు నే నిది యెఱగనిదా

ca||kAnIvE aMdukEmI kanukonE panu lella
yI nATakamulu nEne~raganivA

pa||Mtamu lADina tAnE bhramasI gAka nAku
yiMtalOnE yEmi dappe neMdu vOyIni
viMta yaDavula veMTa vedakaDA sIta@Mdolli
yeMta lEdu tanaguMDe ye~raganidA

bigiyuchunna vADE bilichIgAka nannu
tagavulE nerapEnu dAni kEmE
vegaTayi rAdhAdEviveMTa tirugaDA
yeguvane tanaguTTu ye~raganidA

kaDalanunna vADE kalasIgAka nannu
taDavaku vAni niTTe tati rAnIvE
aDari SrIvEMkaTESwaruDaTTe nannu galase
yeDayakunnADu nE nidi ye~raganidA