Antaryami alasiti - అంతర్యామి అలసితి

ప|| అంతర్యామి అలసితి సొలసితి | ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||

చ|| కోరిన కోర్కులు కోయని కట్లు | తీరవు నీవవి తెంచక | భారపు బగ్గాలు పాప పుణ్యములు | నేరుపుల బోనీవు నీవు వద్దనక ||

చ|| జనుల సంగముల జక్క రోగములు | విను విడువవు నీవు విడిపించక | వినయపు దైన్యము విడువని కర్మము | చనదది నీవిటు శాంతపరచక ||

చ|| మదిలో చింతలు మైలలు మణుగులు | వదలవు నీవవి వద్దనక | ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె | అదన గాచితివి అట్టిట్టనక ||


pa|| aMtaryAmi alasiti solasiti | iMtaTa nI SaraNide joccitini ||

ca|| kOrina kOrkulu kOyani kaTlu | tIravu nIvavi teMcaka | BArapu baggAlu pApa puNyamulu | nErupula bOnIvu nIvu vaddanaka ||

ca|| janula saMgamula jakka rOgamulu | vinu viDuvavu nIvu viDipiMcaka | vinayapu dainyamu viDuvani karmamu | canadadi nIviTu SAMtaparacaka ||

ca|| madilO ciMtalu mailalu maNugulu | vadalavu nIvavi vaddanaka | eduTane SrI veMkaTESvara nIvade | adana gAcitivi aTTiTTanaka ||

Download : Antaryami alasiti

aMtarumAlinayaTTi adhamulAla - అంతరుమాలినయట్టి అధములాల

ప|| అంతరుమాలినయట్టి అధములాల | పొంత సంతకూటమి పొరిచూపు గాదా ||

చ|| కనక మిత్తడితోడ కలయ సరిదూచితే | అనువవునా అది దోష మవుగాక |

ఘనుడైనహరితో గడుహీనదేవతల | ననిచి సరివేట్టితే నయ మవునా భువిని ||

చ|| పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై | వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱులేకారా |

గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల | బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా ||

చ|| కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా | పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక |

అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను | కొంచెపుదైవాల పలువంచలనేకాక ||

pa|| aMtarumAlinayaTTi adhamulAla | poMta saMtakUTami poricUpu gAdA ||

ca|| kanaka mittaDitODa kalaya saridUcitE | anuvavunA adi dOSha mavugAka |

GanuDainaharitO gaDuhInadEvatala | nanici sarivETTitE naya mavunA Buvini ||

ca|| paTTaBadruDu gUrcuMDEbalusiMhAsanamupai | veTTibaMTu beTTEvAru verxrxulEkArA |

gaTTigA SrIharitODa kalagaMpadEvatala | beTTi kolucuTa viMduveTTi pagagAdA ||

ca|| koMcaka siMhamuMDETiguha nuMDavaccunA | poMci nakkalakella bokkalEkAka |

aMcela SrIvEMkaTESu DAtmalOnE vuMDagAnu | koMcepudaivAla paluvaMcalanEkAka ||

Amtaramgamella - అంతరంగమెల్ల

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె వింతవింత విధముల వీడునా బంధములు

మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా పనిమాలి ముదిసితే పాసెనా భవము

చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా యెదుట తాను రాజైతే ఏలేనాపరము

పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా జీవించి ఫలమేది చింత దీరుదాకా వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా

Amtaramgamella Sreehariki oppimchakumte Vimtavimta vidhamula veedunaa bamdhamulu

Manujudai phalamaedi marij~naani yaudaakaa Tanuvetti phalamaedi dayagalugudaakaa Dhanikudai phalamaedi dharmamu saeyudaakaa Panimaali mudisitae paasenaa bhavamu

Chadiviyu phalamaedi saamtamu kalugudaakaa Pedavetti phalamaedi priyamaadu daakaa Madigalgi phalamaedi maadhavudalachu daakaa Yeduta taanu raajaitae aelaenaaparamu

Paavanudai phalamaedi bhakti kaligina daakaa Jeevimchi phalamaedi chimta deerudaakaa Vaevaela phalamaedi vaemkataesugannadaaka Bhaavimchitaa daevudaitae pratyakshamaunaa

aMtaTane vachchi - అంతటనె వచ్చి

అంతటనె వచ్చికాచు నాసద్భంధుడు హరి
వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||

బంతిగట్టి నురిపేటి పసురము లెడనెడ
బొంత నొక్కొక్క గవుకవుచ్చుకొన్నట్లు
చెంతల సంసారము సేయునరుడందులోనె
కొంతగొంత హరినాత్మ గొలుచుటే చాలు ||

aMtaTane vachchikAchu nAsadbhaMdhuDu hari
vaMtuku vAsiki natanivADanaMTEjAlu ||

baMtigaTTi nuripETi pasuramu leDaneDa
boMta nokkokka gavukavuchchukonnaTlu
cheMtala saMsAramu sEyunaruDaMdulOne
koMtagoMta harinAtma goluchuTE chAlu ||

aMTabAri paTTukOrE - అంటబారి పట్టుకోరే

ప|| అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె | వెంటబారనీదు నన్ను వెడమాయతురుము ||

చ|| కాగెడుపెరుగుచాడె కవ్వముతో బొడిచి | లేగల దోలుకొని అలిగిపోయీని |

రాగతనమున వాడె రాతిరి నారగించడు | ఆగి నన్ను గూడడిగె నయ్యో ఇందాకను ||

చ|| కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి | కలవూరుగాయలెల్ల గలచిపెట్టె |

పలుకడు చేతిచట్టి పారవేసి పోయీనదె | చెలగుచు మూటగట్టె జెల్లబో యిందాకను ||

చ|| మట్టుపడకిటు నూరుమారులైనా నారగించు | ఇట్టె యిందరిలోన నిన్నాళ్ళును |

వెట్టికి నాకొరకుగా వేంకటేశు డారగించె | యెట్టు నేడాకట ధరియించెనో యిందాకను ||

pa|| aMTabAri paTTukOrE ammalAla yide | veMTabAranIdu nannu veDamAyaturumu ||

ca|| kAgeDuperugucADe kavvamutO boDici | lEgala dOlukoni aligipOyIni |

rAgatanamuna vADe rAtiri nAragiMcaDu | Agi nannu gUDaDige nayyO iMdAkanu ||

ca|| koladigAniperugu kosarikosari pOri | kalavUrugAyalella galacipeTTe |

palukaDu cEticaTTi pAravEsi pOyInade | celagucu mUTagaTTe jellabO yiMdAkanu ||

ca|| maTTupaDakiTu nUrumArulainA nAragiMcu | iTTe yiMdarilOna ninnALLunu |

veTTiki nAkorakugA vEMkaTESu DAragiMce | yeTTu nEDAkaTa dhariyiMcenO yiMdAkanu ||

aMcita puNyulakaitE hari - అంచిత పుణ్యులకైతే హరి

ప|| అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక | పంచమహాపాతకులభ్రమ వాపవశమా ||

చ|| కాననియజ్ఞానులకు కర్మమే దైవము | ఆనినబద్ధులకు దేహమే దైవము |

మాననికాముకులకు మగువలే దైవము | పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా ||

చ|| యేమీ నెఱుగనివారి కింద్రియములు దైవము | దోమటిసంసారి కూరదొర దైవము |

తామసులకెల్లాను ధనమే దైవము | పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా ||

చ|| ధన నహంకరులకు తాదానే దైవము | దరిద్రుడైనవానికి దాత దైవము |

యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము | పరులముంచినయట్టి భ్రమ బాపవశమా ||

pa|| aMcita puNyulakaitE hari daivamavugAka | paMcamahApAtakulaBrama vApavaSamA ||

ca|| kAnaniyaj~jAnulaku karmamE daivamu | Aninabaddhulaku dEhamE daivamu | mAnanikAmukulaku maguvalE daivamu | pAnipaTTi vArivAriBrama mAnpavaSamA ||

ca|| yEmI nerxuganivAri kiMdriyamulu daivamu | dOmaTisaMsAri kUradora daivamu | tAmasulakellAnu dhanamE daivamu | pAmarula baTTinaTTiBrama bApavaSamA ||

ca|| dhana nahaMkarulaku tAdAnE daivamu | daridruDainavAniki dAta daivamu | yiravai mAku SrIvEMkaTESuDE daivamu | parulamuMcinayaTTi Brama bApavaSamA ||

aMganalAla manacE - అంగనలాల మనచే

ప|| అంగనలాల మనచే నాడించుకొనెగాని | సంగతెఱిగిననెరజాణ డితడే ||

చ|| వొడలులేనివాని కొక్కడే తండ్రాయగాని | తడయక పురుషోత్తము డితడే |

బడబాగ్నిజలధికి బాయకల్లుడాయగాని | వెడలించె నమృతము విష్ణుడితడే ||

చ|| పులిగూడుదిన్నవానిపొం దొక్కటే సేసెగాని | నలువంక లక్ష్మీనాథు డితడే |

చలికి గోవరివానివరుస బావాయగాని | పలుదేవతలకెల్ల ప్రాణబంధు డితడే ||

చ|| యెక్కడో గొల్లసతుల కింటిమగడాయగాని | తక్కకవెదకేపరతత్త్వ మితడే |

మిక్కిలి శ్రీవేంకటాద్రిమీద మమ్ము నేలెగాని | తక్కక వేదముచెప్పేదైవమీతడే ||

pa|| aMganalAla manacE nADiMcukonegAni | saMgaterxiginanerajANa DitaDE ||

ca|| voDalulEnivAni kokkaDE taMDrAyagAni | taDayaka puruShOttamu DitaDE |

baDabAgnijaladhiki bAyakalluDAyagAni | veDaliMce namRutamu viShNuDitaDE ||

ca|| puligUDudinnavAnipoM dokkaTE sEsegAni | naluvaMka lakShmInAthu DitaDE |

caliki gOvarivAnivarusa bAvAyagAni | paludEvatalakella prANabaMdhu DitaDE ||

ca|| yekkaDO gollasatula kiMTimagaDAyagAni | takkakavedakEparatattva mitaDE |

mikkili SrIvEMkaTAdrimIda mammu nElegAni | takkaka vEdamuceppEdaivamItaDE ||