aDugavayyA varamulApe - అడుగవయ్యా వరములాపె

ప|| అడుగవయ్యా వరములాపె నేమైనా నీవు | బడిబడి నిదివో ప్రత్యక్షమాయ నీకు ||

చ|| చెలయపేరే నీకు సేసే జపమంతములు | కలసేటి సన్నలే యంగన్యాసాలు |

ములువాడి కొనగోరి మోపులే నానాముద్రలు | ఫలియించెదపమాపె ప్రత్యక్షమాయ నీకు ||

చ|| ఆపెపైజల్లేవలపదే తర్పణజలము | దీపించు నవ్వు పాయస దివ్యహోమము |

దాపగు నీయథరామృతమే మంచిభోజనము | నీపాలబ్రత్యక్షమాయ నెలతె యిదె నీకు ||

చ|| పొందులకాగిటి రతి పురశ్చరణ ఫలము | అందియాపె చక్కని రూపది యంత్రము |

యిందునె శ్రీవేంకటేశ యిటు నన్నుగూడితివి | అందమై ప్రత్యక్షమాయ నప్పటిదానె నీకు ||

pa|| aDugavayyA varamulApe nEmainA nIvu | baDibaDi nidivO pratyakShamAya nIku ||

ca|| celayapErE nIku sEsE japamaMtamulu | kalasETi sannalE yaMganyAsAlu |

muluvADi konagOri mOpulE nAnAmudralu | PaliyiMcedapamApe pratyakShamAya nIku ||

ca|| ApepaijallEvalapadE tarpaNajalamu | dIpiMcu navvu pAyasa divyahOmamu |

dApagu nIyatharAmRutamE maMciBOjanamu | nIpAlabratyakShamAya nelate yide nIku ||

ca|| poMdulakAgiTi rati puraScaraNa Palamu | aMdiyApe cakkani rUpadi yaMtramu |

yiMdune SrIvEMkaTESa yiTu nannugUDitivi | aMdamai pratyakShamAya nappaTidAne nIku ||

aDugarE yAtaninE - అడుగరే యాతనినే

ప|| అడుగరే యాతనినే అంగనలాలా | గుడిగొని తానే వట్టి గొరబాయగాక ||

చ|| యెదురాడేదాననా యెంతటి పనికినైనా | పదరి తానే మారువలికీ గాక |

తుదమీఱేదాననా దూరైయంత దిరిగినా | ముదమునదానే మారుమలసీగాక ||

చ|| కక్కసించే దాననా కడలెంత దొక్కినాను | వెక్కసీడై తానై యిటు వెలసీగాక |

మొక్కలపుదాననా ముందు వెనకెంచితేను | పక్కనె దానె ముంచి పంతమాడీగాక ||

చ|| తడబడేదాననా తనరతి వేళను | బడిబడి దానే చొక్కి భ్రమసీగాక |

అడిగేటి దాననా అందరిలో నన్నుగూడి | అడరి శ్రీవేంకటేశు డాదరించీగాక ||

pa|| aDugarE yAtaninE aMganalAlA | guDigoni tAnE vaTTi gorabAyagAka ||

ca|| yedurADEdAnanA yeMtaTi panikinainA | padari tAnE mAruvalikI gAka | tudamIrxEdAnanA dUraiyaMta diriginA | mudamunadAnE mArumalasIgAka ||

ca|| kakkasiMcE dAnanA kaDaleMta dokkinAnu | vekkasIDai tAnai yiTu velasIgAka | mokkalapudAnanA muMdu venakeMcitEnu | pakkane dAne muMci paMtamADIgAka ||

ca|| taDabaDEdAnanA tanarati vELanu | baDibaDi dAnE cokki BramasIgAka | aDigETi dAnanA aMdarilO nannugUDi | aDari SrIvEMkaTESu DAdariMcIgAka ||

aTTivELa galaganI - అట్టివేళ గలగనీ

ప|| అట్టివేళ గలగనీ దదివో వివేకము | ముట్టువడితే శాంతము మరి యేలా ||

చ|| జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు | వొడలిలో జీవునికి నొక్కొకవేళ |

బడబాగ్ని రేగినట్లు పైకొనీ ముంగోపము | వుడికించు మననెల్ల నొక్కొకవేళా ||

చ|| అరయ గొండయెత్తినట్టు వేగౌ సంసారము | వూరక కలిమిలేము లొక్కొకవేళ |

మేరలేనిచీకటియై మించును దుఃఖములెల్లా | వూరటలేనికర్మికి నొక్కొకవేళా ||

చ|| పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికలు ముంచు | వొనర నజ్ఞానికి నొక్కొకవేళా |

యెనయగ శ్రీవేంకటేశుదాసుడైనదాకా | వునికి బాయవన్నియు నొక్కొకవేళా ||

pa|| aTTivELa galaganI dadivO vivEkamu | muTTuvaDitE SAMtamu mari yElA ||

ca|| jaDadhulu voMginaTTu saMdaDiMcu niMdriyamulu | voDalilO jIvuniki nokkokavELa | baDabAgni rEginaTlu paikonI muMgOpamu | vuDikiMcu mananella nokkokavELA ||

ca|| araya goMDayettinaTTu vEgau saMsAramu | vUraka kalimilEmu lokkokavELa | mEralEnicIkaTiyai miMcunu duHKamulellA | vUraTalEnikarmiki nokkokavELA ||

ca|| penugAli vIcinaTTu pekkukOrikalu muMcu | vonara naj~jAniki nokkokavELA | yenayaga SrIvEMkaTESudAsuDainadAkA | vuniki bAyavanniyu nokkokavELA ||

aTuvaMTi vaiBavamu - అటువంటి వైభవము

ప|| అటువంటి వైభవము లమర జేసిన దైవ- | మిటువంటి యోగంబు లిన్నియును జేసి ||

చ|| జలజాక్షి లావణ్య జలధినుప్పొంగిన | నలివేణి ముఖచంద్రు డభ్యుదయ మాయె |

కలికి వలరాయడను కాలకూటంబుతో | దలకొన్న యధరామృతంబు జన్మించె ||

చ|| వనిత సౌభాగ్యంబు వనధిలోపల దోచె | గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు |

తనివోని కోరికల తగు తురంగములతో | ననువైన విరహ బడబానలము గలిగె ||

చ|| భామయవ్వన మనెడి పాలజలధిలోన | వామాక్షి యైన యవ్వన లక్ష్మి గలిగె | యీ మంచి తిరువేంకటేశ్వరుం డిందులో | బ్రేమమున సుఖియించి పెంపొందగలిగె ||

pa|| aTuvaMTi vaiBavamu lamara jEsina daiva- | miTuvaMTi yOgaMbu linniyunu jEsi ||

ca|| jalajAkShi lAvaNya jaladhinuppoMgina | nalivENi muKacaMdru DaByudaya mAye |

kaliki valarAyaDanu kAlakUTaMbutO | dalakonna yadharAmRutaMbu janmiMce ||

ca|| vanita sauBAgyaMbu vanadhilOpala dOce | gonakonna gurxutaina kucaparvatamulu |

tanivOni kOrikala tagu turaMgamulatO | nanuvaina viraha baDabAnalamu galige ||

ca|| BAmayavvana maneDi pAlajaladhilOna | vAmAkShi yaina yavvana lakShmi galige |

yI maMci tiruvEMkaTESvaruM DiMdulO | brEmamuna suKiyiMci peMpoMdagalige ||

aTucUDu satinErpu - అటుచూడు సతి

ప|| అటుచూడు సతినేర్పు లవుభళేశ | అటుమటములు గావు అవుభళేశ ||

చ|| యెదురు గొండల మీద నెక్కినట్టి లకిమమ్మ | అదివో నీ తొడ యెక్కినౌభళేశ |

వుదుటున నంతలోనే వురముపై నెలకొని | అదిమీ జన్నుల నిన్ను నౌభళేశ ||

చ|| ముంగోపముతోడను మొక్కలీడవైన నిన్ను | నంగన గద్దెపై బెట్టె నౌభళేశ |

కంగక వేదాద్రి నిన్ను గరుడాద్రికి దీసె | అంగా లంటె నింటిలోన నౌభళేశ ||

చ|| చేరి నీవు నవ నారసింహరూపులైతే జెలి | ఆ రీతుల నిన్ను గూడె నౌభళేశ |

గారవాన నీవు శ్రీ వేంకటముపై నుండగాను | అరసి రతి మెప్పించె నౌభళేశ ||

pa|| aTucUDu satinErpu lavuBaLESa | aTumaTamulu gAvu avuBaLESa ||

ca|| yeduru goMDala mIda nekkinaTTi lakimamma | adivO nI toDa yekkinauBaLESa | vuduTuna naMtalOnE vuramupai nelakoni | adimI jannula ninnu nauBaLESa ||

ca|| muMgOpamutODanu mokkalIDavaina ninnu | naMgana gaddepai beTTe nauBaLESa | kaMgaka vEdAdri ninnu garuDAdriki dIse | aMgA laMTe niMTilOna nauBaLESa ||

ca|| cEri nIvu nava nArasiMharUpulaitE jeli | A rItula ninnu gUDe nauBaLESa |

gAravAna nIvu SrI vEMkaTamupai nuMDagAnu | arasi rati meppiMce nauBaLESa ||

Atugana royaga - అటుగన రోయగ

అటుగన రోయగ దగవా నటనల శ్రీహరి నటమింతే

చిడుముడి మూగినజీవులలోపల కడగి నే నొక్కడ నింతే నిడువక పక్షులు వృక్షము లిలపై వెడగుభోగముల వెదకీనా

తనువులు మోచినతగుప్రాణులలో గనుగొని నొకమశకమ నింతే మునుకొని కీటకములు జీమలు నిల చెనకి దొరతనము సేసీనా

శ్రీవేంకటపతిసేవవారిలో సోవల నొకదాసుడ నేను భావించి సురలు బ్రహ్మాదు లతని దైవపుమాయలు దాటేరా

Atugana royaga dagavaa Natanala Sreehari nataminte

Chidumudi mooginajeevulalopala Kadagi ne nokkada nimte Niduvaka pakshulu vrukshamu lilapai Vedagubhogamula vedakeenaa

Tanuvulu mochinatagupraanulalo Ganugoni nokamasakana ninte Munukoni keetakamulu jeemalu nila Chenaki doratanamu seseenaa

Sreevenkatapatisevavaarilo Sovala nokadaasuda nenu Bhaavinchi suralu brahmaadu latani Daivapumaayalu daateraa

aTu guDuvu manasa - అటు గుడువు

ప|| అటు గుడువు మనస నీ వన్నిలాగుల బొరలి | ఇటు గలిగె నీకు నైహికవిచారములు ||

చ|| కోరికలకును గలిగె ఘోరపరితాపంబు | కూరిమికి గలిగె ననుకూలదుఃఖములు |

తారతమ్యములేని తలపోతలకు గలిగె | భారమైనట్టి లంపటమనెడిమోపు ||

చ|| తనువునకు గలిగె సంతతమైనతిమ్మటలు | మనువునకు గలిగె నామవికారములు |

పనిలేని సంసార బంధంబునకు గలిగె | ఘనమైన దురిత సంగతితోడి చెలిమి ||

చ|| దేహికిని గలిగె నింద్రియములను బోధింప | దేహంబునకు గలిగె తెగనిసంశయము |

దేహాత్మకుండయిన తిరువేంకటేశునకు | దేహిదేహాంతరస్థితి జూడగలిగె ||

pa|| aTu guDuvu manasa nI vannilAgula borali | iTu galige nIku naihikavicAramulu ||

ca|| kOrikalakunu galige GOraparitApaMbu | kUrimiki galige nanukUladuHKamulu | tAratamyamulEni talapOtalaku galige | BAramainaTTi laMpaTamaneDimOpu ||

ca|| tanuvunaku galige saMtatamainatimmaTalu | manuvunaku galige nAmavikAramulu |

panilEni saMsAra baMdhaMbunaku galige | Ganamaina durita saMgatitODi celimi ||

ca|| dEhikini galige niMdriyamulanu bOdhiMpa | dEhaMbunaku galige teganisaMSayamu |

dEhAtmakuMDayina tiruvEMkaTESunaku | dEhidEhAMtarasthiti jUDagalige ||